marriage praposal
-
పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణహత్య
రావల్పిండి : పాకిస్తాన్లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముస్లిం వ్యక్తి పంపిన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా క్రైస్తవ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రావల్పిండిలోని కోరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. కోరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే షెహజాద్ అనే యువకుడు స్థానికంగా నివసిస్తున్న క్రైస్తవ యువతిని ఇష్టపడ్డాడు. దీంతో యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు ప్రతిపాదన పంపాడు. అయితే యువతి కుటుంబసభ్యులు అందుకు తిరస్కరించడంతో షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా యువతికి ఫైజాన్ అనే యువకుడితో వివాహం జరిపిస్తున్నట్లు తెలుసుకున్న షెహజాద్ మరింత కోపం పెంచుకున్నాడు. మరుసటి రోజు సదరు యువతి ఫైజాన్ బైక్‌పై వెళ్తుండగా గమనించిన షెహజాద్ ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో యువతి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫైజాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత కోపంతోనే షెహజాద్ యువతిని హత్య చేసినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తెలినట్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. -
పెళ్లి కావడం లేదని..
కుషాయిగూడ: పెళ్లి కావడం లేదని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా, లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన రజనీకాంత్ (34) కుటుంబం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి చర్లపల్లిలో ఉంటోంది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రజనీకాంత్‌కు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఎక్కడా సంబంధం కుదరకపోవడంతో మనస్తాపానికి లోనైన రజనీకాంత్ శనివారం రాత్రి వివేకనందనగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అం దించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇది వింతైన పెళ్లి దీక్ష..
సాక్షి, అనకాపల్లిటౌన్ (విశాఖపట్నం): పెళ్లి చేసుకోవాలని వృద్ధులైన మేనమామలు, పెద్దమ్మలు ఒక యువకుడిని కోరుతున్నా.. తాను పెళ్లి చేసుకోనంటూ దీక్ష బూనిన ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గత ఆరురోజులుగా కేవలం పండ్లను మాత్రమే తింటూ పెళ్లికి నిరాకరిస్తున్న యువకుడిని చూసి అక్కడి వారు విస్తుపోతున్నారు. తాను పెళ్లి చేసుకుంటే పెద్దమ్మలను, మేనమామలను వచ్చే భార్య సరిగా చూసుకోదంటూ యువకుడు అంటుంటే.. కనీసం నీ బాగోగుల కోసమైనా పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువకుడిని వీరంతా కోరుతున్నారు. అనకాపల్లి పట్టణంలోని గాంధీనగరం కోర్టువీధిలో ఉంటున్న మణికంఠ రామలింగేశ్వరరావు ఆరు రోజులుగా పండ్లను మాత్రమే తింటూ దీక్ష చేస్తున్నాడు. తనపై ఆధారపడిన తన బంధువులైన ఐదుగురు వృద్ధులు.. తాను పెళ్లి చేసుకుంటే ఆధారం లేనివారవుతారని రామలింగేశ్వరరావు అంటున్నాడు. అందువల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఈ వృద్ధులకు ప్రభుత్వం ఏదైనా దారి చూపాలని కోరుతున్నాడు. ఈ ఐదుగురు వృద్ధులకు ప్రతి నెలా రూ.1500 విలువైన మందులను సామాజిక కార్యకర్త గోల్డ్ వాసు అందిస్తున్నారు. -
ప్రాధేయపడ్డా, నిరాకరించడంతో తగలబెట్టా..
సాక్షి, చెన్నై: పెళ్లి చేసుకోవాలని ఎంతగానే ప్రాధేయ పడ్డా.. అయితే, నిరాకరిస్తూ, తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చ గొట్టడంతో పెట్రోల్ పోసి నిప్పంటించానని పోలీసులకు ఇందుజా హత్య కేసులో నిందితుడు ఆకాష్ వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు బుధవారం తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రేణుక, నివేదలను వానగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చెన్నై ఆదంబాక్కం సరస్వతి నగర్లో పెళ్లికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఇందుజాను వేళచ్చేరికి చెందిన ప్రేమోన్మాది ఆకాష్ సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. నిందితుడు ఆకాష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పాఠశాల స్థాయిలో పరిచయం, ప్రేమ, ఆ ఇంటికి అన్నీ తానై చేసిన సపర్యలను వివరించాడు. ఆ కుటుంబంలో తాను ఒక్కడిగా భావించి, ఇన్నాళ్లు సేవల్ని అందించానని, అయితే, హఠాత్తుగా తనను దూరం పెట్టడంతో మూడు నెలలుగా తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నాడు. ఈ కాలంలో ఎంతో ప్రాధేయ పడ్డానని, అయితే, ఇందుజా మనస్సును ఆమె తల్లి మార్చేసిందని, చివరకు ఇందుజ కూడా తనను అసహ్యించుకోవడంతో ఉన్మాదిగా మారినట్టు వివరించాడు. సోమవారం రాత్రి ఆ ఇంటికి పెట్రోల్ క్యాన్‌తో వెళ్లినా, హతమార్చాలన్న ఉద్దేశం తొలుత లేదని తెలిపాడు. ఆంటీ రేణుక లోనికి అనుమతించలేదని, ఎంతో ప్రాధేయ పడ్డ అనంతరం ఇందుజాతో మాట్లాడే అవకాశం కల్పించా రని, అయితే, ఇందుజా తనను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హెచ్చరికలు చేయడంతో ఇక, హతమార్చాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చి, పెట్రోల్ పోసి నిప్పంటించానని తానూ పోసుకునే క్రమంలో ఆమె తల్లి, చెల్లి బయటకు రావడంతో వారి మీద కూడా పోసినట్టు, ఇరుగు పొరుగు వారు అక్కడికి రావడంతో మోటార్ బైక్ మీద ఉడాయించానని వివరించాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాని, కుటుంబానికి, మిత్రులకు మెసేజ్‌లు కూడా చేసి, చివరకు గస్తీ పోలీసులకు చిక్కినట్టు పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ గస్తీ పోలీసులు తనను అనుమానంతో పట్టుకున్నారని, తర్వాత తానే ఇందుజాను కడతేర్చినట్టు వారి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నాడు. తాను ఆత్మహత్య చేసుకుని ఉంటే బాగుండేదని, అయితే, పోలీసులకు చిక్కినట్టు పేర్కొన్నాడు. దీంతో అతడ్ని బుధవారం ఉదయం కోర్టులో హాజరు పరిచినానంతరం పుళల్ జైలుకు తరలించారు. ఆందోళనలు ఈ ఘటనతో ఆదంబాక్కం పరిసర వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అక్కడి ప్రజలు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్స్పెక్టర్ మురళి వారితో చర్చలు జరిపి హంతకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు తగ్గ సెక్షన్లను నమోదు చేసినట్టు వివరించడంతో అక్కడి ప్రజలు వెనక్కు తగ్గారు. తీవ్రంగా గాయపడ్డ రేణుక, నివేదల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆ ఇద్దర్ని మెరుగైన చికిత్స నిమిత్తం కీల్పాకం నుంచి వానగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, కఠినంగా వ్యవహరించాలని, మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని పీఎంకే అధినేత రాందాసు డిమాండ్ చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొంటూ, ఇటీవల కాలంగా వన్‌సైడ్ లవ్ వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని, ప్రేమోన్మాదుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టడం కాదని, మరొకరు ఇలాంటి తప్పు చేయని రీతిలో కఠినంగా శిక్షించాలన్నారు. -
పెళ్లి చేసుకో అన్నందుకే హత్య
అనంతపురం క్రైం : సహజీవనం చేస్తున్న ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని కోరడంతో, ఆమెని హత్య చేశాడు ప్రియుడు. ఈ నెల 18వ తేదీ రాత్రి చోటు చేసుకున్న ఈ హత్య కేసు వివరాలను త్రీ టౌన్ సీఐ ఆంజినేయులు, ఎస్ఐలు రెడ్డెప్ప, తమీమ్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. బుక్కరాయసముద్రానికి చెందిన షేక్ పటాన్మున్నికి అనంతపురం రాణినగర్లో నివాసముంటున్న దాదావలితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొన్ని నెలలకే వారి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన కురుబ నారాయణ స్వామి కుమారుడు కురుబ పవన్‌కుమార్ తో పటాన్మున్నికి పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉండేది. దీంతో పటాన్మున్ని విడాకులు తీసుకున్న వెంటనే పవన్‌కుమార్ దగ్గరకు వచ్చేసింది. ఈ విషయంపై పవన్‌కుమార్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పవన్‌కుమార్, పటాన్మున్ని అనంతపురం రూరల్ మండలం రాజీవ్‌కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని 4 నెలల నుంచి సహజీవనం సాగించారు. ఇప్పుడు తనను వివాహం చేసుకోవాలని పవన్‌కుమార్‌పై పటాన్మున్ని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో రంజాన్ పండుగ రోజు రాజీవ్‌కాలనీ నుంచి పవన్‌కుమార్, మున్ని బైక్‌పై నేషనల్ పార్కుకు వెళ్లారు. రాత్రి 7 గంటలకు బైక్‌పై పార్కు నుంచి బయలుదేరారు. జాతీయ రహదారి పక్కన ఉన్న సరస్వతి బీఈడీ కళాశాల వద్ద పెళ్లి విషయమై చర్చకు దిగారు. 'నిన్ను పెళ్లి చేసుకోలేనని.. ఇలాగే సహజీవనం కొనసాగిద్దాం' అని పవన్‌కుమార్ మున్నితో చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పవన్‌కుమార్ మున్నిని కిందకు నెట్టి ఆమె చున్నీతో గొంతుకు ఉరివేసి హత్యచేశాడు. అటు వైపు వస్తున్న పాదచారులను చూసి పవన్‌కుమార్ పారిపోయాడు. పటాన్మున్ని అప్పటికే మృతి చెందినట్లు పాదచారులు గుర్తించి, విషయాన్ని త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితున్ని అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరు పరిచారు.