సెల్‌టవర్ ఎక్కిబోయి... అరెస్టు అయ్యాడు
కృష్ణా(మైలవరం): ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కేందు యత్నించి అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మైలవరంలో సోమవారం చోటుచేసుకుంది. బీసీ సంక్షేమ సంఘం మైలవరం నియోజకవర్గం అధ్యక్షుడు మన్నె సాంబశివరావు ఈ రోజు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపేందుకు యత్నించాడు.
దీంతో సిబ్బంది పోలీసులకు సమాచార మిచ్చారు. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచికత్తు పై విడుదల చేశారు.