అనుకోని అదృష్టం: మంజుబాలకు రజతం
భారత హేమర్ త్రో క్రీడాకారిణి మంజుబాలకు అనుకోని అదృష్టం కలిసొచ్చింది. ఆసియా క్రీడల్లో ఆమె తొలుత కాంస్య పతకం గెలుచుకుంది. అయితే.. ఈ పోటీలో స్వర్ణపతకం సాధించిన చైనా క్రీడాకారిణి ఝాంగ్ వెంజియు డ్రగ్స్ వాడినట్లు డోప్ టెస్టులో తేలడంతో ఆమె నుంచి పతకం వెనక్కి తీసుకున్నారు.
జెరనాల్ అనే నిషేధిత డ్రగ్‌ను ఆమె వాడినట్లు డోప్ టెస్టులో తేలింది. దీంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తూ ఆమెకు ఇచ్చిన స్వర్ణపతకాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ప్రకటించింది. తొలుత ఈ పోటీలో రజత పతకం సాధించిన చైనా క్రీడాకారిణి వాంగ్ ఝెంగ్ ఇప్పుడు స్వర్ణపతకం సాధించింది. ఇంతకుముందు కాంస్యం సాధించిన మంజుబాలకు ఇప్పుడు రజతం లభించింది.