
ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దు చేస్తాం!
ఇరోం షర్మిల పార్టీ మేనిఫెస్టో విడుదల
ఇంఫాల్: హక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఇటీవలే స్థాపించిన పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలియన్స్(పీఆర్‌జేఏ) పార్టీ మణిపూర్ ఎన్నికల కోసం తన మేనిఫోస్టోను విడుదల చేసింది. సాయుధ దళాల ప్రత్యేక చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు, మహిళలకు రిజర్వేషన్లు, అవినీతి అంతానికి లోకాయుక్త ఏర్పాటు లాంటి అంశాలకు అందులో ప్రాధాన్యమిచ్చారు.
ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థితిలో తాము ఉండకపోయినా ఈ మేనిఫెస్టో 2022 అసెంబ్లీ ఎన్నికలకు దార్శనిక పత్రంగా ఉంటుందని పార్టీ కన్వీనర్ ఇరెంద్రో లీచోన్‌బామ్ అన్నారు. తన 16 ఏళ్ల నిరాహార దీక్షని విరమిస్తూ... సాయుధ దళాల ప్రత్యేక చట్టం రద్దే ఏకైక లక్ష్యంగా ఎన్నికల్లో పోటీచేస్తానని షర్మిల ప్రతినబూనిన సంగతి తెలిసిందే. అమె పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో పోటీచేస్తోంది.