చాలావారాల తర్వాత ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ ఒక్కసారిగా గతవారం కుదుపునకు లోనయ్యాయి. అయితే ఆర్థిక వ్యవస్థల్లో వెల్లువెత్తుతున్న లిక్విడిటీ కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్‌ను ఇప్పట్లో అంచనా వేయలేము. కానీ గతవారం మొదలైన చిన్నపాటి కరెక్షన్ ప్రభావంతో భవిష్యత్ ర్యాలీలో రంగాలవారీగా, షేర్లవారీగా మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇక భారత్ స్టాక్ సూచీల స్వల్పకాలిక సాంకేతిక అంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో గత మార్కెట్ పంచాంగంలో సూచించిన రీతిలో 40,010 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్, అటుతర్వాత 1,750 పాయింట్ల వరకూ పతనమై 38,249 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 1,190 పాయింట్ల భారీ నష్టంతో 38,357పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్ కు 38,540 పాయింట్లస్థాయి స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సెన్సెక్స్ బలహీనంగానూ, పైన బలంగానూ ట్రేడ్ కావొచ్చు. ఈ స్థాయిపైన 38,730 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటి, ముగిస్తే 38,950 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 39.240 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 38,130 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన 37,780 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే 37,550 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.
నిఫ్టీ మద్దతు తక్షణ మద్దతు 11,560
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,794 పాయింట్ల గరిష్టస్థాయిని తాకిన తర్వాత, 11,303 వద్దకు పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 314 పాయింట్ల నష్టంతో 11,334 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 11,365 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయిపైన స్థిరపడితే 11,450 పాయింట్ల సమీపంలో నిఫ్టీకి తొలి అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే 11,510 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని దాటితే 11,585 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. ఈ వారం నిఫ్టీ 11,365 పాయింట్ల దిగువన ట్రేడవుతూ వుంటే 11,250 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 11,145 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఈ లోపున 11,065 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభిస్తున్నది.
– పి. సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment