
రజనీకాంత్(ఫైల్)
ఎక్కడా సంబంధం కుదరకపోవడంతో మనస్తాపానికి లోనైన రజనీకాంత్ శనివారం రాత్రి వివేకనందనగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుషాయిగూడ: పెళ్లి కావడం లేదని మనస్తాపానికి లోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా, లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన రజనీకాంత్ (34) కుటుంబం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి చర్లపల్లిలో ఉంటోంది.
ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రజనీకాంత్‌కు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఎక్కడా సంబంధం కుదరకపోవడంతో మనస్తాపానికి లోనైన రజనీకాంత్ శనివారం రాత్రి వివేకనందనగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అం దించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.