market research
-
అమ్మకాల్లో ఆన్‌లైన్‌దే హవా..
కోల్‌కతా: కొద్దిరోజులపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను నిలువరించిన కోవిడ్–19 శకం ముగిసినప్పటికీ ఆన్లైన్ సర్విసులకు డిమాండ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కారణంగా జనజీవనం నిలిచిపోవడంతో ఊపందుకున్న ఆన్లైన్ ట్రెండ్ తదుపరి దశలో మరింత ఊపందుకుంది. ప్రజలు తమ అవసరాల కోసం ఆఫ్‌లైన్ స్టోర్లకంటే ఆన్లైన్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు స్మార్ట్ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. దీంతో ఆన్లైన్ అమ్మకాలు ఆఫ్‌లైన్ స్టోర్లను మించి నమోదవుతున్నట్లు మార్కెట్ రీసెర్చ్ సంస్థల తాజా నివేదిక పేర్కొంది. నీల్సన్ఐక్యూ, జీఎఫ్కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక వివరాలు చూద్దాం.. డోర్ డెలివరీ ఎఫెక్ట్ కరోనా తదుపరి లాక్డౌన్లు ఎత్తివేయడంతోపాటు.. అన్ని రకాల ఆంక్షలనూ ప్రభుత్వం తొలగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు ఇటీవల జనంలోకి చొచ్చుకుపోయిన సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. దీంతో ఫిజికల్‌గా స్టోర్ల సందర్శనకంటే ఈకామర్స్వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కాలంలో జోరందుకున్న డోర్ డెలివరీ వ్యవస్థ రానురాను బహుముఖాలుగా విస్తరించింది. ఫలితంగా నిత్యావసరాలు మొదలు విచక్షణ ప్రకారం కొనుగోళ్లు చేపట్టే వస్తువుల విషయంలోనూ ఆన్‌లైన్‌కే ఓటు వేస్తున్నారు. భారీ వృద్ధి బాటలో లాక్డౌన్ రోజుల్లో కూరగాయలు, ఫాస్ట్‌ఫుడ్ తదితర నిత్యావసరాల కోసం కాంటాక్ట్‌లెస్ డోర్ డెలివరీలకు అలవాటుపడిన ప్రజలు తదుపరి కాలంలో టీవీ సెట్ల దగ్గర్నుంచి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు తదితర వినిమయ వస్తువులను సైతం ఈ కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ లాక్డౌన్ రోజులకుమించి కనిపిస్తోంది. ప్రధానంగా మెట్రో నగర ప్రాంతాలలో ఈకామర్స్ ద్వారా కొనుగోళ్లు భారీగా ఎగశాయి. ఇంటినుంచే కొనుగోలు చేయగలగడం, డోర్‌డెలివరీ సౌకర్యం, విభిన్న ప్రొడక్టుల అందుబాటు తదితర సానుకూలతలు కీలకపాత్రను పోషిస్తున్నాయి. ఫ్రాస్ట్ఫ్రీ ఫ్రిజ్‌లు, 55 అంగుళాలకుమించిన టీవీలు వంటి ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపయ్యాయి. కాగా, గతేడాదిలో ఎఫ్ఎంసీజీ విభాగ అమ్మకాలు అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే ఊపందుకున్నాయి. -
బాబోయ్ స్మార్ట్‌ఫోన్ లోబ్యాటరీ! ఇదెక్కడి లొల్లి! మీకు ‘నోమోఫోబియా’ ఉందా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కాసేపు ఫోన్ కనపడకపోతే.. ప్రపంచానికి మనం దూరమైపోయినట్టు తల్లడిల్లిపోతుంటాం. అదే.. ఫోన్లో లో–బ్యాటరీ అనే సింబల్ కనిపిస్తే.. చాలామందిలో ఆందోళన పెరిగిపోతుంటుంది. దీనినే నోమోఫోబియో (నో మొబైల్ భయం) అని పిలుస్తారంట. నాలుగేళ్ల క్రితం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ పదాన్ని చేర్చినా.. ఇప్పుడు ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ నోమోఫోబియోతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా, మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్‌తో కలిసి దేశంలోని నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఫోన్ బ్యాటరీ లెవల్స్ పడిపోయినప్పుడు వినియోగదారులు ఎలా స్పందిస్తున్నారనే దానిపై టైర్–1, టైర్–2 నగరాల్లోని 1,500 మంది ఫోన్ యూజర్ల నుంచి వివరాలు సేకరించారు. -LA PELIGROSA NOMOFOBIA @El_Universal_Mx @Univ_Opinion #nomofobia #artificalintelligence #InteligenciaArtificial #conexion #internet #smartphone #socialmedia pic.twitter.com/Bs0UUOtEUh — Angel Boligan (@AngelBoligan) March 5, 2023 బ్యాటరీ అయిపోతే.. ఫోన్ వాడలేం! ఈ అధ్యయనం ప్రకారం.. సెల్‌ఫోన్ బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫోన్ వాడలేం కదా.. ఇప్పుడెలా అనే ఆందోళనతో ఎక్కువ మంది బాధపడుతున్నారట. ఈ క్రమంలో లో–బ్యాటరీ అనే సిగ్నల్ కనిపిస్తే చాలు టెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. 100 శాతం బ్యాటరీ ఉన్నప్పుడు ఆనందంగా ఉండే వినియోగదారులు.. ఫోన్ చార్జింగ్ 20 శాతానికి తక్కువగా కనిపిస్తే ఫోబియోతో బాధపడుతున్నారని తేలింది. 100 మందిలో 75 మంది ఫోన్ చార్జింగ్ తగ్గిపోతున్న కొద్దీ స్విచ్ఆఫ్ అయిపోతుందన్న ఆందోళనతో కనిపిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. సర్వే ఇంకేం చెప్పిందంటే.. ► ‘లో బ్యాటరీ’ నోమోఫోబియో భయం 31 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారిలో 77 శాతం వరకూ ఉండగా.. 25 నుంచి 30 ఏళ్లలోపు వారిలోనూ ఈ భయం గుర్తించినట్టు సర్వేలో వెల్లడించింది. ► 87 శాతం మంది ఫోన్‌ని చార్జింగ్ పెట్టి మరీ ప్రమాదకరంగా వినియోగిస్తున్నారు. ► ఫోన్ బ్యాటరీ పనిచేయకుంటే భయంభయంగా ఉంటుందని 82% మంది పురుషులు చెప్పగా.. 74 శాతం మంది మహిళా యూజర్లు అదే ఆందోళన వెలిబుచ్చారు. ► 60 శాతం మంది వినియోగదారులైతే ఫోన్ బ్యాటరీలో చార్జింగ్ తక్కువ సమయం వస్తుంటే.. వెంటనే 100లో 60 మంది కొత్త ఫోన్ కొనుగోలు చేసేస్తున్నారు. ► 100లో 46 మంది వినియోగదారులు తమ ఫోన్లో చార్జింగ్ ఉన్నప్పటికీ రోజుకు రెండుసార్లు చార్జింగ్ పెడుతున్నారు. 0 92 శాతం మంది తమ ఫోన్లో పవర్ సేవింగ్ మోడ్ వినియోగిస్తున్నారు. ► ఇంటికి చేరేలోపు లో–బ్యాటరీ సిగ్నల్ వస్తుందేమోనన్న భయంతో 82 శాతం మంది యూజర్లు సోషల్ మీడియా వినియోగ సమయాన్ని తగ్గించేసుకుంటున్నారు. ► సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్ అని 78 శాతం మంది చెప్పారు. ► ఎంటర్టైన్మెంట్, మూవీస్, సీరియల్స్, టీవీషోస్ చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నామని 42% మంది వినియోగదారులు చెప్పారు. ఆందోళన తగ్గించుకోవాలి స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు సర్వే నిర్వహించాం. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లు జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయని గుర్తించాలి. గంటలకొద్దీ ఫోన్‌ని వినియోగించకుండా అవసరం మేరకే ఫోన్లని వాడాలి. స్మార్ట్ ఫోన్ల విషయంలో కలిగే ఆందోళనలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ వాడకానికి అప్పుడప్పుడూ గ్యాప్ ఇస్తూ కుటుంబసభ్యులు, స్నేహితులు, కొలీగ్స్‌తో మమేకమవుతూ మానవ సంబంధాలకు విలువనివ్వాలి. ఫోన్ల వాడకంపై అవగాహనతో పాటు జాగ్రత్తగా ఉండటం ద్వారా నోమోఫోబియోని అధిగమించడం సులువు. – దమయంత్ సింగ్ ఖనోరియా, సీఎంవో, ఒప్పో ఇండియా -
స్మార్ట్ఫోన్ల పండగ వచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ పండుగల సీజన్లో 5.17 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. వీటి విలువ రూ.1.44 లక్షల కోట్లు ఉంటుందని టెక్నాలజీ మార్కెట్ రిసర్చ్ కంపెనీ టెక్ఆర్క్ వెల్లడించింది. 2022లో స్మార్ట్‌ఫోన్ విక్రయాల ద్వారా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో ఇది 43 శాతానికి సమానం. యూనిట్ల పరంగా చూస్తే అమ్ముడయ్యే మొత్తం పరిమాణంలో వీటి వాటా 31.9 శాతం. 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 58.7 శాతం యూనిట్లు రూ.6–12 వేల ధరల శ్రేణి మోడళ్లు ఉంటాయి. ఈ విభాగంలో ఆదాయం అత్యధికంగా రూ.12–25 వేల శ్రేణిలో నమోదు కానుంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్, ఈ–కామర్స్ స్టోర్లు అత్యధికంగా 65–68 శాతం చేజిక్కించుకోనునున్నాయి. ఏడు కంపెనీలదే.. ఇక 5జీ స్మార్ట్ఫోన్లు 30.2 శాతం వాటాతో 1.56 కోట్ల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళతాయని టెక్ఆర్క్ అంచనా. సీజన్లో కంపెనీలు అందుకునే ఆదాయంలో వీటి వాటా ఏకంగా 66.7 శాతం ఉండనుంది. 5జీ విషయంలో పరిమాణం పరంగా రూ.25–50 వేల ధరల శ్రేణి మోడళ్ల వాటా 37.8 శాతం, విలువ పరంగా రూ.50 వేలు ఆపైన ధర కలిగిన మోడళ్ల వాటా 66.9 శాతం ఉండే చాన్స్ ఉంది. అమ్ముడయ్యే మొత్తం స్మార్ట్ఫోన్లలో యాపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్మీ, షావొమీ కలిపి 90 శాతం పరిమాణం కైవసం చేసుకుంటాయి. మేకిన్ ఇండియా ఫోన్లు.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో మేకిన్ ఇండియా ఫోన్లు 4.4 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ తెలిపింది. ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఈ స్థాయి వృద్ధికి కారణం. స్మార్ట్‌వాచ్, ట్రూ వైర్లెస్ స్టీరియో, నెక్‌బ్యాండ్, ట్యాబ్లెట్ పీసీ వంటి ఉత్పత్తుల తయారీ సైతం అధికం అయింది. మేకిన్ ఇండియా స్మార్ట్ఫోన్లలో 24 శాతం వాటాతో ఒప్పో అగ్రస్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. థర్డ్ పార్టీలు సైతం.. స్మార్ట్‌ఫోన్ విభాగంలో కంపెనీలు సొంతంగా తయారు చేసినవి 66 శాతం కాగా, మిగిలినది థర్డ్ పార్టీ కంపెనీలు రూపొందించినవి. స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ఎఫ్ఐహెచ్, డిక్సన్, డీబీజీ కంపెనీలు థర్డ్ పార్టీ విభాగంలో ముందు వరుసలో ఉన్నాయి. 75 శాతం స్మార్ట్‌వాచ్‌లను ఆప్టీమస్ ఉత్పత్తి చేయడం విశేషం. ట్యాబ్లెట్ పీసీల్లో వింగ్‌టెక్, శామ్సంగ్, డిక్సన్‌లు టాప్–3లో ఉన్నాయి. టీవీల విభాగంలో డిక్సన్, రేడియంట్, శామ్సంగ్, ఎల్జీ కంపెనీల వాటా 50 శాతం. -
పాంచ్‌కా ఖానా.. తీన్ కా నాస్త
- బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో భోజనం, టిఫిన్ - వెల్లడించిన మంత్రి హరీష్‌రావు - ఉన్నతాధికారులతో కలిసి మార్కెట్ పరిశీలన - సమస్యల పరిష్కారంపై అక్కడికక్కడే సమీక్ష కంటోన్మెంట్: వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. అయితే ఇది నగరం మొత్తం కాదండోయ్..నగరం చుట్టుపక్కల ఆయా ప్రాంతాల నుంచి ఎంతో శ్రమించి కూరగాయలు తీసుకొచ్చే రైతులు,హమాలీల కోసం బోయిన్పల్లి మార్కెట్లో తక్కువ ధరలో టిఫిన్ ,భోజనం అందించనున్నారు. ఈమేరకు త్వరలో క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. మరోమంత్రి పద్మారావు,మార్కెటింగ్ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం మార్కెట్‌ను సందర్శించిన ఆయన సుమారు 3గంటలపాటు కలియతిరిగారు. ప్రతీ సమస్యను నేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నేరుగా షాపుల వద్దకు చేరుకుని మార్కెట్లోకి కూరగాయలు తీసుకొచ్చిన రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు,రిటైల్ విక్రేతలతో మాట్లాడారు. ధరల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా హామాలీలు ప్రధానంగా క్యాంటీన్ సమస్యను మంత్రి ద ృష్టికి తీసుకొచ్చి సదరు కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, క్యాంటీన్, నిరుపయోగంగా ఉన్న రైతుల రెస్ట్‌రూమ్‌లను పరిశీలించారు. అనంతరం మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రైతులు, హమాలీలు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో త్వరలో రూ.3 అల్పాహారం, రూ.5కే భోజనాన్ని అందిస్తామని, ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఇలాంటి విధానంపై అధ్యయనం చేసి అతిత్వరలో మార్కెట్‌యార్డులోనూ సబ్సిడీతో కూడి న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బినామీ పేర్ల మీద నడుస్తున్న దుకాణాలు, కేటాయింపు జరిగినా రోడ్డుపైనే క్రయ,విక్రయాలు సాగిస్తున్న 39 దుకాణాల అంశంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ధరల నియంత్రణపై దృష్టి : కూరగాయ ల ధరల నియంత్రణకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. పలురకాల కూరగాయలను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున..వాటి ధరల్ని రాష్ట్రస్థాయిలో నియంత్రించలేకపోతున్నామని చెప్పారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఆయాశాఖల ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, జనార్దన్‌రెడ్డి, లక్ష్మీభాయి తదితరులున్నారు.