కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్రయవిక్రయూలు నిలిచిపోయూరుు. మార్కెట్‌లోని అడ్తిదారులు, గుమస్తాలు ఏకమై కొనుగోళ్లు నిలిపేశారు. జీరో దందాతో తమకు ప్రమేయం లేదని....తాము దొంగలం కాదంటూ మార్కెట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇలా కొనుగోళ్లు నిలిపివేయడం తగదని... ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం.. చాంబర్‌కు రండి... సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అరుునా... వారు వినకుండా అలానే ఆందోళన కొనసాగించారు. సుమారు ఐదు గంటలపాటు కొనుగోళ్లు నిలిచిపోవడంతో మార్కెట్‌కు పంట ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతుల్లో అసహనం వ్యక్తమైంది.
అడ్తిదారులు, గుమాస్తాలు ధర్నా చేస్తున్న ప్రాంతం వద్దకు దుగ్గొండి మండలం బిక్కోజుపల్లె గ్రామానికి చెందిన రైతు గుండెకారి మలహల్‌రావు చేరుకుని కొనుగోళ్లకు రావాల్సిందిగా వారిని కోరారు. మార్కెట్‌లో నానా రకాల దందాలు జరగడం మాములేనని... ఎంతో మంది అడ్తిదారులు తెల్లకాగితాలు, చిల్లర పేపర ్లమీద చిట్టా పద్దులు రాసి ఇచ్చారని.... తనవద్ద నాలుగైదు తెల్లపేపర్లు ఉన్నాయన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు అడ్తిదారులు, గుమస్తాలు మలహల్‌రావుపై దాడి చేశారు. గమనించిన మార్కెట్ సూపర్‌వైజర్ వి.వెంకటేశ్వర్లు ఆ రైతును అక్కడి నుంచి తప్పించి, పోలీసులకు సమాచారం అందించారు.
మార్కెట్ చైర్మన్, కార్యదర్శితో వాగ్వాదం
ఎట్టకేలకు అడ్తి, గుమస్తా సంఘం ప్రతినిధులు మార్కెట్ చాంబర్‌లో చైర్మన్ మందా వినోద్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్‌తో సమావేశమయ్యూరు. మార్కెట్ పుట్టినప్పటి నుంచి జీరో దందా నడుస్తోందని... జీరో దందా పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదంటూ మార్కెట్ కార్యదర్శిపై ఓ అడ్తిదారుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట మాటకు బైలా అంటూ బెదిరిస్తున్నావని... దీనంతటికీ కార్యదర్శే కారణం అంటూ శ్రీనివాస్‌తోపాటు చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో జిల్లాకు చెందిన ప్రముఖ పత్తి ఖరీదుదారుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి కల్పించుకుని అందరికి నచ్చజెప్పేందుకు యత్నించాడు. పాత విషయాలు తీయొద్దని... తాము దొంగలం కాదని, ఖరీదుదారులే అసలు దోషులంటూ కొందరు అడ్తిదారులు ఆయనతో వాదనకు దిగారు. మార్కెట్ డెరైక్టర్లు పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మరికొందరు మండిపడ్డారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మందా వినోద్‌కుమార్ జోక్యం చేసుకుని అందరినీ సముదాయించారు.
ఇది మంచి పద్ధతి కాదు... ఏదైనా ఉంటే మార్కెట్ పాలకవర్గంతో చర్చించి బంద్ నిర్ణయం తీసుకోవాలి... తీరా రైతులు మార్కెట్‌కు వచ్చాక మార్కెట్ బంద్ చేయడం సబబు కాదన్నారు. ముందుగా యార్డుల్లోకెళ్లి కొనుగోళ్లు చేపట్టాలని కోరుతూ అందరినీ మార్కెట్‌లోకి పంపించారు. ఈ క్రమంలో క్రయవిక్రయాలు ఆలస్యం కావడంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకోగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. ఎవరి బస్తాల వద్దకు వారు వెళ్లాలని... త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పోలీసులు, మార్కెట్ ఉద్యోగులు వారికి నచ్చజెప్పి పంపిం చారు. ఎట్టకేలకు ఐదు గంటల ఆలస్యంగా మధ్యాహ్న 2 గంటలకు మార్కెట్‌లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి.
ఉదయం నుంచి వేచి చూశా...
మార్కెట్‌లో కొనుగోళ్లు ఎందుకు నిలిచిపోయాయో నాకు తెలియదు. ఉదయం నుంచి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నా. ఎవరు కూడా బస్తాల వైపు కన్నెత్తి చూడలేదు. మమ్మల్ని పట్టించుకునేటోళ్లే లేరు.
-సుధాకర్, పత్తి రైతు, గవిచర్ల
ఎందుకు బంద్ చేశారో తెలవదు..
మార్కెట్‌లో పదేళ్లుగా హమాలీగా పనిచేస్తున్నా. ఎప్పుడు ఇలాంటి వింత పరిస్థితి ఎదురు కాలేదు. ఎవరు గొడవ చేస్తున్నారు.. ఎందుకు గొడవ చేస్తున్నారు.. కాంటాలు ఎందుకు నిలిచిపోయాయో ఏమీ అర్థం కావడం లేదు.
- లక్ష్మణ్,హమాలీ, ఖిలావరంగల్
కొనమంటే కొడతారా ?
అడ్తి, గుమస్తాలు కాంటాలు బంద్ చేసి ధర్నా చేస్తుంటే వారి వద్దకు వెళ్లాను. నా పంట సరుకులు కొనుగోలు చేయమని ఒకటికి రెండు సార్లు అడిగితే .. అందరు కలిసి కొట్టారు. మార్కెట్‌లో సరుకులు కొనమంటే కొడతారా..
- జి.మలహల్‌రావు, పత్తి రైతు, బిక్కోజుపల్లె
మార్కెట్ బంద్
Published Wed, Jan 8 2014 4:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement