marriage cancel
-
ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..
లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్ ద్వారా తెలియజేశాడు వరుడు. మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని.. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
ప్రేమించిన అమ్మాయే పెళ్లిని చెడగొట్టిందని.. చేతులకు గ్లౌజులు..
సాక్షి, హిమాయత్‌నగర్ (హైదరాబాద్): తాను ప్రేమించిన అమ్మాయే తన పెళ్లిని చెడగొట్టిందనే అక్కసుతో యువతిని చంపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కటకటాలపాలైన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేవరకొండ గ్రామానికి చెందిన రమేష్, సంధ్యలు భార్యభర్తలు. వీరిద్దరూ ఆయిల్‌సీడ్ కాలనీలోని క్వార్టర్స్‌లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. వీరితో పాటు రమేష్ చెల్లెలు అమలశాంతి వారి వద్దే ఉంటూ చదువుకుంటుంది. కొంతకాలం క్రితం సంధ్య తమ్ముడు రాహుల్ కూడా వీరితోనే ఉండేవాడు. అమలశాంతి, రాహుల్‌లు వరుసకు బావ మరదలు కావడంతో కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు అయ్యి, పెద్దలకు కూడా తెలివడంతో మందలించారు. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే సమయంలో రమేష్, సంధ్యల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో మిర్యాలగూడ పోలీసు స్టేషన్లో 498 సెక్షన్ కింద కేసు కూడా ఉంది. సంధ్య తన పుట్టింటి వద్దనే ఉంటుంది. రమేష్, అమలశాంతిలతో పాటు మరో బంధువైన చెన్నకేశవులు ఉంటున్నారు. ఇటీవల రాహుల్‌కు పెళ్లి సంబంధం కుదిరింది. అయితే బంధువుల విచారణలో అమలశాంతితో జరిగిన ప్రేమాయణాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లికూతురు వాళ్లు సంబంధాన్ని రద్దు చేశారు. కావాలనే నా పెళ్లి చెడగొట్టిందనే అక్కసుతో మంగళవారం ఉదయం సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరనుకున్న రాహుల్ అమలశాంతిని చంపేందుకు కుట్ర పన్నాడు. వెంట ఒక చున్నీ, చేతులకు గ్లౌజులను తెచ్చుకున్నాడు. డోర్ లాక్ చేసిన తర్వాత బయటకొచ్చిన అమలశాంతిని చున్నీతో మెడను గట్టిగా నులిమే ప్రయత్నం చేశాడు. అమల శాంతి బిగ్గరగా కేకలు వేయడంతో లోపల ఉన్న చెన్నకేశవులు వచ్చాడు. అంతే క్షణాల్లో రాహుల్ అక్కడ నుంచి పరారైయ్యాడు. మంగళవారం యువతి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నమ్మించి మోసం చేశాడు; పెళ్లి పెటాకులు చేసుకున్నా
''నేను ఎంతో ప్రేమించిన నా బాయ్‌ఫ్రెండ్ ఇంతలా మోసం చేస్తాడని ఊహించలేదు. నా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ లిస్ట్‌ను గమనిస్తే కానీ నాకు ఆ విషయం తెలియలేదు. నా ఇన్‌స్టాలో ఉన్న ఒక అమ్మాయిని నాకు తెలియకుండానే బ్లాక్ చేశాడు. ఆ అమ్మాయితో లవ్ ఎఫైర్ నడిపాడు. తను నా ఫ్రెండ్ అని తెలిస్తే మొదటికే మోసం వస్తుందని ఇలా చేశాడు. ఒకసారి మోసం చేస్తే ప్రేమించాడని వదిలేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నా.. కానీ రెండోసారి అదే తప్పుచేశాడు. అందుకే వాడితో పెళ్లి పెటాకులు చేసుకున్నా'' అంటూ న్యూయార్క్‌కు చెందిన గాబీ మార్సెల్లస్(25) చెప్పుకొచ్చింది. గాబీ మర్సెల్లస్ టిక్‌టాక్ వీడియోతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. యూకేకు చెందిన ఒక యువకునితో ప్రేమాయణం కొనసాగించింది. 2019 సమయంలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గాబీ బాయ్‌ఫ్రెండ్ అమెరికాకు వచ్చాడు. ఆరోజు రాత్రి తాగుతూ ఫుల్ ఎంజాయ్ చేసిన వారిద్దరికి ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ తర్వాత గాబీ మద్యం మత్తులో నిద్రలోకి జారుకోగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్ మాత్రం ఆమె ఫోన్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకొని అక్కడినుంచి వెళ్లిపోయాడు. తర్వాతి రోజు నిద్రలేచిన గాబీ తన ఫోన్ చూసుకోగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం గమనించింది. తాను ఈ పని చేయలేదు.. మరి ఎవరు చేసుంటారు అని ఆలోచించింది. ఇది కచ్చితంగా ఆమె బాయ్‌ఫ్రెండ్ పనేనని, తనకు తెలియకుండా ఈ అమ్మాయితో ఎఫైర్ నడిపిస్తున్నాడా అనే అనుమానం కలిగి వెంటనే బాయ్‌ఫ్రెండ్‌ను అడగ్గా.. ఆరోజు తాగిన మత్తులో తెలియక బ్లాక్ చేసి ఉంటానని కవర్ చేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత లండన్‌కు వచ్చిన గాబీ తన బాయ్‌ఫ్రెండ్ వేరే అమ్మాయితో సీక్రెట్ ట్రిప్‌కు వెళుతున్నట్లు తెలుసుకుంది. ఇదే విషయమై అతన్ని నిలదీయగా.. అలాంటిదేం లేదని.. ఆమెను తన ఇంటిదగ్గర దిగబెట్టడానికి వెళుతున్నానని చెప్పాడు. కానీ గాబీ అతని మాటలు నమ్మకుండా నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావు.. మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని నిలదీసింది. దానికి ఆమె బాయ్‌ఫ్రెండ్ ఒప్పుకోవడంతో అదేరోజు ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వారి జీవితం సాఫీగానే సాగింది. ఉద్యోగం పేరుతో గాబీ బాయ్‌ఫ్రెండ్ లండన్‌కు వచ్చాడు. ఆ తర్వాత అక్టోబర్ 2020లో గాబీ కూడా లండన్ షిఫ్ట్ అయింది. అప్పుడే గాబీకి షాకింగ్ విషయం తెలిసింది. తన బాయ్‌ఫ్రెండ్ ఇంకా ఆ అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటేన్ చేస్తున్నాడని, ఇంతకాలం తనను మోసం చేశాడని గ్రహించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడింది. ఆ తర్వాత ఇద్దరికి జరిగిన ఎంగేజ్మెంట్ చెల్లదని... అతను పెట్టిన రింగ్‌ను మొహం మీద కొట్టేసి గాబీ అక్కడినుంచి వచ్చేసి ప్రస్తుతం న్యూయార్క్‌లో తన లైఫ్ చూసుకుంటుంది. -
పెళ్లి రద్దయ్యిందని.. శానిటైజర్ తాగి
బేతంచెర్ల: వారం రోజుల్లో జరగాల్సిన పెళ్లి రద్దు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలోని శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మోహిద్దీన్‌పురం గ్రామానికి చెందిన వేల్పుల ఏడుకొండలు(22) కుటుంబం కొంత కాలం క్రితం ఉపాధి నిమిత్తం బేతంచెర్లకు వచ్చి స్థిరపడ్డారు. అయ్యలచెర్వులోని పాలీస్ బండల ఫ్యాక్టరీలో పని చేస్తూ జీవనం సాగించేవారు. ఏడుకొండలుకు మహానంది మండలం నందిపల్లెకు చెందిన యువతితో ఆగస్టు 7న వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కాగా కొన్ని కారణాల వల్ల యువతి కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉదయం శానిటైజర్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆరోగ్య కేంద్రానికి తరలించగా, కోలుకోలేక మృతి చెందాడు. మృతుని తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.సురేష్ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లెకు తరలించారు. -
వధువు సహా తల్లిదండ్రుల ఆత్మహత్య
సాక్షి, చెన్నై: కుమార్తె పెళ్లి అర్థంతరంగా ఆగిపోవటంతో ఓ కుటుంబం తీవ్ర మనోవేదన చెందింది. వధువుతోపాటు ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూర్ జిల్లా అమ్మలూరు పిల్లయార్ కోవిల్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గణేశన్, రాసాత్తి దంపతులకు రాజ్‌కుమార్, హరి హరసుధన్ కుమారులు, కుమార్తె గీత (25) ఉన్నారు. రాజ్‌కుమార్ విదేశాలలో ఉద్యోగం చేస్తుండగా మానసిక రోగి అయిన హరిహరసుధన్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇటీవల తిరువారూర్‌కు చెందిన ఓ యువకుడితో గీతకు వివాహ నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వివాహం జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఆ యువకుడి ఇంటి నుంచి వచ్చిన ఫోన్‌కాల్ గణేశన్ కుటుంబాన్ని మనో వేదనకు గురి చేసింది. ఈ పెళ్లి తమకు ఇష్టం లేదని, రద్దు చేస్తున్నట్టు వరుడి కుటుంబం స్పష్టం చేయడంతో వధువు కుటంబసభ్యులు షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో గణేశన్ శనివారం రాత్రి భార్య, కుమార్తెలతో కలిసి సైనెడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటి బయట నిద్రించే హరి హర సుధన్ ఎంతకు తల్లిదండ్రులు బయటకు రాక పోవడంతో ఆదివారం ఉదయం కేకలు పెట్టాడు. ఇరుగు పొరుగు వారు లోపలికి వెళ్లి చూడగా గణేశన్, రాసాత్తి, గీత విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన తిరువారూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిశ్చితార్థం అయ్యాక మోసం చేశారు
నల్లూరు (రొద్దం) : నిశ్చితార్థం అయ్యాక ఆ అమ్మాయిని మరొకరికి ఇచ్చి వివాహం చేసి తమను మోసం చేశాడంటూ ఓ పెళ్లికుమారుడి తండ్రి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. నిశ్చితార్థానికి అయిన ఖర్చును ఇప్పించాలంటున్నాడు. బాధితుడు తెలిపిన మేరకు.. రొద్దం మండలం నల్లూరు గ్రామానికి చెందిన వామన మూర్తి కుమారుడు రాఘవేంద్రరెడ్డికి కొత్తచెరువు మండలం ఓబుళదేవరపల్లికి చెందిన రవీంద్రారెడ్డి కుమార్తెతో ఈ ఏడాది మార్చి 8న నిశ్చితార్థం జరిగింది. అయితే తమకు తెలియకుండా రవీంద్రారెడ్డి తన కూతుర్ని మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడని వామనమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశ్చితార్థానికి రూ.11 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 14న వివాహం జరగాల్సి ఉందని ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని సరుకులు సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. తాము ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వాలని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులను అడిగితే తమను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని, నిశ్చితార్థానికి ఖర్చుపెట్టిన రూ.11 లక్షలు వారి నుంచి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించిన వ్యక్తితో వివాహం చేసుకున్నట్లు సమాచారం. -
మండపంలోనే వరుడిని ఛీకొట్టింది!
పాట్నా: మరికొన్ని క్షణాల్లో పెళ్లితంతు ముగుస్తుందని భావించిన అందరికీ వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తాగుబోతు వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, తాను ఈ వివాహం చేసుకోనని తేల్చి చెప్పడంతో కార్యక్రమం రద్దయింది. ఈ ఆశ్చర్యకర ఘటన బిహార్ లోని బక్సార్ జిల్లా సుజాత్పూర్లో గత శనివారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బిట్టు పాండే(24)కు రాణి కుమారిని ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు భావించారు. శుక్రవారం రాత్రి వరకూ అన్ని పనులు పూర్తిచేశారు. శనివారం ఉదయం పెళ్లితంతు దాదాపు పూర్తయింది. వధువు మెడలో మూడు ముళ్లు పడతాయనగా వరుడిని ఛీకొట్టింది. బిట్టును పెళ్లిచేసుకోనని, అతడు మద్యం సేవించి ఉన్నాడని.. అందుకే సరిగ్గా నిలబడలేకపోతున్నాడంటూ రాణి తన బంధువులకు వివరించింది. ఆమె పెద్దలు ఇందుకు సమ్మతించారు. జీలకర్ర పెట్టిన తర్వాత పెళ్లి ఆగిపోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులు, సన్నిహితులు షాకయ్యారు. పెళ్లిరద్దుపై వధువు రాణి కుమారి బంధువు జై నిశ్వాస్ స్పందించారు. 'బిహార్ లో గత ఏప్రిల్ 5 నుంచి పూర్తి మద్యనిషేధం అములులో ఉంది. ఎవరైనా మద్యం సేవించినట్లు అధికారులు గుర్తిస్తే దాదాపు పదేళ్లపాటు జైలుశిక్ష పడుతుందని వధువు ఇలా చేసింది. ముందుగానే వరుడి గురించి తెలిసినందుకు బంధువులు అందరూ సంతోషంగా ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. గత వారం తూర్పపట్నాలో వరుడు బైక్ డిమాండ్ చేయడంతో వధువు పెళ్లిని ఆపేసిన విషయం తెలిసిందే. -
ఓ చిన్నారి పెళ్లికూతురు పోరాటం
జోధ్‌పూర్: అప్పుడు ఆ పాప వయసు 11 నెలలు. పేరు శాంతాదేవి మేఘ్వాల్. ఊరు.. రాజస్థాన్‌లోని లూనీ తాలూకా రోహిచాన్ ఖుర్ద్ గ్రామం. ఏడాది కూడా నిండని ఆ పసిపాపకు పెళ్లి చేశారు. ఆమె పెరిగింది. మేజర్ అయింది. కాలేజీలో చదువుతోంది. తనకు 11 నెలల వయసులోనే పెళ్లి చేశారని మూడేళ్ల కిందట తెలిసింది. ఆ పెళ్లిని రద్దు చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ.. ‘అత్తింటి వారు’ ఒప్పుకోలేదు. రకరకాలుగా బెదిరించారు. ఆమె పట్టువీడలేదు. దీంతో అత్తింటివారు గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టారు. పంచాయతీ తీర్పు ఇచ్చింది. ఆ బాలికావధువుకు రూ. 16 లక్షల జరిమానా విధించింది. ఆమె కుటుంబాన్ని ఊరి నుంచి బహిష్కరించింది. శాంతాదేవి బెదిరిపోలేదు. న్యాయ పోరాటానికి సన్నద్ధమైంది. సహాయం కోసం సారథి ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. ‘అత్తింటి వారికి’ కౌన్సిలింగ్ ఇప్పించేందుకూ ప్రయత్నిస్తోంది. తన కుమార్తె చదువుకోవాలని.. సమాజంలో దుష్ట సంప్రదాయాలను తిరస్కరిస్తూ ఒక మార్గదర్శిగా నిలవాలని శాంతాదేవి తండ్రి పద్మారామ్ ఇప్పుడు కోరుకుంటున్నారు. -
కట్నం అడిగితే పెళ్లి రద్దు!
హైదరాబాద్: కట్నం అడిగే యువకులను భారతీయ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. షాదీ.కామ్ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. కట్నం అడిగే అబ్బాయిల పట్ల భారతీయ యువతులు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు ఆ సర్వే వెల్లడిస్తోంది. కట్నం అడిగారన్న కారణంతో 51.4 శాతం మంది అమ్మాయిలు పెళ్లినే రద్దు చేసుకున్నారు. కట్నం ఇవ్వాల్సి వచ్చిందని 48.6 శాతం మంది యువతులు సిగ్గుగా ఫీలవుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.