marriage band party
-
పెళ్లి బరాత్: వరుడిపై కేసు నమోదు..
సాక్షి, మెదక్: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వివాహ బరాత్ నిర్వహించినందుకు గాను వరుడితో పాటు అతని తండ్రి, డీజే సౌండ్ సిస్టం యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే సౌండ్ సిస్టం, సౌండ్ బాక్స్‌లను సీజ్ చేశారు. ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులు వివాహం జరగగా శనివారం రాత్రి గ్రామంలో ట్రాక్టర్‌తో డీజే సౌండ్ సిస్టం పెట్టి ఎక్కువ మందితో భౌతిక దూరాన్ని పాటించకుండా బరాత్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కోవిడ్, కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించారు. ఈమేరకు డీజే సౌండ్ సిస్టం, సౌండ్ బాక్స్‌లను సీజ్‌చేశారు. వరుడు నర్సింహులు, వరుడి తండ్రి సాయిలు, డీజే సౌండ్ సిస్టం యజమాని ఇటిక్యాల రవిపై కేసు నమోదు చేశారు. చదవండి: మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా -
బ్యాండ్ వాయించడానికి వచ్చి..
► జనరేటర్ పొగతో నలుగురి మృతి! ► కర్ణాటకలోని లింగసూగూరులో ఘటన లింగసూగూరు (కర్ణాటక): పెళ్లిలో బ్యాండ్ వాయించి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని వచ్చిన నలుగురు యువకులు.. జనరేటర్ పొగ కారణంగా ఊపిరాడక దుర్మరణం చెందారు. ఈ ఘటన గురువారం రాత్రి కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసూగూరులో చోటు చేసుకుంది. మృతులను లింగసూగూరు మునిసిపాలిటీ పరిధిలోని కరడకల్ గ్రామానికి చెందిన శశికుమార్ (17), ఆదెప్ప (19), మౌలాలి (18), మంజునాథ్ (20)గా గుర్తించారు. వీరితో పాటే నిద్రించిన సురేష్ (21) అనే యువకుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బాగలకోటె జిల్లా ఆస్పత్రికి తరలించారు. లింగసూగూరులోని చేతన్ సౌండ్ సర్వీస్‌లో పనిచేసే వీరంతా గురువారం ఆనేహొసూరులో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు. రాత్రి పొద్దుపోయాక లింగసూగూరుకు తిరిగొచ్చారు. తెల్లవారిన తర్వాత ఇళ్లకు వెళ్దామనుకుని తమ బ్యాండ్ కార్యాలయం (చిన్నపాటి గది)లో నిద్రించారు. ఆ గది సెల్లార్లో ఉంటుంది. కనీసం కిటికీలు కూడా లేవు. గది షట్టర్ మూసేసుకున్నారు. విద్యుత్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేశారు. వారు నిద్రలోకి జారుకున్న తర్వాత గది మొత్తం జనరేటర్ పొగ కమ్ముకుంది. గాఢనిద్రలోనే ఊపిరాడక నలుగురూ మృతి చెందారు. సురేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూడటంతో అదనపు జిల్లా ఎస్పీ ఎస్బీ పాటిల్, డీఎస్పీ శరణ బసప్ప, సీఐ వీరభద్రయ్య తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.