mariya
-
ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఏడాది పాటు కొనసాగనున్న 73వ సెషన్‌కు ఆమె నేతృత్వం వహిస్తారు. ఏడు దశాబ్దాల ఐరాస చరిత్రలో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళ మరియా కావడం గమనార్హం. 1953లో భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 1969లో లైబీరియాకు చెందిన ఎలిజబెత్ బ్రూక్స్, 2006లో బహ్రెయిన్‌కు చెందిన షేకా హయా రషెద్ అల్ ఖలీఫాలు అధ్యక్షులుగా పనిచేశారు. ఐరాసలో 198 సభ్య దేశాలుండగా.. మంగళవారం రహస్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికలో మరియాకు 128 ఓట్లు దక్కగా.. ఫ్లేక్కు 62 ఓట్లు పడ్డాయి. -
సిస్టర్ మరియాను ‘బ్లెస్డ్’గా ప్రకటించిన వాటికన్
భోపాల్/ఇండోర్ : కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని రాణి మరియా వట్టాలిని వాటికన్లో రోమన్ కేథలిక్ చర్చి దీవెన పొందిన(బ్లెస్డ్) వ్యక్తిగా ప్రకటించింది. ఇండోర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ నుంచి వచ్చిన ప్రకటనను కార్డినల్ ఏంజెలో అమాటో చదివి వినిపించారు. పునీత(సెయింట్‌హుడ్)కు ముందు హోదానే బ్లెస్డ్.. ఈ కార్యక్రమంలో మరియాను కత్తితో పొడిచి చంపిన హంతకుడు కూడా పాల్గొనడం గమనార్హం. సిస్టర్ రాణిగా పేరుపడ్డ మరియా 1995లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హత్యకు గురయ్యారు. దేవాస్ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తుండగా హంతకుడు ఆమెను 50 సార్లు పొడిచి హత్య చేశాడు. -
పోలండ్ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి..
బంజారాహిల్స్: ఖండాతరాలు దాటిన ప్రేమ.. పెళ్ళికి దారి తీసింది. పోలండ్‌కు చెందిన యువతితో హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ వివాహం గురువారం మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. లండన్‌లో ఉద్యోగం చేస్తున్న సుధాకర్‌కు తనతో పాటు పని చేస్తున్న మరియతో పరిచయం ఏర్పడింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, వివాహ నేపథ్యానికి ముగ్ధురాలైన మరియ తన పెళ్ళిని హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని నిశ్చయించుకొని ఆమేరకు ఇక్కడే పెళ్ళి చేసుకుంది. పెద్దల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా మరియ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెహిదీపట్నం చెందిన చెన్నూరి శ్రీనివాసులు, చెన్నూరి లక్ష్మి దంపతుల కుమారుడు సుధాకర్ తాను ప్రేమించిన యువతితో పెళ్ళి జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. మూడు ముళ్లు.. ఏడు అడుగులు, తలంబ్రాలు.. వేదమంత్రాలు.. పెద్దల ఆశీస్సుల మధ్య ఇలా పెళ్ళి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మరియ తెలిపింది. పట్టుచీరలో ధగధగ మెరిసిపోతూ ఆమె సందడి చేసింది.