16 ఏళ్ల దీక్షకు 90 ఓట్లు | Manipur Election Results shocker: 90 votes for Irom Sharmila's 16 years of fast | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల దీక్షకు 90 ఓట్లు

Published Sat, Mar 11 2017 4:33 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

16 ఏళ్ల దీక్షకు 90 ఓట్లు - Sakshi

16 ఏళ్ల దీక్షకు 90 ఓట్లు

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిలకు షాకిచ్చాయి. నిరంతరాయంగా 16 ఏళ్ల పాటు చేసిన దీక్షకు ఆమెకొచ్చిన ఓట్లు ఇరోం షర్మిల నివ్వెరపరిచాయి. కేవలం 90 ఓట్లే ఆమెకు అనుకూలంగా వచ్చాయి. 16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షకు స్వస్తి చెప్పిన ఇరోం షర్మిల రాజకీయాల్లోకి దిగనున్నట్టు ప్రకటించారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సీఎం ఓంకార్ ఇబోబీ సింగ్  కు వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. అయితే సీఎం అభ్యర్థి ఇబోబీ సింగే అఖండ విజయం సాధించారు. 18,649 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. నోటాకు వేసినన్నీ  ఓట్లు కూడా కనీసం ఇరోం షర్మిలకు రాలేదు.
 
పైన పేర్కొన్న అభ్యర్థెలవరూ తమకు ఇష్టం లేదని పేర్కొంటూ నోటాకు 143 ఓట్లు వేశారు. గతేడాది దీక్షను విరమిస్తున్న సందర్భంగా మణిపూర్ కు ముఖ్యమంత్రిగా గెలుపొంది, ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయడమే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్రస్తుత ఫలితాలు ఆమె లక్ష్యాన్ని నెరవేర్చేలా లేవు. ఆర్మీలకు ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇరోం చేసిన  నిరసన దీక్షకు మద్దతిచ్చిన పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఆమె రాజకీయాలకు దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రచార సందర్భంగాను ఇరోం షర్మిల ఒక్కతే సైకిళ్లపై తిరుగుతూ తన పార్టీని ప్రమోట్ చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement