Maoist blast
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ మావోయిస్టులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయాలపాలయ్యాడు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. విధుల్లో భాగంగా తొండమార్కా నుంచి ఎల్మగుండ గ్రామానికి సీఆర్పీఎఫ్ జవాను వెళుతున్నాడు. ఈ క్రమంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. జవాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని జిల్లా పోలీసు అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. జవాన్‌ను శ్రీకాంత్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూడా ఓ బీఎస్ఎఫ్ జవానుతోపాటు ఇద్దరు పెట్రోలింగ్ బృందం నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుడులో గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటివిడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్విగ్నంగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 సీట్లలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: Assembly Elections Polling Live Updates: మిజోరం, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో మావోయిస్ట్‌ల కలకలం
-
సరిహద్దుల్లో మావోయిస్టుల పేలుళ్లు
సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు మళ్లీ విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీ మందుపాతర పేల్చారు. సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్‌కు చెందిన జవాన్లు కూంబింగ్ కు వెళ్తుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. దీంతో జవాన్ మన్నాకుమార్ మౌర్యకు గాయాలయ్యాయి. వెంటనే ఇతడిని బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే.. దంతెవాడ జిల్లాలోని బార్సూర్–నారాయణపూర్ మార్గంలోని పుస్పాల్ వద్ద మావోయిస్టులు అమర్చిన ప్రెషర్బాంబు శుక్రవారం పేలింది. పోలీసులే లక్ష్యంగా ఈ బాంబును మావోయిస్టులు అమర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మావోల ఘాతుకం జరిగిందిలా..
మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లా కుర్ కేడ్ తాలుకా సమీపంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు జరుగుతుండగా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చేరుకుని మిక్చర్ ప్లాంట్‌తో పాటు 30 వాహనాలను దగ్దం చేశారు. ఉత్తర గడ్చిరోలి ప్రాంతంలో ఉన్న కుర్ కేడ్ తాలుకా కేంద్రం, ఛత్తీస్‌గఢ్ దండకారణ్య అటవీ ప్రాంతానికి చేరువలో ఉంటుంది. మొదట మావోయిస్టులు జాతీయ రహదారి నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న వాహనాలను, రోడ్డు నిర్మాణం కోసం కంకర మిక్చర్ తయారు చేసే యూనిట్‌ను పేల్చేశారు. ఈ సమచారం అందుకున్న బలగాలు ఘటనా స్థలానికి చేరుకునేందుకు రెండు వాహనాల్లో బయలు దేరాయి. అప్పటికే పొదల మాటున దాక్కున్న మావోయిస్టులు పోలీసుల వాహనాలను మందుపాతరలతో పేల్చేశారు. ఈ ఘటనలో దాదాపు 16 మంది సి-60 బెటాలియన్‌కు చెందిన జవాన్లు దుర్మరణం పాలయ్యారు. మరణించిన జవాన్లు వీరే.. గడ్చిరోలి జిల్లా కుర్ కేడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పేల్చివేసిన మందుపాతర ఘటనలో మరణించిన జవాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. సాహు దాత్ బాజీరావ్ మడావి, ప్రమోద్ మహదేవ్ రావ్ బోయర్, రాజూ నారాయణ్ గైక్వాడ్, కిషోర్ యశ్వంత్ , సంతోష్ దేవి దాస్ చౌహాన్, సర్జిరావ్ ఎక్ నాథ్, దయానంద్, భూపేష్ పాండ్ రంగ్ జీ, ఆరీఫ్ తౌషిక్ షేక్, యోగాజీ సీతారాం, పురాన్షా ప్రతాప్షా, లక్ష్మణ్ కేశవ్, అమ్రుత్ ప్రభుదాస్ బదాడే, అగ్రమాన్ భాక్షిరహాతే, నితిన్‌లు ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి మందుపాతర దుర్ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఘటన వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. జవాన్ల కుటంబాలకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఘటనా స్థలానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. మరో వైపున నక్సల్స్ ఏరివేత కోసం కుర్ కేడ్‌తో పాటు ఇంద్రావతి పరివాహక ప్రాంతంలో పోలీసు అధికారులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
పోలింగ్ బూత్ సమీపంలో పేలిన మందుపాతర
ఖమ్మం : ఖమ్మం జిల్లా చర్ల మండలం ఉంజపల్లి పోలీస్ కేంద్రం సమీపంలో మావోయిస్టులు భారీ మందుపాతర పేల్చారు. ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం రావటంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఈ నేపథ్యంలో ఉంజపల్లికి పోలీసులు భారీగా తరలి వెళుతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఆర్మీ హెలీకాఫ్టర్లను వినియోగిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం కావడంతో ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే సాయుధ దళాలను తరలించడానికి రెండు హెలీకాఫ్టర్లను సిద్ధంగా ఉంచారు. మందుపాతర, మావోయిస్టులు, ఉంజపల్లి, ఆదిలాబాద్, naxals, Maoist blast, unjapalli, adilabad