marketing branch
-
మార్కెట్ మాయ...
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను సైతం విభజించింది. ప్రతి జిల్లాకు ఒక మార్కెటింగ్ శాఖ మేనేజర్‌ను నియమిస్తూ జీఓ జారీ చేసింది. అయితే రెండేళ్లకే తిరిగి ‘యూటర్న్’ తీసుకుంది. తాజాగా జీఓ నం.746ను విడుదల చేసింది. దీని ప్రకారం మార్కెటింగ్ జిల్లా స్థాయి కార్యాలయాలను మళ్లీ విలీనం చేయనుంది. జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. వాటికి మేనేజర్లను కూడా నియమించారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విడిపోవడంతో కొత్తగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో జిల్లా మార్కెటింగ్ కార్యాలయం ఏర్పాటైంది. అయితే అందులో డీఎంఓతోపాటు మరొక అధికారి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరతతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో అగ్రికల్చర్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శాఖాధికారులు ఈ విషయాన్ని అధ్యయనం చేసి, తిరిగి యూటర్న్ తీసుకుని పాత పద్ధతిలోనే హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా మార్కెటింగ్ కార్యాలయాలను మాత్రమే ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు అగ్రికల్చర్ అండ్ కో–ఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే జీఓ కూడా విడుదలైంది. అయితే ప్రస్తుతానికి మాత్రంకొత్తగూడెం జిల్లా కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో జీఓ మినహా మరెలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా మార్కెటింగ్ మేనేజర్ జె.నరేందర్ నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాలలో డీడీ స్థాయి అధికారిని, విభజన జిల్లాల్లో ఏడీ స్థాయి అధికారులను గతంలో వలె నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లా అయిన ఖమ్మంలో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ కార్యాలయం విలీనమై ఖమ్మం కేంద్రంగానే రెండు జిల్లాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అయితే కొత్తగూడెం మార్కెట్ యార్డు సెక్రటరీనే విభజన జిల్లాల నిర్వహణను చూస్తారు. దీని ప్రకారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మార్కెట్ యార్డులో ఉండే సెక్రటరీ జిల్లాలోని కార్యకలాపాలను పరిశీలిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీడీ స్థాయిలో ఉండే ఆర్.సంతోష్ కుమార్ ఉమ్మడి జిల్లా డీఎంఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జీఓ నిజమే.. కానీ ఇంకా అమలుకాలేదు ఉమ్మడి జిల్లాల వారీగా మార్కెటింగ్ శాఖలను విలీనం చేస్తున్నమాట వాస్తవమే. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీఓ కూడా విడుదలైంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇంకా అమలు కావడం లేదని భావిస్తున్నాం. భవిష్యత్తులో రెండు జిల్లాల కార్యకలాపాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచే జరుగుతాయి. – జె.నరేందర్, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి -
విత్తు.. చిత్తు
మెదక్‌జోన్ : పలు విత్తన కంపెనీలకు చెందిన ఏజెంట్లు ఇష్టారీతిగా రైతులతో విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. కానీ ఆయా కంపెనీలతో ముందస్తు ఒప్పందం చేసుకోవడం లేదు. విత్తనాలను సాగు చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే ఒప్పందం సాగును చట్టబద్ధం చేస్తూ రైతులకు నష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల పర్యవేక్షణ కొరవడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నూతన చట్టం ప్రకారం కంపెనీ లేదా వ్యక్తి రైతుతో పంటను పండించాలనుకుంటే మార్కెటింగ్‌శాఖ వద్ద లైసెన్స్ తీసుకోవాలి. పండించాలనుకున్న పంట విస్తీర్ణం రైతులతో చేసుకున్న ధరల ఒప్పందం వంటివన్నీ ప్రభుత్వ అధికారులకు నెల రోజుల్లోపు సమర్పించాలి. ప్రభుత్వ మద్దతు ధరకన్నా తక్కువ ధరకు కొనకూడదు. పంట పండిన తరువాత ఒప్పందం ప్రకారం రైతుకు డబ్బులు చెల్లించాలి. రైతుల భూములపై ఆయా కంపెనీలకు ఎలాంటి అధికారాలు ఉండవు. ఏవైనా వివాదాలు తలెత్తితే మార్కెటింగ్‌శాఖ సంచాలకుడికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. తద్వారా అధికారులు పరిశీలించి నెల రోజుల్లోపు సమస్యను పరిష్కరించాలి. రబీలో ఒప్పందసాగు అధికంగా ఉంది కాబట్టి కంపెనీలన్నీ ఒప్పంద లైసెన్స్ పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు జిల్లాలో పెద్ద ఎత్తున విత్తన పంటలు వేసినా ఎవరూ ఒప్పందం చేసుకోలేదు. దీంతో రైతులకు చట్టంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. చాలాకాలంగా సాగు.. మెదక్ జిల్లాలో చిన్నశంకరంపేట, రామాయంపేట, వెల్దుర్తి, మెదక్, హవేలిఘణాపూర్, చేగుంట, నార్సింగ్‌తోపాటు పలు మండలాల్లో విత్తన కంపెనీదారులు చాలా కాలంగా రైతులతో విత్తనాలను ఉత్పత్తి చేయించి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వరి పంటల రకాలను అధికంగా సాగు చేస్తున్నారు. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ. 8 నుండి రూ. 10 వేల వరకు అదనపు ఆదాయం వస్తుండడంతో రైతులు కూడా విత్తనోత్పత్తికి మొగ్గుచూపుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైబ్రిడ్ వరితోపాటు టేక్మాల్, రేగోడు, అల్లాదుర్గం, పెద్దశంకంపేట తదితర మండలాల్లో పత్తి, మొక్కజొన్నలాంటి విత్తనాలను సాగు చేయిస్తున్నారు. విత్తనోత్పత్తి సాగు సమయంలో వాతావరణం అనుకూలించకపోతే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ క్రమంలో రైతుతో ముందుగా కంపెనీ యజమాని ఒప్పందం చేసుకున్న ప్రకారం డబ్బులను చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా సదరు కంపెనీలు రైతులకు డబ్బులు తక్కువగా చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల మాయాజాలం.. విత్తనోత్పత్తి విషయంలో వివిధ కంపెనీల ఏజెంట్లు రైతులతో ఒప్పందం చేసుకున్న విధంగా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి. 2013వ సంవత్సరంలో చేగుంట మండలంలోని మాసాయిపేటలో ఓ రైతు ఐదు ఎకరాల పొలంలో వరి విత్తన రకాన్ని సదరు కంపెనీ యజమాని సూచన మేరకు సాగు చేశాడు. కానీ వాతావరణ మార్పులతో పంటకు తెగులు సోకింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో విత్తన కంపెనీ ఏజెంట్ పత్తాలేకుండా పోవడంతో బాధిత రైతు నెత్తీనోరు బాదుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. అయినా రాతపూర్వకంగా ఎలాంటి ఒప్పంద పత్రం లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తివేశారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. వెయ్యి ఎకరాల్లో సాగు.. జిల్లావ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో సాధారణ వరి పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18 వేల హెక్టార్లలో సాగయ్యాయి. జిల్లా వ్యాప్తంగా విత్తన కంపెనీదారులు సుమారు 1000 ఎకరాల్లో వరి విత్తనాలను సాగు చేయించినట్లు తెలిసింది. ఒప్పంద పత్రం రాసుకుని సాగు చేయిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. పాటించాల్సిన నిబంధనలు... విత్తనోత్పత్తి చేసే కంపెనీలు రైతుతో సాగు చేయించే విత్తనాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. విత్తిన తరువాత రైతుల పొలాలను ఎన్నిసార్లు పరిశీలించారు. పంట చేతికందే సమయంలో నిబంధనలు పాటించడంతోపాటు ఎప్పటికప్పుడు విత్తనాల నమూనా పరీక్షలు చేసి ప్యాకింగ్ వరకు సంబంధిత అధికారులు పర్యవేక్షించి సీడ్ సర్టిఫికెట్ ట్యాగ్ లేబుల్, సీళ్లను ఇస్తారు. అధికారుల పర్యవేక్షణ లేకపోతే మోసగాళ్లకు ఆడిందే ఆటగా మారుతుంది. ఈ క్రమంలో రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలి.. కంపెనీలు రైతులతో విత్తనోత్పత్తి చేయాలనుకుంటే ముందుగానే బాండ్ పేపర్‌పై రాతపూర్వకంగా ఒప్పందం చేసుకోవాలి. వాతావరణ మార్పుల కారణంగా లేదా మరేమైనా కారణాలతో పంటలు నష్టపోయిన సందర్భాల్లో ఒప్పందం మేరకు రైతుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లేనట్లయితే సదరు కంపెనీలపై కేసు వేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ప్రతీ కంపెనీదారుడు తప్పని సరిగా నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి.– జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాం -
పాతవే ఖాళీ.. కొత్తవెందుకు మళ్లీ?
జిల్లాలో 92,500 మెట్రిక్ టన్నుల సామర్థ్య గోదాంలు పూర్తికావొచ్చిన 45 నూతన గోడౌన్ల నిర్మాణం కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తేనే రైతులకు ఉపయోగం వరంగల్ సిటీ : ఏ పనైనా అవసరం మేరకు చేస్తేనే ఉపయోగం ఉండడమే కాకుండా.. ఆ పని చేసినందుకు ఫలితం దక్కుతుంది. కానీ ప్రభుత్వం మంజూరు చేసింది కదా అని అవసరం లేదనే చెప్పే ధైర్యం లేకో.. మరేదైనా కారణమో తెలియదు కానీ భారీగా సరుకులు నిల్వ చేసే గోదాంల నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఇప్పటికే పెద్దసంఖ్యలో గోదాంలు.. అదీ వేల మెట్రిక్ టన్నుల సరుకులు నిల్వ చేసే సామర్థ్యం గల గోదాంలు ఉన్నాయి. ఇందులో చాలావరకు సరుకులు నిల్వ చేయకపోగా.. వృథాగా మారాయి. అయినా మరో 45 గోదాంలు నిర్మాణం చేపడుతుండడం గమనార్హం. ఇవి కాకుండా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి నిల్వ చేసుకునేందుకు వీలుగా కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తే అటు రైతులకు ఉపయోగం.. ఇటు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి పేరు దక్కేది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 93 గోదాంలు... జిల్లాలో ఇప్పటికే 92,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 93 గోదాములు ఉన్నాయి. వీటన్నింటిల్లో ఎప్పుడు కూడా 50వేల మెట్రిక్ టన్నుల పంట సరుకులు నిల్వ చేసిన పరిస్థితి లేదు. అయినా జిల్లాలో మరో 45 భారీ గోదాంలు నిర్మిస్తున్నారు. దాదాపు 5వేల నుంచి 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వీటి నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఇవన్నీ పూర్తయితే 2,17,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యానికి పాతవి కలిస్తే 3లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఇప్పటికే గోదాంలు వృథాగా ఉంటుండగా.. కొత్తవి నిర్మాణం జరిగాక ఇందులో ఏం నిల్వ చేస్తారో అధికారులే చెప్పాల్సి ఉంది. మార్కెట్లోనే 44వేల మెట్రిక్ టన్నులు వరంగల్ వ్యవసాయ మార్కెట్లోనే 34వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాంలు ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్ సమీపంలోని ముసలమ్మకుంట ప్రాంతంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ గోదాం నిర్మాణం పూర్తికావొస్తోంది. ఇప్పటికే ఉన్న గోదాంలను ఎన్నికల సమయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూంలుగా, భద్రతా సిబ్బందికి షెల్టర్లుగా ఉపయోగిస్తున్నారు. ఆ ఆలోచన ఎందుకు రాలేదు? అవసరం లేకున్నా గోదాంలు నిర్మాణానికి సిద్ధమైన మార్కెటింగ్ శాఖ అధికారులు కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ఎందుకు దృష్టిసారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పెద్దమెుత్తంలో గోదాంలో ఖాళీగా ఉంటుండగా.. కొత్త వాటి నిర్మాణంతో రైతులకే కాదు ఎవరికీ ఉపయోగం ఉండదనేది సుస్పష్టం. వీటికి బదులుగా కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తే పత్తి, మిర్చి తదితర పంటలకు తక్కువ ధర ఉన్నప్పుడు రైతులు నిల్వ చేసుకునే వీలు కలిగేది. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో ఎక్కువ కిరాయి చెల్లిస్తూ ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా మార్కెటింగ్ అధికారులు కోల్డ్ స్టోరేజీలు కాకుండా.. పెద్దసంఖ్యలో గోదాంల నిర్మాణానికి సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. -
ప్రశంసపత్రాలు అందుకున్న ఉద్యోగులు వీరే..
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు కలెక్టర్ అహ్మద్ బాబు ప్రశంసపత్రాలు అందజేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో ప్రశంసపత్రాలు అందించారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతికుమారి(బేల), జి.శ్రీధర్(సిర్పూర్ టౌన్), జూనియర్ కళాశాల లెక్చరర్లు డి.దయాకర్(తాంసి), టి.నర్సయ్య(ఖానాపూర్), ఎం.సంతోశ్‌కుమార్(తాంసి), ఎం.బాలాజీ(బజార్హత్నూర్), ఆర్.శ్రావణ్ (ఉట్నూర్), జుఫిషాన్ సుల్తానా(ఆదిలాబాద్), జె.రవికిరణ్(మామడ), కె.సుదర్శన్(నేరడిగొండ), సరితరాణి(ముథోల్), జె.బల్రాం(నేరడిగొండ), ఎం.నర్సింగ్‌రావు(తాంసి), కె.మోహన్‌బాబు(తాంసి), జె.సువర్ణ(ఖానాపూర్), వీఎన్.రవి(బేల), ఎం.స్వామి(ఉట్నూర్), ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి చెందిన బి.సాగర్(ల్యాబ్ టెక్, ఉట్నూర్), శ్రీపద్వార్ శ్రీనివాస్(ఆదిలాబాద్), బి.సాగర్(ల్యాబ్‌టెక్, ఉట్నూర్) ప్రశంసపత్రాలు అందుకున్నారు. న్యాయశాఖలో వి.భాస్కర్(టైపిస్ట్, అకౌంటెంట్, నిర్మల్), బి.జితన్సింగ్(ఆఫీస్ సబార్డినెట్, భైంసా), బి.సాంబశివ్(సూపరింటెండెంట్, ఆదిలాబాద్), ఎన్.ప్రతాప్‌రెడ్డి(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్), జి.రఘు(ఫీల్డ్ అసిస్టెంట్, మంచిర్యాల) ఉన్నారు. మార్కెటింగ్ శాఖలో టి.మనోహర్సింగ్(రికార్డర్ ఏడీ మార్కెటింగ్, ఆదిలాబాద్), ఎ.కిష్టాగౌడ్(సెక్రెటరీ గ్రేడ్-2 ఏఎంసీ, ఆదిలాబాద్), ఎన్.మనోహర్(సెక్రెటరీ గ్రేడ్-2 ఏఎంసీ, ఇంద్రవెల్లి). మార్క్‌ఫెడ్‌లో.. లక్ష్మణ్‌రాజు(సీఈవో, పీఏసీఎస్ తాంసి), సాయరెడ్డి(సీఈవో, పీఏసీఎస్ బిద్రెల్లి), షేక్ న్యాజ్ అలీ(సీఈవో, పీఏసీఎస్ కొత్తపేట్). వైద్య, ఆరోగ్యశాఖలో.. బి.వెంకట్మ్రణ(ఎంఐఎస్ ఎన్ఆర్హెచ్ఎం, ఆదిలాబాద్), రవీందర్(డీపీవో ఎన్ఆర్హెచ్ఎం, ఆదిలాబాద్). వైద్యాధికారులు బాబు(పీహెచ్సీ, నార్నూర్), కుమారస్వామి(పీహెచ్సీ, తాంసి), సృజన(పీహెచ్సీ, ఝరి), వెంకటేశ్వర్లు(పీహెచ్సీ, బెజ్జూర్), రేష్మ(పీహెచ్సీ, రోంపల్లి), మురళీకృష్ణ(పీహెచ్సీ, తానూర్), రామచందర్(పీహెచ్సీ, తాళ్లపేట్), బి.కృష్ణ(ఎల్టీ, జిల్లా టీబీ సెంటర్, ఆదిలాబాద్), లాలయ్య(ఎస్టీఎస్ జిల్లా టీబీ సెంటర్, ఆదిలాబాద్) ఆరోగ్యమిత్రలు.. సురమల్ల వసంత(వెంకట్రావ్‌పేట్, మంచిర్యాల), సద ముత్తన్న(దిలావర్పూర్, పీహెచ్సీ నిర్మల్), ఎం.స్వప్న(రాంనగర్ పీహెచ్, నిర్మల్), దుర్గ్ రమేశ్(గిమ్మ, పీహెచ్సీ ఆదిలాబాద్), ఇందూరి పద్మలత(కాగజ్‌నగర్, పీహెచ్సీ), యశ్మిని(మందమర్రి, పీహెచ్సీ బెల్లంపల్లి), జె.ప్రియాంక(నార్నూర్, పీహెచ్సీ ఉట్నూర్), జాదవ్ మాబ్జీ(ఉట్నూర్), సుంకరి ముకేష్‌కుమార్(ఏరియా ఆస్పత్రి, నిర్మల్), రాపెలిక్ల సత్యనారాయణ(జిల్లా మేనేజర్, ఆదిలాబాద్), వైద్యులు యు.కాశినాథ్(రేడియాలజిస్ట్, ఏహెచ్ భైంసా), సురేందర్(జనరల్ సర్జన్, ఏహెచ్ భైంసా), నీరజ(జనరల్ మెడిసిన్, ఏహెచ్, మంచిర్యాల). పంచాయతీరాజ్‌శాఖలో విలాస్‌కుమార్ గౌడ్(సూపరింటెండెంట్, ఎంపీపీ కడెం), సీహెచ్.కొండయ్య(టైపిస్ట్ ఎంపీపీ, మంచిర్యాల), వి.దామోదర్(ఆఫీస్ సబార్డినేట్, పీఆర్ డివిజన్, ఆదిలాబాద్), ఆకుల శ్యామ్(డీఎల్పీవో, నిర్మల్), భిక్షపతి(ఈవో(పీఆర్డీ), తాంసి), బి.రాజేశ్వర్(సీనియర్ అసిస్టెంట్, డీపీవో ఆదిలాబాద్), సీహెచ్.గోవింద్(బిల్ కలెక్టర్, జీపీ, క్యాతన్‌పల్లి), జె.మొండయ్య(ఆఫీస్ సబార్డినేట్, ఆసిఫాబాద్), జి.జక్కయ్య(కామటి, చెన్నూర్), ఎన్.కీర్తన(సర్పంచ్, కోరెగాం). ఐటీడీఏ(ఉట్నూర్)లో.. పి.భీము(ఏవో), దామోదరస్వామి(ఓఎం), శాంతరాజ్(సీనియర్ అసిస్టెంట్), రమాదేవి(అకౌంట్ మేనేజర్), వేణు(సీనియర్ అసిస్టెంట్(డీడీటీడబ్ల్యూ)), రాజ్‌కుమార్(సీనియర్ అసిస్టెంట్), శ్రీనివాస్‌స్వామి(డీఈఈ (టీడబ్ల్యూ)), మదన్‌గోపాల్(డెప్యూటీ తహశీల్దార్ ఓఎస్డీ(టీడబ్ల్యూ)), రామరాావు(ఏఈ(టీడబ్ల్యూ) దండేపల్లి), విష్ణు(డీఈ), పి.దైవప్రసాద్(ఏఈ (ఎస్ఎంఐ)), డి.నాగేశ్వర్రావ్( లీగల్ కో ఆర్డినేటర్ ఐకేపీ), హరికృష్ణ(జేడీఎం), కె.విజయకుమార్(అసిస్టెంట్ ఐకేపీ), కె.రాజలింగు(అసిస్టెంట్ ఐకేపీ), రమేశ్(ఏరియా కో ఆర్డినేటర్, కాసిపేట), గంగామణి(ఏపీఎం ఐకేపీ, ఇచ్చోడ), భూమక్క(పీఎం ఐకేపీ, కాసిపేట), జీవన్(ఏపీఎం ఐకేపీ), సుజాత(పీఎం(బ్యాంక్ లింకేజీ)), జి.మాధవి(పీఎం, జాడి దుర్గయ్య(పీఎం), కె.యశ్వనాథ్(అటెండర్), ఎం.రాజయ్య(డ్రైవర్ ), వైద్యులు టి.ప్రభాకర్‌రెడ్డి(డీఎం అండ్ హెచ్‌వో), కళ్యాణ్‌రెడ్డి(అసిస్టెంట్ సివిల్ సర్జన్, ఆదిలాబాద్), శ్రీనివాస్‌రెడ్డి(టీడబ్ల్యూవో, ఉట్నూర్), భోజరావు(ఏహెచ్ఎస్, వేమనపల్లి), అర్క మాణిక్‌రావు(ఎంఎల్ఈ కో ఆర్డినేటర్), సుభాష్‌బాబు(పీఎస్ హెచ్ఎం), మెస్రం మనోహర్(ప్రిన్సిపాల్ పీఈటీసీ, ఉట్నూర్), రాజేశ్(ఏఎంవో పీఎం ఆర్సీ), జగ్డేరావు(ఏపీవో(ఈజీఎస్)), పూర్ణిమ(పీవో ఈజీఎస్, కౌటాల), సంపత్‌కుమార్(ఏపీఆర్వో(పి)), ఉదయ్‌కుమార్(డీపీవో). పంచాయతీరాజ్ సర్కిల్లో.. జె.లక్ష్మీరాజయ్య(ఏఈ, ఆసిఫాబాద్), సయ్యద్ రఫతుల్లా(డెప్యూటీ ఈఈ, ఆసిఫాబాద్). రిమ్స్.. వైద్యుడు కళ్యాణ్‌రెడ్డి(రేడియాలజిస్ట్) ఆర్టీసీ.. ఎ.విలాస్‌రెడ్డి(అసిస్టెంట్ మేనేజర్, ఆదిలాబాద్), ఎల్.రమేశ్(డెప్యూటీ సూపరింటెండెంట్, ఆదిలాబాద్). ఆర్వీఎం.. కె.ప్రకాశ్(అసిస్టెంట్ ఏఎంవో(ట్రైబల్), ఆదిలాబాద్), బి.నికేశ్(కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్), ఎస్.నరేశ్(ఐఈఆర్టీ, ఆదిలాబాద్), ఈ.సంప్రీత్కుమార్(కంప్యూటర్ ఆపరేటర్, ఆదిలాబాద్). ఆర్‌డబ్ల్యూఎస్‌లో.. కె.రాజేంద్రకుమార్(డెప్యూటీ ఈఈ, ఆదిలాబాద్), ఎం.గోవర్ధన్(ఎం అండ్ ఈ స్పెషలిస్ట్, ఆదిలాబాద్), సుకుమార్(పంప్ మెకానిక్, నిర్మల్), సుధాకర్(పంప్ మెకానిక్, నిర్మల్), టి.అంజన్‌రావు(డెప్యూటీ ఈఈ, చెన్నూర్), కె.రాములు(డెప్యూటీ ఈఈ, బెల్లంపల్లి). సాంఘిక సంక్షేమ శాఖలో.. అంచసింగ్(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2, బజార్హత్నూర్), ఖుర్షీద్ జహాబేగం(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2 లక్సెట్టిపేట), గంగాదేవి(హెచ్‌డబ్ల్యూవో గ్రేడ్-2, ఆసిఫాబాద్), దేవుబాయి(కామాటి, ఆదిలాబాద్), రాజన్న(కుక్, వాంకిడి). స్టెప్‌లో.. పి.సుధ(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్). విద్యుత్ శాఖలో.. ఎం.రవీందర్‌రెడ్డి(సీనియర్ అసిస్టెంట్, ఆదిలాబాద్), సీహెచ్.జీవన్‌రావు(హెడ్‌కానిస్టేబుల్, ఆదిలాబాద్), కె.తిరుపతిరెడ్డి(సబ్ ఇంజినీర్, ఆదిలాబాద్), ఎం.శంకర్(జేఎల్ఎం, ఆదిలాబాద్). ట్రాన్స్‌కోలో.. సీహెచ్.రంజిత్‌కుమార్(ఏఎంవీఐ, నిర్మల్) వీడబ్ల్యూ అండ్ సీడబ్ల్యూ.. పద్మశ్రీ(ఐసీడీఎస్ సూపర్వైజర్, లక్సెట్టిపేట), విజయలక్ష్మి(సీడీపీవో, ఖానాపూర్), అమ్రిన్ ఫర్హా(ఐసీడీఎస్ సూపర్వైజర్, ఆదిలాబాద్), శ్రీలత(ఐసీడీఎస్ సూపర్వైజర్, ఉట్నూర్). మున్సిపల్ మెప్మాలో.. ఎ.కృష్ణలాల్(మున్సిపల్ ఇంజినీర్, కాగజ్‌నగర్), ఎస్.అంజయ్య(రెవెన్యూ ఆఫీసర్, కాగజ్‌నగర్), ఎంఏ జలీల్(పట్టణ ప్రణాళిక అధికారి, మంచిర్యాల), గౌరీష్కుమార్(సీనియర్ అసిస్టెంట్, భైంసా).