హీరోయిన్ టాటూ వేస్తానంటే వద్దన్న హీరో
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్ టాటూ వేయించుకోవడానికి నిరాకరించాడు. 'సూసైడ్ స్క్వాడ్' సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ మార్గట్ రాబీ.. స్మిత్ కు టాటూ వేసేందుకు ఉత్సాహం చూపించగా అతడు అయిష్టత వ్యక్తం చేశాడు. షూటింగ్ లో టాటూ గన్ పట్టుకుని పచ్చబొట్టు పొడిచేందుకు ఆమె ప్రయత్నించగా విల్ ఒప్పుకోలేదు.
'నా దగ్గర టాటూ గన్ ఉంది. పచ్చ బొట్టు పొడవమంటావా' అని మార్గట్ రాబీ అడగ్గా.. విల్ స్మిత్ వద్దని వారించాడు. టాటూ స్కిల్ చూపించాలన్న ఉత్సాహంపై స్మిత్ నీళ్లు చల్లాడని రాబీ వ్యాఖ్యానించింది. సహ నటుడు కోయిల్ కినర్మాన్ కు స్మిత్ టాటూ పెట్టడం విశేషం.