Marriage Hall
-
ఆనంద్ మహీంద్రా మెచ్చిన కదిలే కళ్యాణ మండపం.. చూస్తే ‘వావ్’ అనాల్సిందే
దేశంలో సృజనాత్మకతకు కొదవే లేదు. నిత్యం ఎన్నో కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని కొంచెం మేథస్సును జోడించి వినూత్న సదుపాయాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేవారు ఎందరో. అచ్చం ఇలాగే ఆలోచించిన ఓ వ్యక్తి సరికొత్తగా మొబైల్ మ్యారేజ్ హాల్‌ను తీర్చిదిద్దాడు. ఓ ట్రక్కును ఉపయోగించి ఎంతో వినూత్నంగా, ఆకర్షణీయంగా కదిలే బంకెట్ హాల్‌ను రూపొందించారు. ఈ కంటైనర్ వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి వేడుకలకు చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఒక కల్యాణ మండపంలో ఉండే అన్ని సదుపాయాలున్నాయి. అందమైన ఫర్నీచర్, స్టైలిష్ ఇంటీరియర్స్‌తో దీనిని నిర్మించారు. అంతేగాక ఇది పూర్తి ఎకో ఫ్రెండ్లీ. కాగా దాదాపు 40×30 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కళ్యాణ మండపం 200 మందికి సేవలు అందిచగలదు. లోపల చల్లదనం కోసం రెండు ఏసీలనూ '[sg ఏర్పాటు చేశారు. ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేశారు. ఈ క్రియేటివిటీని ఆయన కొనియాడారు. దీన్ని రూపొందించిన వ్యక్తిని కలువాలనుకుంటున్నట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాన్ని అందించడమేకాకుండా పర్యావరణానికి అనుకూలమని తెలిపారు. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశంలో ఇలాంటిది శాశ్వత స్థలాన్ని వినియోగించుకోదని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ కళ్యాణ మండపం వీడియో నెటిజన్ల హృదయాలను దోచుకుంటుంది. I’d like to meet the person behind the conception and design of this product. So creative. And thoughtful. Not only provides a facility to remote areas but also is eco-friendly since it doesn’t take up permanent space in a population-dense country pic.twitter.com/dyqWaUR810 — anand mahindra (@anandmahindra) September 25, 2022 -
డబ్బులిస్తావా.. మ్యారేజ్ హాల్ తగలబెట్టనా?
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్తను బెదిరించి, లక్షల్లో డబ్బు వసూలకు ప్రయత్నించిన కేసులో ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతోన్న వ్యక్తిని ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం వెల్లడించారు. నిందితుడు 2015లో తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే కళ్యాణ మండపాన్ని పేల్చేస్తానని ఓ వ్యాపారవేత్తను బెదిరించాడు. వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్ జిల్లాకు చెందిన విష్ణు (36) ఢిల్లీ వ్యాపారవేత్త ప్రణబ్ సేథ్ నుంచి డబ్బులు వసూలుచేయడానికి పథకం వేశాడు. తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వకుంటే రూప్ నగర్లో ఉన్న ప్రణబ్ కళ్యాణ మండపాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టులో నేరం రుజువయ్యింది. దీనిపై 2015లో తీర్పు వెలువరించిన ఢిల్లీ కోర్టు విష్ణుని దోషిగా నిర్ధారించింది. (చదవండి: కారుతో గుద్దింది గాక పోలీసులకే కట్టుకథ) దాంతో అప్పటి నుంచి విష్ణు పరారీలో ఉన్నాడు. తాజాగా, నిందితుడిని రామ్‌పూర్ జిల్లాలోని అతడి స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నేరస్థుడు తన స్వగ్రామంలో ఉన్నట్టు గుర్తించామని, సెప్టెంబరు 4న అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు విష్ణుపై రాజౌరీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 384, 506 కింద కేసులు నమోదుచేశారు. -
కాపు కల్యాణ మంటపం స్థలం కబ్జా
సాక్షి, రామచంద్రపురం: నియోజకవర్గంలో 25 ఏళ్లుగా సొంత సామాజిక వర్గం కాపుల ఓట్లతోపదవిని అనుభవిస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.. కాపు కల్యాణ మంటపం కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఆయన బంధువులకు కట్టబెట్టారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దామిశెట్టి గంగాపురుషోత్తం ఆరోపించారు. పట్టణంలోని వినయ్‌దుర్గ ఫంక్షన్ హాల్లో ఆదివారం నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కాపు సామాజికవర్గ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇష్టదైవం ప్రసన్నాంజనేయస్వామి సాక్షిగా ఈ విషయాన్ని చెబుతున్నట్టు తెలిపారు. కాపులను కేవలం ఓట్ల కోసమే తప్ప కాపుల అభివృద్ధికి ఎమ్మెల్యే ఏనాడు పాటు పడలేదన్నారు. అమలాపురంలో పశువుల వ్యాపారం చేసుకునే ఆయన 1994లో నియోజకవర్గానికి వచ్చారన్నారు. కల్యాణ మంటపం కట్టుకోవాలంటూ కాపులను ఏకం చేసిన ఆయన.. అప్పటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇండిపెండెంట్‌గా కాపుల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. తొలిసారి ఇండిపెండెంట్‌గా ఆయన గెలిచిన సమయంలో తాను తోట వద్దే ఉన్నానని, ఆ సమయంలో ద్రాక్షారామలో కాపులకు కల్యాణ మంటపం నిర్మించేందుకు దేవస్థానం భూమిని తీసుకున్నట్టు ఆయన వివరించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాపులకు మాత్రం కల్యాణ మంటపాన్ని మాత్రం నిర్మించలేదని విమర్శించారు. అప్పట్లో సేకరించిన ఆ భూమి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.70కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ విషయంలో కాపులను ఆయన నిలువునా మోసం చేశారని విమర్శించారు. తిరిగి కాపులను ఎన్నికల్లో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమ సమయంలో కాపులపై కేసులు పెట్టి పోలీసులు వేధిస్తుంటే అప్పుడేందుకు మాట్లాడలేదని గంగాపురుషోత్తం ప్రశ్నించారు. ఇప్పుడు కాపుల ఓట్లు ఆయనకు కావాల్సి వచ్చాయన్నారు. ఇప్పటికైనా కాపులు మోసపోకుండా ఉండాలని ఆయన కోరారు. కాపులకు అన్నివిధాల అండగా ఉంటానని హామీ ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు పలకాలన్నారు. కాపు నాయకులు తొగరు మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపు సంఘీయులు హాజరయ్యారు. -
బ్యాండ్, బాజాలతో వచ్చిన వరుడికి షాక్
అమృత్సర్ : మరికొన్ని క్షణాల్లో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందంలో... బ్యాండ్, బాజా, భజంత్రీలతో ఊరేగుకుంటూ పెళ్లి మండపానికి వచ్చిన వరుడికి ఊహించని షాక్ ఎదురైంది. పెళ్లి మండపం వద్ద కనీసం పెళ్లి ఏర్పాట్లే కాకుండా.. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు. దీంతో పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందమంతా క్షణాల్లో ఆవిరైపోయింది. ఈ సంఘటన అమృత్‌సర్‌లో జరిగింది. స్థానిక ఆసుపత్రిలో పారామెడిక్ అయిన పర్గత్ సింగ్, తను పెళ్లి చేసుకోవాలనుకున్న సిమ్రాన్‌జిత్ కౌర్‌ను గత కొన్నినెలల క్రితమే కలిశాడు. ఉద్యోగం కోసం పర్గత్ సింగ్ ఆసుపత్రికి వచ్చిన సిమ్రాన్‌జిత్ కౌర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లికి వరుడు తరుఫు కుటుంబం ఎలాంటి షరతులు పెట్టకుండానే అంగీకరించింది. హమ్మయ్యా.. ఇక ఎలాంటి తలనొప్పులు లేవు. హ్యాపీగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి కోసం పర్గత్‌ను సిమ్రాన్‌జిత్, బల్జీత్ కౌర్ అనే మహిళకు పరిచయం చేసింది. ఆమెనే తమ పెళ్లి తేదీలను నిర్ణయిస్తుందని చెప్పింది. అంతేకాక తమ కుటుంబం కోసం పెళ్లి పనులన్నీ తానే చూసుకుంటుందని తెలిపింది. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాననే సంబురంలో అన్నింటికీ ఓకే చెప్పేశాడు పర్గత్. ఈ వేడుక కోసం పెళ్లి కూతురు వైపు వారు తాజ్ ప్యాలెస్ బాంకెట్ హాల్‌ను బుక్ చేసినట్టు చెప్పారు. పర్గత్ తన కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తంగా కలిపి 150 మందితో బ్యాండ్, బాజా, భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కానీ బాంకెట్ హాల్ వారు మాత్రం వారిని లోపలికి అనుమతించలేదు. అసలేమైంది అని కనుక్కుంటే, పెళ్లి కోసం అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగలేదని తెలిసింది. పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండా పోయారు. పెళ్లి కూతురి తరుఫు బంధువులకు ఎంతమందికి ఫోన్లు చేసినప్పటికీ, ఒక్కరూ లిఫ్ట్ చేయకపోవడంతో, ఇక ఏం చేయలేని స్థితిలో పెళ్లి కొడుకు బ్యాచిలర్‌గానే తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఉద్యోగం కోసం సిమ్రాన్‌జిత్ కౌర్ కొన్ని నెలల కిత్రం తనను కలిసిందని, తన కోసం ఉద్యోగం ప్రయత్నిస్తున్న సమయంలో తామిద్దరం ప్రేమలో పడ్డామని పర్గత్ చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నట్టు తెలిపాడు. ఈ పెళ్లి కోసం బల్జీత్ కౌర్‌కు 70వేల రూపాయలు ఇచ్చినట్టు చెప్పాడు. బల్జీత్, సిమ్రాన్‌జిత్‌లు కలిసి తనను మోసం చేసినట్టు లబోదిబోమంటున్నాడు. పోలీసు స్టేషన్లో తన ఫిర్యాదును నమోదు చేశాడు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం తాను లక్షన్నర ఖర్చు చేశానని, కానీ ఆఖరికి సిమ్రాన్‌జిత్ ఇలా చేస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పర్గత్ అసలు, సిమ్రాన్జిత్ను, బల్జీత్కౌర్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలువలేదని ఛేహార్తా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ చెప్పారు. కేవలం మొబైల్ ఫోన్లోనే వారితో సంభాషించినట్టు వెల్లడించారు. విచారణలో నిజనిజాలన్నీ బయటికి వస్తాయన్నారు. -
పెళ్లి మండపం నుంచి వరుడు పరార్..
ఐదు లక్షల రూపాయల ఖర్చుతో వివాహ నిశ్చితార్థం వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి రిసెష్షన్ సైతం బంధువుల హడావుడి మధ్య వైభవంగా జరిగింది. పెద్దల దీవెనలు, ఫొటోలు, వీడియోలు, సహచరుల డాన్స్ తదితర వాటితో కల్యాణమండపం వద్ద అర్ధరాత్రి వరకు కోలాహలం నెలకొంది. ముహుర్తానికి సమయం దగ్గరపడడంతో మంగళ వాయిద్యాలు మొదలయ్యాయి. ఇంతలోనే పెద్ద షాక్ పెళ్లికొడుకుతో పాటు అతని తల్లిదండ్రులు సైతం మండపం నుంచి మాయమయ్యారు. పెళ్లి ఆగిపోయింది. పంచాయతీ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో జరిగిన సంఘటన సర్వత్రా చర్చినీయాంశంగా మారింది. సాక్షి, చిత్తూరు: ముందుగా నిర్ణయించిన ప్రకారం 50 సవర్ల బంగారం ఇవ్వలేదన్న కారణంతో మండపం నుంచి వరుడు పరారయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతానికి చెందిన జానకీరామన్. ఇతను విదేశాల్లో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె శోభాలక్ష్మి(25)కి, చెన్నై ఎగ్మోర్కు చెందిన ప్రభాకరన్ కుమారుడు శరణ్‌కుమార్‌తో గత సెప్టెంబర్‌లో కోలాహలంగా నిశ్చితార్థం నిర్వహించారు. వివాహ నిశ్చితార్థం సమయంలో 50 సవర్ల బంగారంతో పాటు లక్ష నగదు ఇతర వస్తువులను కట్నంగా ఇవ్వాలని పెళ్లి కుమారుడి తరఫున డిమాండ్ చేశారు. కట్నం ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అంగీకరించడంతో జనవరి 21న రిసెప్షన్, 22న ముహుర్తంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం మనవాలనగర్‌లోని ప్రయివేటు కల్యాణమండపంలో రిసెప్షన్ జరిగింది. ఈ స్థితిలో ఆదివారం అర్ధరాత్రి ఇరు కుటుంబాల మధ్య కట్నం ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. మొదట 50 సవర్ల బంగారం ఇస్తామని చెప్పి, తీరా పెళ్లి సమయంలో 40 సవర్ల బంగారం మాత్రమే ఇవ్వడంపై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మరో రెండు నెలల్లో పది సవర్ల బంగారం ఇస్తామని వధువు తరపు వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అందుకు వరుడి తరపు వారు అంగీకరించలేదు. దీంతో పెళ్లికి నిరాకరించిన వరుడు, అతని బంధువులు సోమవారం ఉదయం మూడు గంటలకు మండపం నుంచి వెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆవేదన చెందారు. పెళ్లి కొడుకు ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉండడంతో మనవాలనగర్ పోలీసులను ఆశ్రయించారు. కట్నం తగ్గిందన్న సాకుతో మండపం నుంచి వరుడు పరారయ్యాడని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
పెళ్లి వేడుకల్లో భారీ చోరీ
కర్నూలు: పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలు దొంగలకు అడ్డాగా మారాయి. బుధవారం రాత్రి పొద్దుపోయాక నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో భారీ చోరీ జరిగింది. కల్లూరు మండలం పెద్ద టేకూరు గ్రామానికి చెందిన లక్ష్మీకాంతరెడ్డి కుమారుడి వివాహ వేడుకలు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాలులో జరిగాయి. జనం భారీ ఎత్తున హాజరయ్యారు.! పెళ్లి కూతురుకు సంబంధించిన 13 తులాల బంగారు నగలు, చదివింపులో వచ్చిన రూ.లక్ష మూటగట్టి ఒక సూట్‌కేసులో భద్ర పరిచి గదిలో తాళం వేశారు. అందరూ భోజనాలకు వెళ్లిన సమయంలో దొంగలు ఇదే అదునుగా భావించి గదిలోకి దూరి సూట్‌కేసుతో పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు బంధువులు గదిలోకి చేరుకున్నారు. సూట్‌కేసు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులంతా గాలించినా కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని స్థానిక నాలుగో పట్టణ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల నిఘా కొరవడటంతో ఇటీవల వివాహ వేడుకల్లో వరుస చోరీ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. -
పెళ్లి విందులో గొడవ
హైదరాబాద్: సాఫీగా సాగిపోవాల్సిన పెళ్లి విందు కాస్తా రణరంగంగా మారింది. వధువు, వరుడు తరఫు బంధువులు గొడవకు దిగి ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లికార్జుననగర్‌కు చెందిన ప్రసాద్(25), అంబర్పేట్ కు చెందిన స్వప్న(23) తొమ్మిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువర్గాల మద్య రాజీ కుదరడంతో ఆదివారం గోపాల్‌నగర్ కమ్యూనిటీ హాల్లో పెళ్లి విందు ఏర్పాటు చేశారు. విందులో ఇరువర్గాల మధ్య మొదలైన చిన్న వివాదం చివరికి గొడవకు దారిసింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. దీంతో సోమవారం ఇరువర్గాల వారు మల్కాజిగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
శోకసంద్రంలో వరుడి కుటుంబం
గుంటూరు : పచ్చనితోరణాలతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. తమ ఇంటికి కోడలుగా వస్తున్న యువతిని మృత్యువు మింగేసిందని తెలుసుకున్న వరుడి కుటుంబీకులు దుఃఖసాగరం లో మునిగిపోయారు. గుంటూ రు నెహ్రూనగర్ ఆరోలైన్‌కు చెందిన మునగా శివప్రసాద్, ధనలక్ష్మి దంపతుల రెండో కుమారుడు మునగా ఆనంద్ సౌత్ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి చల్లపల్లికి చెందిన అల్లంశెట్టి సాంబయ్య కుమార్తె అల్లంశెట్టి బాలాకుమారి అలియాస్ అమ్ములుతో వివాహం నిశ్చయమైంది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. నెహ్రూనగర్ 4వ లైనులోని కృష్ణ ప్లాజా ఫంక్షన్ హాలులో వివాహ ఏర్పాట్లుచేశారు. ఫంక్షన్ ప్లాజాను విద్యుత్ దీపాలు, పచ్చని తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. వధువు బాలా కుమారిని తీసుకువస్తున్న కారు తోట్లవల్లూరు వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోవడంతో ఆమె సహా నలుగురు మృతి చెందగా, మరో మహిళకు సీరియస్‌గా ఉంది. దీంతో పెళ్లి కుమారుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంటనే మండపంలో విద్యుత్ దీపాల అలంకరణ తొలగించారు. పచ్చని తోరణాలను తీసి పక్కన వేశారు. వారి కుటుంబంతోపాటు బంధుమిత్రులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులు వెళ్లిపోవడంతో కల్యాణమండపం వెలవెలబోయింది. -
మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యం
జిల్లాలో 234 వైన్ షాపుల ఏర్పాటుకు నిర్ణయం గత ఏడాది కంటే మూడు షాపులు అదనం నాలుగు కేటగిరీలుగా లెసైన్‌స ఫీజులు ఎజెన్సీలో ప్రత్యేక మార్గదర్శకాలతో 19 దుకాణాలు {పభుత్వ గెజిట్ ప్రకారం జిల్లాలో మొత్తం 234 వైన్ షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టింది. కొత్త విధానంలోనూ మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ పద్ధతినే అవలంబించనున్నారు.మద్యం దుకాణాల లెసైన్స్ పొందాలనుకునే వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.25 వేలుగా నిర్ణయించారు. దరఖాస్తుతో పాటు ఫొటోలు, లెసైన్స్ ఫీజులో 10 శాతం ఈఎండీగా చెల్లించాలి. ఇది గరిష్టంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన హన్మకొండలోని రెడ్డి మ్యారేజ్ హాల్లో లాటరీ విధానం ద్వారా వైన్ షాపులను కేటాయించనున్నారు. ఒకరు ఎన్ని షాపులకు... ఎన్ని దరఖాస్తులు చేసుకున్నా... లాటరీలో ఒక షాపు దక్కితే అక్కడితోనే సరిపెడతారు. మిగిలిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. లాటరీలో వైన్ షాపు దక్కిన వారు వెంటనే లెసైన్స్ ఫీజులో మూడో వంతు చెల్లించాలి. వరంగల్ :మద్యం అమ్మకాల ద్వారా ఈ సంవత్సరం (2014-15) ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా 234 మద్యం దుకాణాలు (వైన్ షాపులు) ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన విధానానికి మార్పులు చేస్తూ కొత్త విధానం రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం... జిల్లాకు సంబంధించి ప్రత్యేక గెజిట్‌ను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా కొత్త షాపులను కేటాయించింది. గత ఏడాది జిల్లాలో 231 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణరుురచగా... ఈ సారి మూడు షాపులు అదనంగా ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో గత సంవత్సరం వైన్ షాపుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడు షాపులు మిగిలిపోయూరుు. వాటిని ఈ ఏడాది మన జిల్లాకు కేటాయించారు. జిల్లాలో గత ఏడాది దరఖాస్తులు రాకుండా మిగిలిపోయిన భూపాలపల్లిలోని మూడు షాపులను కేసముద్రం, తొర్రూరు, మరిపెడకు... పరకాల షాపును వర్ధన్నపేటకు కేటాయించారు. లెసైన్స్ ఫీజు ద్వారా రూ.93 కోట్లు జనాభా ప్రాతిపదికన జిల్లాలో ఏర్పాటు చేయనున్న వైన్ షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు మద్యం దుకాణాలు 86, రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు దుకాణాలు 84, రూ.42 లక్షల ఫీజు దుకాణాలు 24, రూ.68 లక్షల చొప్పున లెసైన్స్ పీజుల చెల్లించే మద్యం దుకాణాలు 40 ఉన్నాయి. జిల్లాలో ఏర్పాటు చేయనున్న 234 వైన్ షాపులకు లెసైన్స్ రూపంలోనే రూ.93.59 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఈ వైన్ షాపుల లెసైన్స్ కోసం చేసే దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంది. భారీగా రానున్న దరఖాస్తులతో ఈ మొత్తం కూడా భారీగానే ఉండనుంది. ఈ షాపుల ఏర్పాటు తర్వాత విక్రయించే మద్యంతో ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆదాయం తీరు చూసినా... ఇదే పరిస్థితి కనిస్తోంది. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంలో మద్యం విక్రయాలపై నెలకు సగటున రూ.75 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదిలో రూ.900 కోట్లు వచ్చినట్లు అధికాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇది వెయ్యి కోట్ల రూపాయలు దాటుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏజెన్సీలో 19 షాపులు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటుకు ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి. మన జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో 19 వైన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటూరునాగారం, ములుగు, గూడూరు ఎక్సైజ్ విభాగాల పరి ధిలోకి వచ్చే మండలాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామాల్లో వైన్ షాపు ఏర్పాటు చేసేందుకు గ్రామసభల తీర్మానం తప్పనిసరి. మద్యం దుకాణం ఏర్పాటుకు ఇబ్బంది లేదని గ్రామసభ తీర్మానం చేస్తేనే అక్కడ వైన్ షాపు ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. ఏజెన్సీలో వైన్ షాపు ల లెసైన్స్‌లను అక్కడి స్థానికలకే ఇస్తారు. ఐటీడీఏ పరిధిలో వైన్ షాపుల లెసైన్స్ కోసం దరఖాస్తు చేసే వారు స్థానికత, కులం సర్టిఫికెట్లు జత చేయాలి. వీటిని ప్రమాణికంగా తీసుకుని లాటరీలో దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు.