marriage certificate
-
‘ఆర్య సమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవ్’
లక్నో: ఆర్య సమాజ్ ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికెట్ల విషయంలో న్యాయ స్థానం తీవ్రంగా స్పందించింది. పత్రాల వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో నమ్మకాలను దుర్వినియోగం చేస్తున్నారంటూ అలహాబాద్ హైకోర్టు మండిపడింది. ఈ క్రమంలో.. ఆర్య సమాజ్ సొసైటీ ఇచ్చే వివాహ ధ్రువపత్రాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ఆర్యసమాజ్‌లో ప్రధాన్‌లు ఇచ్చే సర్టిఫికెట్‌కు చట్టబద్ధత లేదు. వివాహాలను తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందేనని స్సష్టం చేసింది. ఈ మేరకు ఏకసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నా దాన్ని రిజిస్టర్ చేయకపోతే న్యాయస్థానాల పరిధిలో అధికారికంగా గుర్తించలేమని పేర్కొన్నారు. కేవలం ఆ సంస్థ ఇచ్చే పత్రాలు వివాహ చట్టబద్ధతను నిరూపించలేవని అన్నారు. ఒక తండ్రి తన కూతురి విషయంలో అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై విచారణ సమయంలో.. న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్యాం సమాశ్రయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఆర్యసమాజ్ సొసైటీలు జారీ చేసిన వివాహ ధ్రువీకరణ పత్రాలతో కోర్టు నిండిపోయింది. ఈ కోర్టు, ఇతర హైకోర్టులలో వివిధ విచారణల సమయంలో వాటి చట్టబద్ధతను తీవ్రంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పత్రాల వాస్తవికతను కూడా పరిగణనలోకి తీసుకోకుండా వివాహాలను నిర్వహించడంలో ఆర్య సమాజ్ సంస్థ నమ్మకాలను దుర్వినియోగం చేసింది. ఈ కేసులో.. వివాహం రిజిస్టర్ కానందున పైన పేర్కొన్న సర్టిఫికేట్ ఆధారంగా మాత్రమే పార్టీలు వివాహం చేసుకున్నట్లు భావించలేము’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దొంగతనానికి వచ్చి కక్కుర్తితో అడ్డంగా బుక్కయ్యారు -
ఆర్యసమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
ఆర్యసమాజ్‌లో వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం మనదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా పెళ్లి చేసుకున్నవారికి ఆర్య సమాజ్ నిర్వాహకులు మ్యారేజ్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. వీటిపై వధూవరుల పేర్లు, వయసు, చిరునామా, ఇతర వివరాలు ఉంటాయి. అయితే, ఇలా వివాహ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అధికారం ఆర్యసమాజ్‌కు లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అలాంటి సర్టిఫికెట్లు చెల్లవని తెలియజేసింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సదరు బాధితురాలు మేజరేనని, వారిద్దరూ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారని, మ్యారేజ్ సర్టిఫికెట్ సైతం ఉందంటూ నిందితుడి తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరించలేదు. మ్యారేజీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సింది ప్రభుత్వ సంస్థలు తప్ప ఆర్యసమాజ్ కాదని స్పష్టం చేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. బాధితురాలి తరపున అడ్వొకేట్ రిషీ మతోలియా హాజరై వాదనలు వినిపించారు. ఆర్యసమాజ్‌లో వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం–1954 ప్రకారం అధికారికంగా నిర్వహించాలని ఆదేశిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 4న స్టే విధించింది. మైనర్ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై రాజస్తాన్‌లోని పడూకలాన్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి బెయిల్ దరఖాస్తును రాజస్తాన్ హైకోర్టు గత నెల 5వ తేదీన తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా భంగపాటే ఎదురయ్యింది. -
కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!
పేదింటి ఆడబిడ్డల పెళ్లి ఆ కుటుంబాలకు భారం కాకూడదన్న ఉదాత్త లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిని పారదర్శకంగా అమలు చేసేందుకు ఆన్లైన్ విధానాన్నీ ప్రవేశపెట్టింది. కానీ కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఆడబిడ్డలకు అందే ఆర్థికసాయంలోనూ కక్కుర్తిపడుతున్నారు. చేయి తడిపితేనే పనవుతుందంటూ వసూళ్లకు తెగబడుతున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల దాకా కమీషన్ల రూపంలో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు దళారులుగా మారి కమీషన్లు తీసుకుంటున్నారు. ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఇలాంటి వాస్తవాలెన్నో బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని వెల్లడైంది. దీనిపై ప్రత్యేక కథనం. -చిలుకూరి అయ్యప్ప నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన శ్రీలత (పేరుమార్చాం) కల్యాణలక్ష్మి పథకం కోసం మీసేవ కేంద్రంలో రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు ప్రింటవుట్‌తోపాటు ఇతర ఆధారాలు, జిరాక్సు పత్రాలతో కూడిన ఫైల్‌ను మండల కార్యాలయంలో సమర్పించాలని సదరు మీసేవ నిర్వాహకుడు సూచించాడు. అదే తనకు రూ.500 ఇస్తే ఫైల్‌ను నేరుగా సంబంధిత అధికారులకు చేరుస్తానని.. మీరు వెళితే జాప్యం అవుతుందని చెప్పాడు. దీనితో శ్రీలత సదరు మీసేవ నిర్వాహకుడికి రూ.500 ఇచ్చింది. తర్వాత ఒకరిద్దరు మధ్యవర్తులు శ్రీలత తల్లిదండ్రులను సంప్రదించారు. తహసీల్దార్ ఆఫీసులో పనిత్వరగా కావాలన్నా, దరఖాస్తు ఆమోదం పొందాలన్నా రూ.5వేలు ఖర్చవుతుందని గాలం వేశారు. చేసేదేమీ లేక శ్రీలత తల్లిదండ్రులు డబ్బులు కట్టారు. తర్వాత పరిశీలన, విచారణ వారం, పదిరోజుల్లో పూర్తయ్యాయి. కొద్దిరోజుల తర్వాత చెక్కు జారీ అయిందని, దానికి రూ.2 వేలు ఖర్చవుతుందని మధ్యవర్తులు మళ్లీ ఫోన్ చేశారు. డబ్బులు చెల్లించాక కొద్దిరోజులకు కల్యాణలక్ష్మి సొమ్ము చేతికి అందింది. నిజామాబాద్ జిల్లా భీంగల్‌కు చెందిన షాహీన్ (పేరుమార్చాం) షాదీ ముబారక్ పథకం కింద మీసేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించింది. తర్వాత షాహీన్ తల్లి సదరు దరఖాస్తు, ఇతర ఆధారాలను స్థానిక ప్రజాప్రతినిధి భర్తకు ఇచ్చి ఆర్థిక సాయం త్వరగా వచ్చేలా చూడాలని కోరింది. ఆయన మున్సిపల్ అధికారులు, ఆర్డీవో కార్యాలయంలోని అధికారులకు ‘చెయ్యి తడిపితే’నే పనవుతుందంటూ రూ.10 వేలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత దరఖాస్తు పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాయని చెప్పాడు. దాదాపు ఆరేడు నెలల తర్వాత షాదీముబారక్ నగదు బ్యాంకు ఖాతాలో జమ అయింది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయంలోనూ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల కాసుల కక్కుర్తికి ఈ రెండూ చిన్న ఉదాహరణలు. అక్కడ ఇక్కడ అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు సరిగా విడుదలకాక లబ్ధిదారులకు సొమ్ము అందడంలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. అప్పోసొప్పో చేసి ఆడపిల్లలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ సాయం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంపై బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా సరిగా స్పందించలేదు. నిధులు త్వరలోనే విడుదలవుతాయని, లబ్ధిదారులందరికీ సాయం జమ అవుతుందని మాత్రం పేర్కొన్నారు. అందిన చోటల్లా వసూళ్లే.. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో వసూళ్లకు తెగబడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల నుంచి.. పత్రాల సమర్పణ, పరిశీలన, విచారణ, చెక్కుల మంజూరు దాకా.. ఒక్కోదశలో ఒక్కొక్కరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చాలాచోట్ల దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాక నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వకుండా.. స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించాల్సి వస్తోంది. నేరుగా వెళితే పథకం సొమ్ము రాదంటూ దరఖాస్తుదారులను భయపెడుతుండటమే దీనికి కారణం. స్థానిక ప్రజాప్రతినిధులు తమవద్దకు వచ్చినవారి దరఖాస్తులను సంబంధిత కార్యాలయానికి పంపుతున్నారు. తర్వాత ఫైళ్ల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, మంజూరు సమయంలో అధికారులు, సిబ్బందికి ఇవ్వాలంటూ.. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఎవరివాటా వారికి ఇచ్చి, తామూ కొంత తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఒక్కో దరఖాస్తుదారు వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక్కచోటే 86లక్షలుమింగేశారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంగా విజిలెన్స్ అధికారులు చేసిన పరిశీలనలో దిమ్మతిరిగే అంశాలను గుర్తించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ విషయంలో.. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజినల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయంలోని ఒక సీనియర్ అసిస్టెంట్ ఏకంగా రూ.86,09,976 దారి మళ్లించినట్టు గుర్తించారు. దీనిపై గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. సదరు సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు. ఇది కేవలం ఒక్క ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన అక్రమాల లెక్క మాత్రమే. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఈ తరహా అక్రమాలు భారీగా చోటు చేసుకున్నట్టు విజిలెన్స్ వర్గాలు చెప్తున్నాయి. వివాహ ధ్రువీకరణ పత్రం జారీలోనూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులకు కులధ్రువీకరణ పత్రంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం జారీ సాధారణంగానే జరుగుతున్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం కోసం వసూళ్లు సాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కులధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి వీలుంది. అయితే 95 శాతం మంది స్థానిక సంస్థల నుంచే పత్రాలను తీసుకుంటున్నారు. పంచాయతీల పరిధిలో కార్యదర్శి, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు వాటిని జారీ చేస్తున్నారు. ఈ సమయంలో రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్టు జనాలు చెప్తున్నారు. ఆన్లైన్.. పేరుకే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. అర్హత ఉన్న లబ్ధిదారులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దానిపై అవగాహన లేనివారు సమీపంలోని మీసేవ కేంద్రంలో సర్వీసు చార్జీలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు ఆధారాలను స్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. కానీ చాలాచోట్ల మ్యాన్యువల్‌గా సమర్పించిన దరఖాస్తులనే అధికారులు, సిబ్బంది పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి.. మ్యాన్యువల్‌గా సమర్పించని వారి అర్జీలను నిర్దేశించిన గడువు తర్వాత తిరస్కరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాన్యువల్‌గా పత్రాల సమర్పణపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకున్నా.. రెవెన్యూ అధికారులు, పరిశీలన సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర గందరగోళానికి దారితీస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. -
ఇలాంటి పెళ్లికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలో..!!
నిన్నటి వాలంటైన్స్ డే మణిగంధన్‌కి, సురేఖకు ప్రత్యేకమైనది. ఈ భార్యాభర్తలకు నిన్న మ్యారేజ్ సర్టిఫికెట్ వచ్చింది! కోయంబత్తూర్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళ్లి ఓ సంతకంపెట్టి, పనిలో పనిగా అక్కడి అధికారులకు ఓ దండం పెట్టి బయటికి వచ్చింది ఈ జంట. రెండేళ్లుగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నారు మణిగంధన్, సురేఖ. సరిగ్గా రెండేళ్ల క్రితం వాలంటైన్స్ రోజునే ఫిబ్రవరి 14న వాళ్ల పెళ్లి జరిగింది. చివరికి ఈ నెల మొదట్లో రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ‘మీకు సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఎప్పుడొచ్చి తీసుకుంటారు?’’ అని. అచ్చం సినిమాల్లో చూపించినట్లే.. ఆనందంతో ఎగిరి గంతేశారు. వాలంటైన్స్ డే రోజు వచ్చి తీసుకుంటాం సార్ అని చెప్పారు. వెళ్లి తీసుకున్నారు. మణిగంధన్, సురేఖలకు మ్యారేజ్ సర్టిఫికెట్ రావడానికి ఇంత సమయం పట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది. మణిగంధన్ అబ్బాయి. సురేఖ అమ్మాయి లాంటి అబ్బాయి. ట్రాన్స్ ఉమన్! ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయి.సమాజం కూడా ఒప్పుకుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్లకే ఒప్పుకోడానికి చట్టం అడ్డుపడింది. ఒక పురుషుడికి–స్త్రీకి మధ్య జరిగిన పెళ్లికైతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వగలం కానీ.. ఇలాంటి పెళ్లికి ఏ సెక్షన్ కింద వివాహ పత్రం ఇవ్వాలో తెలియడం లేదు అనేశారు. ‘‘లేదు, మాకు సర్టిఫికెట్ కావలసిందే’’ అని ఈ దంపతులు పట్టుపట్టారు. చట్టాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి కూడా సిద్ధమైపోయారు. చెన్నై వెళ్లి ఇన్స్పెక్టర్ జనరల్ (రిజిస్ట్రేషన్) ని కలిశారు. ‘అవకాశం ఉందేమో చూస్తాను’ అని ఐజీ గారు వాళ్లు పంపించి, సిబ్బంది చేత చట్టాల పుస్తకాలు తెప్పించుకున్నారు. 2009 తమిళనాడు రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజస్ యాక్ట్‌లో సన్నటి దారం లాంటి ఆధారం దొరికింఇ. దాన్ని పట్టుకుని.. ఈ ఏడాది జనవరి 28న అన్ని జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు నోటిఫికేషన్ పంపించారు. ట్రాన్స్‌జెండర్ పెళ్లిళ్లను చట్టబద్దం చేసే ఉత్తర్వు అది. ఆ ఉత్తర్వు కోయంబత్తూరు కూడా చేరింది. అక్కడి అధికారులు వెంటనే మిసెస్ అండ్ మిస్టర్ మణిగంధన్‌కి వర్తమానం పంపారు.. ‘వియ్ ఆర్ రెడీ టు గివ్ యు..’ అని. మొత్తానికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఈ ఆలూమగల చేతికి వచ్చింది. అయినా సర్టిఫికెట్ కోసం ఎందుకు ఇంతగా వీళ్లు పోరాడారు? ‘‘బిడ్డను దత్తత తీసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలన్నారు. ఇప్పుడు ఉంది. త్వరలో మేము అమ్మానాన్న కాబోతున్నాం’’ అన్నారు మణిగంధన్, సురేఖ.. చిరునవ్వులు చిందిస్తూ. -
బాల్రాజా మజాకా!
ప్లీడర్ బాల్‌రాజు దగ్గరికి పెద్దగా క్లయింట్లు రారు. ఆ వచ్చినవాడు కూడా రూపాయి చేతిలో పెట్టి ‘‘ఎలాగైనా సరే కేసు గెలిపించాలి. నీదే పూచీ’’ అంటాడు. ఇలాంటి బాల్రాజుకి గట్టి కేస్ ఒకటి తగిలితే! కమ్మని సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యం విందు చేసే సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘ఇదేనా ప్లీడర్ ఇల్లు?’’ అని ప్రశ్నించి ‘‘ఇదే అయ్యుంటుందిలే’’ అని సమాధానం చెప్పుకున్నాడు రాకరాక వచ్చిన క్లయింటు.ఇంట్లో నుంచి ఒక వ్యక్తి నల్లకోటుతో బయటకు వచ్చాడు. క్లయింట్గారి సందేహానికి నల్లకోటే సమాధానం చెబుతుంది. అయినా సరే...‘‘ఏయ్... ప్లీడర్ బాల్‌రాజు ఇల్లు ఇదేనా?’’ అని సాక్షాత్తు ప్లీడర్నే పట్టుకొని అడిగాడు క్లయింటు.ప్లీడర్‌గారు లైట్‌గా నొచ్చుకొని...‘ఏందయ్యా మంచీమర్యాద లేకుండా. కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా’’ అన్నారు.ఇప్పటికైనా క్లయింటు ఊరుకున్నాడా? ఎక్కడ ఊరుకుంటాడు. మళ్లీ అలాగే అడిగాడు...‘‘ప్లీడర్ బాల్‌రాజు ఇల్లుఇదేనా?’’‘‘నేనేనయ్యా బాల్రాజును. కావాలంటే చూడు ఒక కేసు స్టడీ చేస్తున్నాను’’ అని క్లయింట్‌ను నమ్మించడానికి కళ్లలోని భావాల సహాయ సహకారాలతో తెగ ప్రయత్నించాడు ప్లీడరు.అయినా సరే...‘‘నాకు డౌటే బావా!’’ అన్నారు క్లయింట్గారి బామ్మర్దిగారు.ఇలా కొంచెంసేపయ్యాక... అతడు ప్లీడరేనని, అతని పేరు బాల్రాజేనని, అతడి ఇల్లు ఇదేనని క్లయింట్గారు బలహీనంగా నమ్మారు. తాను ఎందుకొచ్చింది ఇలా చెప్పారు...‘‘ఇంతకీ కేసేమిటంటే, నాకో అరటితోట ఉంది. అందులో రోజూ ఒకడు అరటిగెల మాయం చేస్తున్నాడు. ఆడ్ని చితగ్గొట్టాను...’’‘‘ఓస్ అంతేగా... ముందు ఫీజు ఇవ్వు’’ క్లయింట్‌కు ధైర్యం చెప్పాడు బాల్‌రాజు.క్లయింట్గారు చాలా జాగ్రత్తగా రూపాయి బిళ్లను ప్లీడర్ చేతిలో పెట్టాడు. ప్లీడర్‌గారు నవ్వలేడు. ఏడ్వలేడు. అలా అని మౌనంగానూ ఉండలేడు.... అయ్యో! అంతమాత్రాన మీరు అతడిని చెవిలో దూదిలా తేలిగ్గా తీసిపారేయకండి... ఈ సీన్లలో చూడండి ఎలా విజృంభిస్తున్నాడో... ‘‘యువరానర్ ఇది గోపాలకృష్ణ–సుజాత మ్యారేజి సర్టిఫికెట్. వాళ్లిద్దరికీ పెళ్లైందనడానికి ఇదే ఆధారం’’ అన్నాడు ప్లీడర్ బసవరాజు.‘‘వందరూపాయలకు కూడా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు దొరికే ఈరోజుల్లో ఇలాంటివి బోలెడు సంపాదించవచ్చు’’ అని తేలికగా ఆ సర్టిఫికెట్‌ను తీసేశాడు ప్లీడర్ బాల్‌రాజు. అంతేకాదు...‘‘నా కేసులో నిజం తేల్చడానికి బసవరాజును ఎగ్జామిన్ చేయాలి. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ’’ అని జడ్జివైపు గౌరవపూర్వకంగా చూశాడు బాల్‌రాజు.ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆబగా...‘‘యస్. యూ కెన్ ప్రొసీడ్’’ అని అనుమతి ఇచ్చారు జడ్జిగారు.బసవరాజు బోనులోకి వచ్చాడు. బాల్‌రాజు ప్రశ్నల ఆయుధం అందుకున్నాడు...‘‘మీకు గోపాలకృష్ణగారు ఎంతకాలంగా తెలుసు?’’‘‘పది పదిహేనేళ్లుగా తెలుసు. వాళ్ల కంపెనీకి నేనే లీగల్ అడ్వైజర్‌ని. పైగా... హీ వాజ్ క్లోజ్‌ఫ్రెండ్ ఆఫ్ మైన్’’‘‘ఐసీ. అంత క్లోజ్ఫ్రెండై ఉండి ఈ లీగల్ అడ్వైజర్గారు పెళ్లికి ఎందుకు వెళ్లలేకపోయారు?’’‘‘వెళ్లేవాణ్ణే. కానీ వాళ్లకు పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే’’‘‘ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్లారా లేదా?’’‘‘వెళ్లలేదు’’బసవరాజు చెప్పింది అబద్ధమని పదినిమిషాల్లో నిరూపించాడు బాల్‌రాజు.‘‘మీ ముందు మరో బలమైన సాక్ష్యం ప్రవేశపెడతాను’’ అని జడ్జిగారి అనుమతి కోరాడు. ఆ సాక్షి మనిషి కాదు.టీవీ! ఆ టీవీ ఠీవిగాకోర్టుహాలులోకి వచ్చి నిజమేమిటో చెప్పింది... కాదు... కాదు... చూపించింది. టీవీలో గోపాలకృష్ణ పెళ్లి వీడియో రన్ అవుతోంది. అందులో ప్లీడర్ బసవరాజు చాలా స్పష్టంగా కనిపించాడు!‘పోల్చుకున్నారా బసవరాజుగారూ. ఇది డ్యూయెల్ రోల్ కాదు. మీరే’’ బసవరాజును వెక్కిరింపు ధోరణిలో అన్నాడు బాల్‌రాజు.తేలుకుట్టిన దొంగైపోయాడు బసవరాజు!‘‘ఈ కేసును నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకు వారసురాలిని చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా ఆస్తుల కంటే మించిన సౌభాగ్యం ఏముంటుంది? కానీ, ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడిచేసిన దుర్మార్గుల్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది.ఒక ఆడదాన్ని ఎంతమంది హింసించారు? ఆమె కన్నీటికే గనుక శపించే శక్తి ఉంటే వీళ్లందరినీ సర్వనాశనం చేసి ఉండేది’’ బాల్‌రాజు డైలాగులకు కోర్టు హాలు అదిరిపడింది. బాల్రాజా మజాకా! మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి.నిందితుడు కోర్టు బోనులో ఉన్నాడు.‘‘మీకు పెళ్లై ఎంత కాలమైంది?’’‘‘23 ఏళ్లు. నా భార్య పేరు వర్ధనమ్మ’’‘‘మీకెంతమంది పిల్లలు?’’‘‘ఇద్దరు. ఆదిబాబు, గోపాలకృష్ణ’’‘‘జనరల్‌గా పెద్దపిల్లాడి పేరు మొదట చెబుతారు. ఆ.. అది వదిలేయండి. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేనా?’’‘‘ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది?’’‘‘అలా అని రుజువులేమీ లేవు కదా.అయినా కోర్టువారు నమ్ముతారు లెండి. మీ పిల్లలే అని. మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలవుతుంది?’’‘‘ఆ... డిసెంబరు.... 1965’’‘‘అంతసేపు ఆలోచించారు. మరుపు సహజం. వయసు కదా, సరే 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా...అంటే గోపాలకృష్ణా, ఆదిబాబు కవలపిల్లలా?’’‘‘కాదు... గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు’’‘‘ఎన్నేళ్లు?’’‘‘పదకొండు’’‘‘అంటే, పదకొండేళ్ల ముందు నుంచే వర్ధనమ్మకు మీకు శారీరక సంబంధం ఉందన్నమాట!’’‘‘బాబూ... ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది’’‘‘పొరపాటు, సమాధానం చెప్పడంలోనా? పిల్లల్ని కనడంలోనా? చెప్పండి ఎన్నేళ్ల నుంచి?’’‘‘పెళ్లికి ముందు ఐదేళ్ల నుంచి’’‘‘ఐసీ. ఇంతవరకు గోపాలకృష్ణ మీకు అక్రమసంతానం అనుకున్నా. అసలు మీ కొడుకే కాదన్నమాట’’. ∙ -
తమిళనాడులోని పార్క్ వింత నిర్ణయం
-
ఆ పార్క్‌కి వెళ్లే జంటలకు షాక్
సాక్షి, చెన్నై : చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. పార్క్‌లోకి ప్రవేశించాలంటే వారు తప్పనిసరిగా వివాహ ధృవీకరణ పత్రం చూపించాల్సిందన్న నియమం విధించింది. కోయంబత్తూర్ మరుధామలియా రోడ్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో జంటల వెకిలి చేష్టలు గత కొంతకాలంగా బాగా పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయటంతో అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. పార్క్‌కి వెళ్లే జంటలు తమ వెంట తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ చూపించకపోతే వారిపై పోలీస్ కేసు నమోదు చేస్తారు. తొలుత జంటల ఓటర్ ఐడీ, ఆధార్ తరహాలో గుర్తింపుకార్డులు, ఫోన్ నంబర్లను పరిశీలించాలని భావించారు. కానీ, చివరకు వివాహ ధృవీకరణ పత్రం అయితేనే సబబన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ నిర్ణయంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవటం మంచిదేనని.. అందుకోసం ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదని వారంటున్నారు. పార్క్‌ను ‘ఫ్యామిలీ బిజినెస్’గా మార్చారంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం అమలయ్యాక విద్యార్థుల తాకిడి బాగా తగ్గిందంటూ సిబ్బంది చెబుతున్నారు. -
పెళ్లికి రిజిస్ట్రేషన్ తప్పని సరి
నిడమర్రు : వివాహానికి చట్టబద్ధత కల్పించడం కోసేమే రిజిస్ట్రేషన్. గతంలో పెళ్లి పత్రికలు, ఫొటోలు మాత్రమే వివాహాలకు ఆధారంగా ఉండేవి. అలాకాకుండా వివాహాలు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. జరిగిన వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఇచ్చే పెళ్లి నమోదు పత్రం భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టాన్ని 2002 మే లో రాష్ట్ర గవర్నర్ ఆమోదించగా 2006 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని కూలాలు, మతాలు, వర్గాలకు వర్తించనుంది. ఈ చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలుకు రాష్ట్రస్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. అన్ని జిల్లాలకు జిల్లా రిజిస్ట్రార్ ఉంటారు. వివాహాల రిజిస్ట్రార్ జనరల్‌కు లోబడి జిల్లాలో అమలు చేసే బాధ్యత సంబంధిత సబ్ రిజిస్ట్రార్లపైనే ఉంటుంది. వివాహం నమోదు ఇలా.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు వధువు లేదా వరుడు ఇద్దరిలో ఎవరి తల్లితండ్రులు, సంరక్షకులైనా వివాహం నమోదు కోసం నిర్దేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందించాలి. దరఖాస్తులు వధూవరుల వయస్సు తెలియజేసే ధ్రువపత్రాలు మరియు ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు. వీటిని ఏదైనా గెజిటెడ్ అధికారితో ఎటాస్టడ్ చేయించుకోవాల్సి ఉంది. వీటితోపాటు శుభలేక, ఒక ఫొటో, కల్యాణ మండపంలో జరిగితే అద్దె రసీదు, దేవాలయంలో జరిగితే ఫీజు రసీదులు జత చెయ్యాలి. వధూవరులు తరుపున ముగ్గురు సాక్షులు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చెయ్యాల్సి ఉంటుంది. సాక్షుల ఆధార్ లేదా గుర్తింపు కార్డులు జత చెయ్యాలి. రిజిస్ట్రార్ ఈ సమాచారాన్ని రిజిస్ట్రర్‌లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే ప్రదేశంలోను, మన ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రం (సర్టిఫికెట్)పై ధ్రువీకరణ అధికారి సంతకం సీలు వేసి దంపతులకు అందిస్తారు. ఆ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రూ.210 ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు. గతంలో ఏడాది దాటితే జిల్లా రిజిస్ట్రార్ అనుమతి కోసం పంపేవారమని నేడు స్థానిక సబ్ రిజిస్ట్రార్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు గణపవరం సబ్ రిజిస్ట్రేషన్ అధికారి కె.వజ్రం తెలిపారు. వివాహం ఎందుకు నమోదు చేసుకోవాలంటే..ఈ విధంగా నమోదు చేసుకుంటే జరిగిన వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. - కుటుంబానికి సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేందుకు ఉపయోగపడుతుంది. -భర్త నుంచి విడిపోయినా, దూరంగా ఉన్నా భరణం కోరేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది. -వరకట్నం కేసులో నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా ఈ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడుతుంది. -విడాకులుకోరే భార్య లేదా భర్త కూడా వివాహం జరిగినట్టు ఆధారం చూపించాల్సి ఉంటుంది. -రెండవ వివాహాలను అడ్డుకోవాడనికి మహిళలు లేదా పురుషులకు ఇది ముఖ్యమైన సాక్షంగా ఉపయోగపడుతుంది. తప్పుడు సమాచారానికి శిక్ష వివాహ నమోదు పత్రంలో మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే ఏడాది జైలు శిక్ష లేదా వెయ్యి జరిమానా, లేదా ఈ రెండు అమలు చేస్తారు. - ఉద్దేశ పూర్వకరంగా అధికారి వివాహ నమోదు చెయ్యలేదని దరఖాస్తు దారుని ఫిర్యాదు రుజువైతే ఆఅధికారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా, లేదా రెండు శిక్షలు అమలు చేస్తారు. -
మీ పెళ్లి చట్టబద్ధమేనా?
ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం కానీ.. పెళ్లి చేసుకుంటే కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా..? వివాహానికీ చట్టబద్ధత ఉంటుందా..? ఇలా.. ఈ విషయంపై నిరక్షరాస్యులకే కాదు.. అక్షరాస్యులకూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అధికారులు సరైన ప్రచారం చేపట్టక పోవడంతోనే వివాహ రిజిస్ట్రేషన్లపై ప్రజలకు అవగాహన లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఏటా వేల సంఖ్యల్లో వివాహాలు జరుగుతున్నా ఇందులో పట్టుమని పది కూడా రిజిస్ట్రేషన్‌కు నోచుకోవడం లేదు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం.. అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివాహాలకు చట్టభద్రత కొరవడుతోంది. పెళ్లికి చట్టబద్ధత కల్పించడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎవరికీ తెలియకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. ఫలితంగా పలు పథకాల వర్తింపులో చాలామంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. అసలు వివాహాలను ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి.. చేసుకుంటే ఉపయోగాలేమిటి.. తదితర వంటి అంశాలపై కథనం. మన సంప్రదాయంలో వివాహానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లంటే నూరేళ్ల పంట అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇటీవల వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పరిపాటిగా మారింది. లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేసుకుంటున్న వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను అధికారులూ పట్టించుకోకపోవడంతో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు నమోదు కావడం లేదు. చట్ట ప్రకారం హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల్లో వివాహం చేసుకున్న ప్రతి జంట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాని దీనికి తగిన ప్రచారం కల్పించకపోవటంతో ఆ దిశగా పెళ్లిళ్లు నమోదు కావడం లేదు. వివాహాలు అధికంగా జరుగుతున్నా రిజిస్ట్రేషన్ సంఖ్య మాత్రం అంతకంతకూ దిగజారుతోంది. ఇదే కాకుండా కులాంతర, మతాంతర వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతాయి. అండర్ స్పెషల్ మ్యారేజెస్ చట్టం ప్రకారం రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహమైన రోజున వీరికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. ఇలా జరిగినవి కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఒక్కటి కూడా నమోదు కాలేదు ఏటా వివాహాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే చట్టబద్ధత పొందుతున్నాయి. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అంతంత మాత్రంగానే అమలవుతోంది. వేలల్లో వివాహాలు జరుగుతున్నా వివాహాల రిజిస్ట్రేషన్ నమోదు పెరగటం లేదు. వివాహాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ పదకొండేళ్ల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి తగిన యంత్రాంగం లేకపోవటంతో అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, అధికారులు ప్రచారం చేయకపోవటం ప్రధానం కారణం. దరఖాస్తు చేసుకుంటేనే ఫంక్షన్‌హాళ్లు వివాహా నమోదు చట్టాన్ని అమలు చేసేందుకు ఫంక్షన్‌హాళ్లు, మ్యారేజ్‌హాల్స్, దేవాలయాలకు నగరపాలక సంస్థ కమిషనర్ పేరుతో నోటీసు లు అందజేయాలి. వివాహ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ధ్రు వీకరణ పత్రం అందజేస్తేనే వివాహం చేసుకునే వారికి ఫంక్షన్ హాళ్లు అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు దీన్ని అమలు చేయడం లేదు. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇక ఇళ్ల వద్ద పెళ్లిళ్లు చేసుకునే వారిలో చాలామందికి అసలు ఈ విషయమే తెలియదు. అవగాహన కల్పించాలి వివాహ రిజిస్ట్రేషన్ విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చట్టబద్ధత వల కలిగే ప్రయోజనాలను వివరించటం ద్వారా వివాహాల నమోదు సంఖ్య పెరుగుతుంది. జిల్లా కేంద్రంలో జరిగే ప్రతి వివాహం నగరపాలక సంస్థలో తప్పని సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న విషయం ఇప్పటికి ప్రజలకు తెలియదంటే దీనిపై ప్రచారం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు విధాలుగా దరఖాస్తు పెండ్లికి నెల ముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించి ముందే సమాచారం ఇవ్వటం వల్ల తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వధువు, వరుడి పాస్‌పోర్టు సైజు ఫొటోలు, లగ్న పత్రికను విధిగా ధరఖాస్తు ఫారంతో జతపర్చాలి. ముందుగా దరఖాస్తు చేసుకోనివారు వివాహం చేసుకున్న నెల రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పెండ్లి ఫొటోలు, వధువు, వరుడి రెండు పాస్ ఫొటోలు, లగ్న పత్రికను దరఖాస్తుతో జతపర్చాలి. నగరపాలక సంస్థ సిబ్బంది విచారణ చేపట్టి.. క్లియరెన్స్ ఇవ్వగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రయోజనాలు *వివాహానికి చట్టబద్ధత ఉంటుంది. *కుటుంబానికి సంబంధించిన అన్ని పథకాల వర్తింపునకు ఇది చాలా అవసరం. *వరకట్న వేధింపుల సందర్భాలలో నేరాలు రుజువు కావడానికి ముఖ్య ఆధారం. *హింసకు గురైన లేదా గురవుతున్న స్త్రీ, పురుషులిద్దరికి ఇది సౌకర్యమే. *బాల్య వివాహాలు నివారించవచ్చు. *విదేశాలకు వెళ్లే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. -
తత్కాల్లో వివాహ నమోదు సర్టిఫికెట్
న్యూఢిల్లీ: తత్కాల్ సర్వీసులో పాస్‌పోర్టు, రైలు టికెట్లు పొందినట్టుగానే వివాహ ధ్రువీకరణ పత్రం కూడా కేవలం 24 గంటల్లో నగరవాసులకు ఢిల్లీ ప్రభుత్వం అందిస్తోంది. దంపతుల అవసరం, ప్రాధాన్యతను బట్టి వివాహ నమోదును ఒకేరోజులో అధికారికంగా ధ్రువీకరించేలా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంది. కాగా, 2006 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెళ్లి అయిన నగరవాసులు 60 రోజుల్లోపు వివాహ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ పత్రం పొందే విషయంలో అనేక మంది ఇబ్బందులు పడటాన్ని దృష్టిలో ఉంచుకున్న సర్కార్ కేవలం 24 గంటల్లో వారికి వివాహ ధ్రువీకరణ పత్రం అందించాలని నిర్ణయించిందని రెవెన్యూ విభాగ కార్యదర్శి ధారమ్ పాల్ ఆదివారం విలేకరులకు తెలిపారు. గత నెల 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సేవలకు మంచి స్పందన లభిస్తుందన్నారు. అత్యవసరమున్న వారు అనేక మంది ఒక్కొక్కరు పదివేల రూపాయల ఫీజు చెల్లించి 24 గంటల్లో సర్టిఫికెట్ పొందుతున్నారని తెలిపారు. హిందూ వివాహ చట్టం కింద నమోదు కోసం దరఖాస్తు ఫీజును రూ.100, ప్రత్యేక వివాహ చట్టం కింద రూ.150లు వసూలు చేస్తున్నామన్నారు. అప్లికేషన్ కోసం అవసరమైన ఆఫిడవిట్ల కొనుగోలు కోసం సుమారు రూ.400 నుంచి 500లు దరఖాస్తుదారులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. పస్తుతం వివాహాల నమోదును అదనపు మేజిస్ట్రేట్ పర్యవేక్షిస్తోందని, సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌కు కూడా ఈ పనులు అప్పగించాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే వివాహ నమోదు ప్రక్రియలో పారదర్శకత ఉండటంతో పాటు ఉచిత నమోదు ప్రక్రియ కోసం వచ్చే నెల నుంచి ఓ పోర్టల్‌ను ప్రారంభించాలనుకుంటున్నామని తెలిపారు. ఈ పోర్టల్ నుంచి దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్ పొందేందుకు దశల వారీ ప్రక్రియ వివరాలు కూడా అందులో తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులు తమ దరఖాస్తు స్థితి ఏ దశలో ఉందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని పాల్ వెల్లడించారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశాలను అనుసరించి ఢిల్లీ (వివాహ నమోదు తప్పనిసరి) ఆదేశం, 2014ను కులం, మతం, వధువు, వరుడు కులాలను పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ వివాహ సర్టిఫికెట్లు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలంటే వరుడి వయస్సు 21 సంవత్సరాలు, యువతి వయస్సు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలనే నిబంధనను తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోబోయే వారిలో ఒకరు భారతీయ పౌరుడై ఉండి, వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలనే ఆదేశాలు ఉన్నాయని పాల్ తెలిపారు. దంపతులు తమ ప్రాంతాల్లోని వివాహ అధికారికి ఫారమ్-ఏను సంయుక్తంగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వయస్సు, పౌరసత్వం, వరుడి, వధువు గుర్తింపు కార్డు, వివాహం జరిగిందనే దానికి రూఢి, వారు నివాసముండే పత్రాలను కూడా సమర్పించాలని ఆయన వివరించారు.