market chairman
-
కోడ్ రానున్న నేపథ్యంలో పదవుల పందేరం!
సాక్షి, తాడేపల్లిగూడెం: ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టినట్టుగా కనపడుతోంది. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూలు దాదాపుగా విడుదల కానుందనే సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పార్టీలో ఉండేదెవ్వరో., గోడ దూకేదెవ్వరో తెలియని సందిగ్ధ స్థితి నెలకొని ఉంది. ఉన్న వాళ్లను కాపాడుకునే క్రమంలో అసంతృప్తులను చల్లార్చుకొనేందుకు పదవుల పందేర కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ క్రమంలో త్వరలో గూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీని ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా నియామకపు ఉత్తర్వులు ఇస్తారని తెలుస్తోంది. పెంటపాడుకు చెందిన డీసీసీబి డైరెక్టర్ దాసరి అప్పన్న సతీమణి దాసరి కృష్ణవేణికి చైర్మన్ పదవి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. వైస్ చైర్మన్‌గా పట్టణంలోని 32వ వార్డుకు చెందిన రామిశెట్టి సురేష్‌ను నియమిస్తారని తెలుస్తోంది. గతంలో వీసీ పదవికి రాజీనామా చేసిన గొర్రెల శ్రీధర్‌కు ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవినిచ్చి ఆకర్ష పథకాన్ని అమలు చేసింది. విధులు, నిధులు లేని టైలర్స్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఆకాశం స్వామిని నియమించారు. మునిసిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం పోటీపడి ఫలితం పొందలేక పోయిన కాపు సామాజిక వర్గానికి చెందిన 32వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి సురేష్‌కు ఏఎంసీ వైస్ చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సైకిల్ దిగి వెళ్లకుండా టీడీపీ కట్టడి చేసుకున్నట్టుగా కనపడుతోంది. -
అనారోగ్యంతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మృతి
చెన్నారావుపేట: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, తెలంగాణ తొలి, మలి ఉద్యమకారుడు నామాల కృష్ణమూర్తి (56) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి శుక్రవారం రాత్రి భోజనం చేశారు. అనంతరం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కృష్ణమూర్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య సోమక్క, కుమారులు అనిల్, మధు, శ్రీనులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర.. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణమూర్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ రాజకీయంలో కాంగ్రెస్ సేవాదల్ జిల్లా ఆర్గనైజర్‌గా, యూత్ కాంగ్రెస్ మండల కార్యదర్శిగా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విజయశాంతి ఆధ్వర్యంలో తల్లి తెలంగాణ పార్టీ తరపున మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీలో చేరి మండల కార్యదర్శిగా కొనసాగాడు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగుతున్న మలి దశ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించాడు. తెలంగాణ ఉద్యమంలో 2009 ఆగస్టు 27న సీఎం కేసీఆర్ మొట్టమొదటిగా పల్లెనిద్ర కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గంలోని గురిజాల గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో రెండు రోజులు కృష్ణమూర్తి ఇంటిలో పల్లెనిద్ర చేసి గ్రామాలలో సమస్యలు తెలుసుకున్నారు. మూడు నెలల క్రితం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. -
త్వరలో శనగ కొనుగోళ్లు ప్రారంభం
జైనథ్ : మండలకేంద్రంలోని మార్కెట్ యార్డులో త్వరలోనే శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్ డీఎం పుల్లయ్య, మార్కెటింగ్‌శాఖ ఏడీఎం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కొనుగోలు కేంద్రాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీరు, నీడకోసం చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన రైతులను న్యాయం జరిగేలా కూపన్లు జారీ చేసి తేదీల వారీగా కొనుగోలు చేపట్టాలన్నారు. దళారులకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, బేల ఎంపీపీ రఘుకుల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ తల్లెల చంద్రయ్య, ఏఎంపీ వైఎస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, నాయకులు గంభీర్ టాక్రే, పూండ్రు వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ బొల్లెం ప్రభాకర్, ఏఎంసీ కార్యరద్శి శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారి వివేక్ పాల్గొన్నారు. -
కార్మికుల పీఎఫ్ మాయం!
- కార్మికులకు చేరని రూ.80 లక్షలు - ఓ మార్కెట్ చైర్మన్ నిర్వాకం సాక్షి, పెద్దపల్లి: ఆయనో అధికార పార్టీ నాయకుడు. పైగా జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షుడు. మంథని ప్రాంతంలోని ఓ సోలార్ పవర్ ప్లాంట్‌లో లేబర్ కాంట్రాక్టర్ కూడా. కార్మికులను మోసం చేసి పీఎఫ్ స్వాహా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మంథనికి సమీపంలోని ఓ సొలార్ ఎక్స్‌ప్లోజివ్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 132 మంది కాంట్రాక్ట్ కార్మికులకు, సోలార్ ప్లాంట్ యాజమాన్యం సదరు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లిస్తోంది. దీనికోసం దాదాపు 12.5 శాతం కమీషన్ ఆయనకు వస్తుంది. ఒక్కో కార్మికుడికి రూ.1017 చొప్పున సదరు కాంట్రాక్టర్ పీఎఫ్ కోసం చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.1017 లను జమ చేస్తుంది. ఇటీవల పీఎఫ్ తీసుకుందామని కార్మికులు అధికారులను కలిస్తే జమ కాలేదని తేలింది. సుమారు రూ.80 లక్షల వరకు పీఎఫ్ బకాయిలు కార్మికులకు చెల్లించాలి. కార్మికులు మూడురోజుల క్రితం ప్లాంట్ ముందు ఆందోళనకు దిగారు. గోదావరిఖని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కార్మికులకు రావా ల్సిన పీఎఫ్‌ను 9వ తేదీలోగా లెక్కించి ఇస్తానని కాంట్రాక్టర్ ‘ఒప్పంద పత్రం’ రాసిచ్చారు. కానీ, మళ్లీ రాజకీయ ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
మార్కెట్ బంద్
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్రయవిక్రయూలు నిలిచిపోయూరుు. మార్కెట్లోని అడ్తిదారులు, గుమస్తాలు ఏకమై కొనుగోళ్లు నిలిపేశారు. జీరో దందాతో తమకు ప్రమేయం లేదని....తాము దొంగలం కాదంటూ మార్కెట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇలా కొనుగోళ్లు నిలిపివేయడం తగదని... ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం.. చాంబర్‌కు రండి... సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అరుునా... వారు వినకుండా అలానే ఆందోళన కొనసాగించారు. సుమారు ఐదు గంటలపాటు కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతుల్లో అసహనం వ్యక్తమైంది. అడ్తిదారులు, గుమాస్తాలు ధర్నా చేస్తున్న ప్రాంతం వద్దకు దుగ్గొండి మండలం బిక్కోజుపల్లె గ్రామానికి చెందిన రైతు గుండెకారి మలహల్రావు చేరుకుని కొనుగోళ్లకు రావాల్సిందిగా వారిని కోరారు. మార్కెట్లో నానా రకాల దందాలు జరగడం మాములేనని... ఎంతో మంది అడ్తిదారులు తెల్లకాగితాలు, చిల్లర పేపర ్లమీద చిట్టా పద్దులు రాసి ఇచ్చారని.... తనవద్ద నాలుగైదు తెల్లపేపర్లు ఉన్నాయన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు అడ్తిదారులు, గుమస్తాలు మలహల్రావుపై దాడి చేశారు. గమనించిన మార్కెట్ సూపర్వైజర్ వి.వెంకటేశ్వర్లు ఆ రైతును అక్కడి నుంచి తప్పించి, పోలీసులకు సమాచారం అందించారు. మార్కెట్ చైర్మన్, కార్యదర్శితో వాగ్వాదం ఎట్టకేలకు అడ్తి, గుమస్తా సంఘం ప్రతినిధులు మార్కెట్ చాంబర్లో చైర్మన్ మందా వినోద్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్‌తో సమావేశమయ్యూరు. మార్కెట్ పుట్టినప్పటి నుంచి జీరో దందా నడుస్తోందని... జీరో దందా పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదంటూ మార్కెట్ కార్యదర్శిపై ఓ అడ్తిదారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట మాటకు బైలా అంటూ బెదిరిస్తున్నావని... దీనంతటికీ కార్యదర్శే కారణం అంటూ శ్రీనివాస్‌తోపాటు చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో జిల్లాకు చెందిన ప్రముఖ పత్తి ఖరీదుదారుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి కల్పించుకుని అందరికి నచ్చజెప్పేందుకు యత్నించాడు. పాత విషయాలు తీయొద్దని... తాము దొంగలం కాదని, ఖరీదుదారులే అసలు దోషులంటూ కొందరు అడ్తిదారులు ఆయనతో వాదనకు దిగారు. మార్కెట్ డెరైక్టర్లు పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మరికొందరు మండిపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్ జోక్యం చేసుకుని అందరినీ సముదాయించారు. ఇది మంచి పద్ధతి కాదు... ఏదైనా ఉంటే మార్కెట్ పాలకవర్గంతో చర్చించి బంద్ నిర్ణయం తీసుకోవాలి... తీరా రైతులు మార్కెట్‌కు వచ్చాక మార్కెట్ బంద్ చేయడం సబబు కాదన్నారు. ముందుగా యార్డుల్లోకెళ్లి కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ అందరినీ మార్కెట్లోకి పంపించారు. ఈ క్రమంలో క్రయవిక్రయాలు ఆలస్యం కావడంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకోగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. ఎవరి బస్తాల వద్దకు వారు వెళ్లాలని... త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పోలీసులు, మార్కెట్ ఉద్యోగులు వారికి నచ్చజెప్పి పంపిం చారు. ఎట్టకేలకు ఐదు గంటల ఆలస్యంగా మధ్యాహ్న 2 గంటలకు మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వేచి చూశా... మార్కెట్లో కొనుగోళ్లు ఎందుకు నిలిచిపోయాయో నాకు తెలియదు. ఉదయం నుంచి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నా. ఎవరు కూడా బస్తాల వైపు కన్నెత్తి చూడలేదు. మమ్మల్ని పట్టించుకునేటోళ్లే లేరు. -సుధాకర్, పత్తి రైతు, గవిచర్ల ఎందుకు బంద్ చేశారో తెలవదు.. మార్కెట్లో పదేళ్లుగా హమాలీగా పనిచేస్తున్నా. ఎప్పుడు ఇలాంటి వింత పరిస్థితి ఎదురు కాలేదు. ఎవరు గొడవ చేస్తున్నారు.. ఎందుకు గొడవ చేస్తున్నారు.. కాంటాలు ఎందుకు నిలిచిపోయాయో ఏమీ అర్థం కావడం లేదు. - లక్ష్మణ్,హమాలీ, ఖిలావరంగల్ కొనమంటే కొడతారా ? అడ్తి, గుమస్తాలు కాంటాలు బంద్ చేసి ధర్నా చేస్తుంటే వారి వద్దకు వెళ్లాను. నా పంట సరుకులు కొనుగోలు చేయమని ఒకటికి రెండు సార్లు అడిగితే .. అందరు కలిసి కొట్టారు. మార్కెట్లో సరుకులు కొనమంటే కొడతారా.. - జి.మలహల్రావు, పత్తి రైతు, బిక్కోజుపల్లె