Market Panchagam
-
సెన్సెక్స్ కీలకస్థాయి 38,540
చాలావారాల తర్వాత ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ ఒక్కసారిగా గతవారం కుదుపునకు లోనయ్యాయి. అయితే ఆర్థిక వ్యవస్థల్లో వెల్లువెత్తుతున్న లిక్విడిటీ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్ను ఇప్పట్లో అంచనా వేయలేము. కానీ గతవారం మొదలైన చిన్నపాటి కరెక్షన్ ప్రభావంతో భవిష్యత్ ర్యాలీలో రంగాలవారీగా, షేర్లవారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇక భారత్ స్టాక్ సూచీల స్వల్పకాలిక సాంకేతిక అంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో గత మార్కెట్ పంచాంగంలో సూచించిన రీతిలో 40,010 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్, అటుతర్వాత 1,750 పాయింట్ల వరకూ పతనమై 38,249 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,190 పాయింట్ల భారీ నష్టంతో 38,357పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ కు 38,540 పాయింట్లస్థాయి స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సెన్సెక్స్ బలహీనంగానూ, పైన బలంగానూ ట్రేడ్ కావొచ్చు. ఈ స్థాయిపైన 38,730 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటి, ముగిస్తే 38,950 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 39.240 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 38,130 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 37,780 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే 37,550 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. నిఫ్టీ మద్దతు తక్షణ మద్దతు 11,560 గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,794 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత, 11,303 వద్దకు పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 314 పాయింట్ల నష్టంతో 11,334 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 11,365 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయిపైన స్థిరపడితే 11,450 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,510 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 11,585 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. ఈ వారం నిఫ్టీ 11,365 పాయింట్ల దిగువన ట్రేడవుతూ వుంటే 11,250 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 11,145 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 11,065 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభిస్తున్నది. – పి. సత్యప్రసాద్ -
24,800 దిగువన మరింత క్షీణత
మార్కెట్ పంచాంగం భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్లకు కీలకమైన వారం రానే వచ్చింది. డిసెంబర్ 15-16వ తేదీల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ జరిపే సమీక్షా సమావేశంలో పావు శాతం వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాల్లో మార్కెట్ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. ఈ కారణంగా ఆ రోజునాటి ఫెడ్ నిర్ణయం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించకపోవొచ్చు. కానీ ఆ సందర్భంగా ఫెడ్ ఛైర్పర్సన్ చేసే వ్యాఖ్యల ప్రభావం రానున్న వారాలు, నెలల్లో భారత్ వంటి వర్థమాన మార్కెట్‌పై వుంటుంది. అలాగే ఈ వారమే రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ సందర్భంగా తీసుకునే నిర్ణయం కూడా రానున్న వారాల్లో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించవచ్చు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు డిసెంబర్ 11తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ మరో 594 పాయింట్ల భారీ నష్టంతో 25,044 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీగా క్షీణించిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో సెన్సెక్స్ మొదలైతే 24,800 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు వుంది. ఈ మద్దతు ఈ ఏడాది ఇప్పటికే సూచీని రెండు దఫాలు పరిరక్షించినందున, ఈ స్థాయి దిగువనే గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలై, వెనువెంటనే కోలుకోకపోతే, సెన్సెక్స్ నిలువునా 24,400-24,500 పాయింట్ల శ్రేణికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఆ స్థాయిని కూడా ఈ వారంలో కోల్పోతే 24,100 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున 23,767 పాయింట్ల మద్దతు సెన్సెక్స్‌కు కీలకమైనది. 2013 ఆగస్టు కనిష్టస్థాయి 17,448 పాయింట్ల నుంచి ఈ ఏడాది మార్చినాటి రికార్డుస్థాయి 30,025 పాయింట్ల వరకూ జరిగిన 12,577 పాయింట్ల ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 23,767 పాయింట్లు. ఈ వారం మధ్యలో సెన్సెక్స్ క్షీణించినా, తిరిగి 25,000 పాయింట్లస్థాయిపైన స్థిరపడగలిగితే, వేగంగా 25,320 స్థాయిని అందుకోవొచ్చు. ఆటుపైన క్రమేపీ 25,830 పాయింట్లవద్దకు చేరవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే తదుపరి నిరోధ స్థాయిలు 26,050, 26,250 పాయింట్లు. నిఫ్టీ తొలి అవరోధం 7,855 ఎన్ఎస్ఈ నిఫ్టీ 172 పాయింట్ల నష్టంతో 7,610 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ మొదలైతే 7,540 పాయింట్ల స్థాయి తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువనే నిఫ్టీ మొదలై, వేగంగా కోలుకోకపోతే 7,420-7,500 మద్దతు శ్రేణి వద్దకు క్షీణించవచ్చు. ఆ లోపున 7,220- 7,350 పాయింట్ల శ్రేణి వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ స్థాయిని కూడా వదులుకుంటే కీలకమైన 7,120 పాయింట్ల స్థాయికి (గతంలో 5,118 పాయింట్ల నుంచి 9,119 పాయింట్ల వరకూ జరిగిన ర్యాలీలో 50 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి ఇది) పడిపోవొచ్చు. ఈ వారం పతనం జరిగినా, తిరిగి 7,540 పాయింట్ల స్థాయిపైన స్థిరపడితే 7,700 పాయింట్ల వద్దకు ర్యాలీ జరపవచ్చు. ఆపైన 7,820 స్థాయి వరకూ పెరిగే ఛాన్స్ వుంటుంది. అటుపైన ముగిస్తే 7,980 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. -
28,690 దిగువన అమ్మకాల ఒత్తిడి
మార్కెట్ పంచాంగం అమెరికాలో జూన్ నెలలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు ఇటీవల ఊపందుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి మార్కెట్లో లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్లు కన్పిస్తున్నది. దేశీయ మార్కెట్‌కు సంబంధించి, రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం, పార్లమెంటులో బీమా బిల్లు ఆమోదం పొందడం వంటి రెండు సానుకూల వార్తలు ఈ నెలలోనే వెలువడ్డాయి. ఈ వార్తలు వచ్చిన రెండు సందర్భాల్లోనూ స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి పతనమయ్యాయి. అనుకూల సమయాల్లో జరుగుతున్న అమ్మకాలను లాభాల స్వీకరణగా పరిగణించవచ్చు. ఇన్వెస్టర్ల పెట్టుబడి శైలికి సంబంధించి ఇది సహజ పరిణామమే. ఆందోళనకారకం కాదు. సెన్సెక్స్ సాంకేతికాంశాలు..., మార్చి 13తో ముగిసిన వారం తొలిరోజున 29,321 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరిరోజున 28,448 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 946 పాయింట్ల భారీనష్టంతో 28,503 పాయింట్ల వద్ద ముగిసింది. కొద్దివారాల నుంచి ఈ కాలమ్స్‌లో ప్రస్తావిస్తున్న 28,880-28,690 పాయింట్ల కీలక మద్దతుశ్రేణిని సెన్సెక్స్ కోల్పోయినందున, వెనువెంటనే ఈ శ్రేణిపైకి పెరగలేకపోతే, అమ్మకాల ఒత్తిడి కొనసాగే ప్రమాదం వుంటుంది. ఈ వారం 28,690 పాయింట్ల దిగువనే సూచీ స్థిరపడితే, వచ్చే కొద్దిరోజుల్లో క్రమేపీ 27,827 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. డిసెంబర్ 17 నాటి కనిష్టస్థాయి 26,469 పాయింట్ల నుంచి మార్చి 4నాటి రికార్డుస్థాయి 30,025 వరకూ జరిగిన ర్యాలీలో 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 27,827 పాయింట్లు. అమెరికా మార్కెట్ శుక్రవారం బలహీనంగా ముగిసిన ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో భారత్ మార్కెట్ మొదలైతే 28,250 పాయింట్ల సమీపంలో తాత్కాలిక మద్దతు పొందవచ్చు. ఆ దిగువన 28,040 స్థాయివరకూ పతనం కావొచ్చు. ఆ లోపున క్రమేపీ పైన ప్రస్తావించిన 27,827 స్థాయికి తగ్గవచ్చు. తొలిస్థాయి వద్ద మద్దతు పొందగలిగితే 28,690 స్థాయివకరూ తొలుత పెరగవచ్చు. తదుపరి నిరోధస్థాయిలు 28,840, 28,970 పాయింట్లు. మార్కెట్లో తిరిగి అప్‌ట్రెండ్ నెలకొనాలంటే 29,184 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటి ముగియాల్సివుంటుంది. నిఫ్టీ తక్షణ మద్దతు 8,540 ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,891 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 8,632 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 290 పాయింట్ల నష్టంతో 8,648 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ ప్రారంభమైతే 8,540 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 8,470 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున క్రమేపీ 8,403 పాయింట్ల స్థాయికి (7,961 నుంచి 9,119 వరకూ జరిగిన ర్యాలీలో ఇది 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి) కొద్దిరోజుల్లో క్షీణించవచ్చు. ఈ వారం తొలిస్థాయి వద్ద మద్దతు పొందితే 8,670 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,755 స్థాయికి పెరగవచ్చు. అటుపైన 8,790 పాయింట్ల అవరోధస్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 8,850 స్థాయిని అధిగమించి, స్థిరపడాల్సివుంటుంది.