Market yard position
-
మార్కెట్ పీఠం దక్కేదెవరికో?
సాక్షి, మదనాపురం: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననే చర్చ సాగుతోంది. వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదివికి అధికార పార్టీలో పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా 1946 అక్టోబర్ 1న ఇక్కడ మార్కెట్‌యార్డ్ ఏర్పడింది. మొదట్లో తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ యార్డుకు ఓ ప్రత్యేతక ఉంది. ఏడు నెలల కిందట ముగిసిన పదవీకాలం చెర్మెన్ పదవీకాలం 2018 ఆగస్టు 8న ముగిసింది. బీసీలకు రిజర్వేషన్ కావడంతో చాలామంది ఆశావహులు మార్కెట్ కమిటీ చెర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నారు. కొత్తకోట మండలం నుంచి ముగ్గురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. స్వంత మండలానికే ఇవ్వాలనీ మదనాపురం అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి సూచించినట్లు ఓ సీనియర్ కార్యకర్త తెలిపారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో చాలా మంది ఆశావాహులు పోటిలో ఉన్నారు. మదనాపురం నుంచి ఐదుగురు పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఏడాదికి రూ.కోటి ఆదాయం ప్రతి ఏటా మార్కెట్ కమిటీ ద్వార ప్రభుత్వానికి కోటి రుపాయాల ఆదాయం వస్తోంది. వరిధాన్యం కొనుగోలు, కందులు, పల్లీల ద్వార ఈ ఆదాయం వస్తుంది. మదనాపురం, కొత్తకోట, అడ్డాకల్, మూసాపేట మండలాలకు చెందిన రైతులు ఇక్కడికి వస్తారు. రూ. 9 కోట్ల నాబార్డు నిధులతో కొత్తకోటలో 5వేల మెట్రికల్ టన్నుల బియ్యం నిల్వ చేసే గోదాం, మదనాపురంలో 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాం నిర్మించారు. 305 ఎకరాల భూమి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మదనాపురం, దంతనూరు, తిర్మాలయపల్లి శివార్లను కలుపుతూ మార్కెట్‌కు 305 ఎకరాల భూమిని అప్పట్లో కేటాయించారు. అయితే 50 ఎకరాలు కృషి విజ్ఞాన కేంద్రానికి, బీసీల నివాసా లకు 14 ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 ఎకరాలు, పశువైద్యం కేంద్రం ఒక్క ఎకరం, విద్యుత్ సబ్ స్టేషన్ ఎకరన్నర, జిల్లా పరిషత్ పాఠశాల రెండు ఎకరాలు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లకూ మార్కెట్ స్థలం కేటాయించారు. మొత్తంగా ఆదాయం, ఆస్తులు కలిగిన ఈ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాకే తేలే పరిస్థితి కనిపిస్తోంది. -
ప్రకటన సరే..కొనేదెప్పుడు?
వెల్దుర్తి/కృష్ణగిరి : ఆరుగాలం కష్టపడ్డా, ప్రకృతి అనుకూలించక దిగుబడి తగ్గి, మార్కెట్లో ధర పతనమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లోని శనగ రైతులపై ప్రభుత్వం కనికరం చూపడంలేదు. రబీ సీజన్లో వర్షాధారంగా ఇరు మండలాల్లో (వెల్దుర్తిలో 823హెక్టార్లు, కృష్ణగిరిలో 500హెక్టార్లలో) 1,323 హెక్టార్లలో శనగ సాగు చేశారు. ఎకరాకు దాదాపు రూ.20వేలు ఖర్చు చేశారు. కౌలు రైతులకు అదనంగా రూ.5వేలు ఖర్చు వచ్చింది. మార్కెట్లో ధరలేకున్నా అప్పులు తాళలేక కొందరు రైతులు దిగుబడులను ఇప్పటికే నష్టానికి అమ్ముకున్నారు. మరికొందరు గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా అని ఎదురు చూస్తూ దిగుబడులను ఇళ్లల్లోనే దాచుకున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. రెండు నెలలుగా మద్దతు ధరకు కొనాల్సిందిగా రైతులు అధికారులను కోరుతూనే ఉన్నా వారి చెవికెక్కడంలేదు. గత ఏడాది మార్కెట్లో రూ.8వేలకు మించి పలికిన క్వింటం శనగ ధర ప్రస్తుతం రూ.3,200ల నుంచి రూ.3,600లు మాత్రమే పలుకుతోంది. మరో రెండు నెలల్లో ఖరీఫ్ వచ్చే సమయమైందని, వెంటనే తమ దిగుబడులను మద్దతు ధర రూ.4,500కు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర ప్రకటించినా ఫలితం లేదు ప్రభుత్వం శనగలకు మద్దతు ధర ప్రకటించి నెలలు గడుస్తున్నా అన్నదాతలకు ఫలితం లేదు. పంటలకు పెట్టిన పెట్టుబడులు కట్టుకుందామంటే పంటను అమ్ముకునేందుకు దిక్కే లేదు. మార్కెట్లో ధర పూర్తిగా పతనం కావడంతో మద్దతు ధర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పర్మిట్లు రాసిచ్చినా కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. మరో నెల రోజులుంటే ఖరీఫ్ ప్రారంభం కాబోతుంది. అధికారుల శనగ రైతులపై కనికరం చూపాలి. -
యార్డు నిండెన్.. ధర తగ్గెన్..
ఖమ్మంవ్యవసాయం : మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది.. వ్యాపారులు ఇదే అదనుగా భావించారు.. రైతులకు కుంటిసాకులు చెప్పి.. ధర దోపిడీకి పాల్పడ్డారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సరుకు రాక ఎక్కువైనప్పుడల్లా వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకోవడం నిత్యకృత్యమైంది. నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా వచ్చింది. సుమారు 60వేల బస్తాలు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి విక్రయానికి వచ్చింది. ప్రధాన యార్డు నిండటంతో మరో యార్డును మిర్చి కోసం కేటాయించారు. దీనిని అదనుగా భావించిన వ్యాపారులు కూడపలుక్కొని ధరను పూర్తిగా పతనం చేశారు. గత వారంతో పోలిస్తే ఏకంగా రూ.2వేలు తగ్గించి కొనుగోలు చేశారు. గత వారం క్వింటా రూ.11,275 వరకు పలికిన ధర సోమవారం గరిష్టంగా రూ.10,100 చేరింది. వ్యాపారులు కొనుగోలు చేసింది సగటున రూ.9వేలు మాత్రమే. జనవరి మూడో వారం నుంచి రోజుకో రకంగా ధర పెరిగింది. డిసెంబర్ చివరి వారంలో రూ.8,800 వరకు ఉన్న ధర 20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.11,000 దాటింది. జనవరి 27 వరకు రూ.11, 275 ధరను తాకింది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు ధరను పెంచుకుంటూ పోతే ఇబ్బందులు ఎ దురవుతాయని చర్చించుకొని సిండికేటుగా మారి, తిరిగి ధర తగ్గించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో జనవరి 30న ధరను రూ. 10,800 తగ్గించారు. 31వ తేదీ నాటికి రూ.10,600 చేర్చారు. సోమవారానికి(జనవరి 5న) ఏకంగా గరి ష్ట ధరను రూ.1 0,125 తీసుకొచ్చారు. కానీ. అంతా కూడపలు క్కొని సగటున రూ.9వేలకు మించి ధర పెట్టలేదు. కొందరి పంటను రూ.8వేల వరకు కూడా కొనుగోలు చేశారు. ఇదేమిటంటే.. నాణ్యత లేదని, తేమ అధికంగాఉందని కుంటి సాకులు చెప్పారు. రూ.2వేలకు పైగా ధర దోపిడీ గత నెల 27వ తేదీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.2వేల నుంచి రూ.2,500 వరకు ధర తగ్గించి కొంటున్నారు. విదేశాల్లో తేజ రకం మిర్చికి డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడి వ్యాపారులు సిండికేటుగా మారి దోపిడీకి గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇంతగా ధర తగ్గించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరుకు పెరుగుతుండటంతో వ్యాపారులు ధరను కృత్రిమంగా పడేసి ధర దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అవసరాన్ని ఆసరా చేసుకొని దగా రబీ పంటల సాగు అవసరాలు, మిర్చి కోసిన కూలీల చార్జీలు చెల్లించటం కోసం రైతులు పంటను విక్రయానికి తెస్తున్నారు. దీనిని వ్యాపారులు అదనుగా భావించి.. సిండికేటుగా ఏర్పడి ధర దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపారులు ధరను తగ్గించినా రైతులు ధిక్కరించలేకపోతున్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఇచ్చేది ఆ వ్యాపారులే కావటంతో ఏమీ మాట్లాడలేక పెట్టిన ధరకే పంటను విక్రయించక తప్పటం లేదు. వ్యాపారులు పెట్టే ధరలను చూసి రైతులు బిత్తర చూపులు చూస్తున్నారు. రూ.11వేలు వస్తుందనుకున్నా.. మిర్చికి ధర ఉందని, క్వింటాల్‌కు రూ.11వేలకు పైగా ధర వస్తుందని ఆశించా. ఎకరం మిర్చి తోట వేశా. 20 బస్తాలు విక్రయానికి తెచ్చా. క్వింటాల్‌కు రూ.9వేల ధర పెట్టారు. ఎంత బతిమిలాడినా వ్యాపారులు ధర పెంచలేదు. ధరలో అన్యాయం చేశారు. ధర దోపిడీ చేస్తున్నారు. – షేక్ జానీమియా, వనంవారి కిష్టాపురం, ముదిగొండ మండలం కూలీలకు డబ్బు ఇవ్వాల్సి ఉండి మిర్చి అమ్మకానికి తెచ్చా.. మిర్చి తోట ఏరిన కూలీలు డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబ అవసరాలు కూడా ఉన్నాయి. అయినా ఖమ్మం మార్కెట్లో రూ.11వేలకు పైగా ధర ఉందని 30 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. రూ.9వేల ధర పెట్టారు. అవసరాన్ని చూసి రైతులకు వాత పెడుతున్నారు. – ధర్మసోత్ సాగర్, ఎల్లంపేట, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
గుడివాడ : నందివాడ మండల దేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గుడివాడ టీడీపీ కార్యాలయం వేదికగా జరిగిన నంది వాడ మండల టీడీపీ కార్యాలయంలో రావి, పిన్నమనేనికి చెందిన ఇరు వర్గాలు బాహా బాహీకి దిగాయి. ఒకరిపై ఒకరు ముష్టి ఘాతాలతో కుమ్ముకున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో నందివాడ మండల పార్టీ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. నందివాడ మండలానికి చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు హాజరయ్యారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షుడు ఆరెకపూడి రామశాస్త్రి, గుడివాడ అర్బన్‌బ్యాంకు చైర్మన్ పిన్నమనేని బాబ్జీ అధ్యక్షత వహించారు. సమావేశం మొదలు కాగానే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. అరుపులతో కార్యాలయం హోరెత్తింది. కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరావు టీడీపీలో చేరారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే ఎన్నికల అనంతరం గ్రామాల్లో పిన్నమనేనితో పాటు వచ్చిన కార్యకర్తలకు గతంనుంచి టీడీపీలో కొనసాగుతున్న వారికి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పిన్నమనేని సొంత మండలం నందివాడలో పిన్నమనేని అనుచరులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా ఆయన అనుచరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తూ వస్తున్నారు. చేపల చెరువుల అనుమతులు సమయంలో పిన్నమనేనికి అనుకూలంగా ఉండే వారిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని కూడా చెబుతున్నారు. అలాగే ఇటీవల గ్రామాల్లో పింఛన్ల వెరిఫికేషన్‌కు ప్రతి గ్రామంలో నలుగురు సభ్యులతో కమిటీ వేసి జాబితాను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు అధికారులకు అందించారు. ఈ జాబితాలో నందివాడ మండలంలోని పిన్నమనేని అను చరులకు కనీసం స్థానం లేకుండా పోయింది. దీంతో నందివాడ మండలంలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే ఆవేదనతో పిన్నమనేని వర్గీయులు రగిలిపోతున్నారు. గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసమేనా? గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని పోలుకొండకు చెందిన నందివాడ మండల పార్టీ అధ్యక్షుడు ఆరెకపూడి రామశాస్త్రికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. పిన్నమనేని వర్గీయులు రామశాస్త్రికి మద్దతు ప్రకటించారు. రామశాస్త్రి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. అయితే రామశాస్త్రికి ఇవ్వవద్దని, తమిరిశకు చెందిన కొల్లు వెంకటకృష్ణారావు (పెదబాబు) లేదా నందివాడ మండలం వెంకటరాఘవాపురానికి చెందిన కాకరాల సురేష్‌కు ఇప్పించాలని రావి వర్గంలోని కొంతమంది విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి ఆరెకపూడి రామశాస్త్రికే మొగ్గు ఉండటంతో మంగళవారం జరిగిన సమావేశంలో రావివర్గంలోని కొంతమంది తమ ప్రతాపాన్ని ప్రదర్శించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా గత వేసవిలో నందివాడ మండలంలో చేపల చెరువుల తవ్వకాలలో పిన్నమనేని వర్గానికి చెందిన వారు చెరువులు తవ్వుతుంటే వాటిని ఆపించేందుకు రావి వర్గానికి చెందిన నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నందివాడ మండలంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీనికి తోడు ఇటీ వలపింఛన్ల వెరిఫికేషన్ కోసం వేసిన గ్రామ కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రానున్న కాలంలో పిన్నమనేని, రావి వర్గీయుల మధ్య వర్గ విభేధాలు మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉందని తమ్ముళ్లే బాహాటంగా చెబుతున్నారు.