పాకిస్థాన్‌లో భూకంపం
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1 గా నమోదయిందని మీడియా వెల్లడించింది. ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, అబోటాబాద్తోపాటు పర్వత ప్రాంతాల్లో భూమి కంపించిందని తెలిపింది. భూకంప తాకిడికి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు భయంతో పరుగులు తీశారని పేర్కొంది.
ఇస్లామాబాద్‌కి ఈశాన్యంగా 15 కిలోమీటర్ల దూరంలోని మర్గల్లా పర్వతాల్లో 26 కిలోమీటర్ల కింద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) వెల్లడించిందని తెలిపింది. అయితే ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ జరగలేదని మీడియా పేర్కొంది.