కార్మికుల పీఎఫ్‌ మాయం! | Workers Pf theft by the Market Chairman | Sakshi
Sakshi News home page

కార్మికుల పీఎఫ్‌ మాయం!

Published Sun, Sep 3 2017 3:16 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

Workers Pf theft by the Market Chairman

- కార్మికులకు చేరని రూ.80 లక్షలు   
ఓ మార్కెట్‌ చైర్మన్‌ నిర్వాకం 
 
సాక్షి, పెద్దపల్లి: ఆయనో అధికార పార్టీ నాయకుడు. పైగా జిల్లాలోని ఓ వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి అధ్యక్షుడు. మంథని ప్రాంతంలోని ఓ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌లో లేబర్‌ కాంట్రాక్టర్‌ కూడా.  కార్మికులను మోసం చేసి పీఎఫ్‌ స్వాహా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.  మంథనికి సమీపంలోని ఓ సొలార్‌ ఎక్స్‌ప్లోజివ్‌ ప్లాంట్‌లో  పనిచేస్తున్న 132 మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు, సోలార్‌ ప్లాంట్‌ యాజమాన్యం సదరు కాంట్రాక్టర్‌ ద్వారా జీతాలు చెల్లిస్తోంది. దీనికోసం దాదాపు 12.5 శాతం కమీషన్‌ ఆయనకు వస్తుంది. ఒక్కో కార్మికుడికి రూ.1017 చొప్పున సదరు కాంట్రాక్టర్‌ పీఎఫ్‌ కోసం చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.1017 లను జమ చేస్తుంది.

ఇటీవల పీఎఫ్‌ తీసుకుందామని కార్మికులు అధికారులను కలిస్తే జమ కాలేదని తేలింది. సుమారు రూ.80 లక్షల వరకు పీఎఫ్‌ బకాయిలు కార్మికులకు చెల్లించాలి. కార్మికులు మూడురోజుల క్రితం ప్లాంట్‌ ముందు ఆందోళనకు దిగారు. గోదావరిఖని టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో  కార్మికులకు రావా ల్సిన పీఎఫ్‌ను 9వ తేదీలోగా లెక్కించి ఇస్తానని కాంట్రాక్టర్‌ ‘ఒప్పంద పత్రం’ రాసిచ్చారు. కానీ, మళ్లీ రాజకీయ ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement