‘జనగణమన’పై స్పష్టతనిచ్చిన సుప్రీం
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించేటప్పుడు గౌరవసూచకంగా ఎప్పుడు నిలబడలన్నదానిపై పలు సందర్భాల్లో ఎదురవుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు మంగళవారం తెరదించింది.
సినిమా ప్రారంభానికి ముందు మాత్రమే జాతీయగీతం వస్తున్నప్పుడు గౌరవసూచకంగా లేచి నిలబడాలని స్పష్టం చేసింది. సినిమాకథ, న్యూస్‌రీల్, డాక్యుమెంటరీల్లో భాగంగా వచ్చే జాతీయ గీతానికి లేచి నిలబడాల్సిన అవసరం లేదని జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిల ధర్మాసనం చెప్పింది.