కర్నూలు: పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలు దొంగలకు అడ్డాగా మారాయి. బుధవారం రాత్రి పొద్దుపోయాక నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటర్నేషనల్ ఫంక‌్షన్ హాలులో భారీ చోరీ జరిగింది. కల్లూరు మండలం పెద్ద టేకూరు గ్రామానికి చెందిన లక్ష్మీకాంతరెడ్డి కుమారుడి వివాహ వేడుకలు ఇంటర్నేషనల్ ఫంక‌్షన్ హాలులో జరిగాయి. జనం భారీ ఎత్తున హాజరయ్యారు.!
పెళ్లి కూతురుకు సంబంధించిన 13 తులాల బంగారు నగలు, చదివింపులో వచ్చిన రూ.లక్ష మూటగట్టి ఒక సూట్‌కేసులో భద్ర పరిచి గదిలో తాళం వేశారు. అందరూ భోజనాలకు వెళ్లిన సమయంలో దొంగలు ఇదే అదునుగా భావించి గదిలోకి దూరి సూట్‌కేసుతో పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు బంధువులు గదిలోకి చేరుకున్నారు. సూట్‌కేసు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులంతా గాలించినా కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని స్థానిక నాలుగో పట్టణ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసుల నిఘా కొరవడటంతో ఇటీవల వివాహ వేడుకల్లో వరుస చోరీ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
పెళ్లి వేడుకల్లో భారీ చోరీ
Published Thu, May 11 2017 9:16 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
Advertisement