సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు మళ్లీ విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీ మందుపాతర పేల్చారు. సీఆర్‌పీఎఫ్ 168 బెటాలియన్‌కు చెందిన జవాన్లు కూంబింగ్ కు వెళ్తుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. దీంతో జవాన్ మన్నాకుమార్ మౌర్యకు గాయాలయ్యాయి. వెంటనే ఇతడిని బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే.. దంతెవాడ జిల్లాలోని బార్సూర్–నారాయణపూర్ మార్గంలోని పుస్పాల్ వద్ద మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌బాంబు శుక్రవారం పేలింది. పోలీసులే లక్ష్యంగా ఈ బాంబును మావోయిస్టులు అమర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment