Master class
-
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
భారతీయ మహిళలకు రూ.9.4 కోట్ల స్కాలర్షిప్
లండన్: బ్రిటన్‌లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం(స్టెమ్) సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీ చేయాలనుకునే భారతీయ మహిళలకు రూ.9.49 కోట్ల(మిలియన్ పౌండ్లు) స్కాలర్షిప్ అందజేస్తున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ తెలిపింది. ఈ మొత్తాన్ని బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో 2019–20 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ కోర్సులో చేరే 70 మంది భారతీయ మహిళలకు ఇస్తామని వెల్లడించింది. 2018–19 విద్యా సంవత్సరంలో స్టెమ్స్ కోర్సుల్లో చేరిన 104 మంది భారతీయ మహిళలకు స్కాలర్షిప్లు ఇచ్చామని కౌన్సిల్ భారత డైరెక్టర్ అలెన్ గెమ్మెల్ తెలిపారు. వీరంతా ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లో ఉన్న 43 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాయాల్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారని వెల్లడించారు. బ్రిటన్‌లోని ఏ విశ్వవిద్యాలయంలో అయినా 2019, జనవరి 30 నాటికి సీటు పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతేడాది స్టెమ్ కోర్సులు పూర్తిచేసిన భారతీయ యువతుల్లో 50 శాతం కంటే ఎక్కువమంది భారత్‌లోని టైర్–2, టైర్–3 నగరాల నుంచే ఉన్నారని తెలిపారు. గతేడాది దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నతవిద్య కోసం బ్రిటన్ వర్సిటీల్లో చేరారు. బ్రిటన్ సైన్యంలో భారతీయులు.. త్రివిధ బలగాల్లో సిబ్బంది కొరతకు చెక్ పెట్టేందుకు బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, కెన్యా సహా 53 కామన్వెల్త్ దేశాలకు చెందిన యువతను సైన్యంలో చేర్చుకునేందుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం బ్రిటన్‌లో ఐదేళ్ల పాటు స్థిరనివాసం ఉండాలన్న నిబంధనను తొలగించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ త్రివిధ దళాల్లో 8,200 మంది సిబ్బంది కొరత ఉంది. ఈ నేపథ్యంలో కామన్వెల్త్ దేశాల నుంచి ఈ ఏడాది 1,350 మందిని విధుల్లోకి తీసుకునేలా రూపొందించిన ప్రతిపాదనను రక్షణశాఖ పార్లమెంటుకు సమర్పించింది. బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాల్లో చేరేందుకు యువతులకు అవకాశం ఇస్తున్నారు. బ్రిటన్ సైన్యంలో పనిచేసేందుకు నేపాల్ గుర్ఖాలకు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రజలకు ఇప్పటికే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. -
దేవుడా..!
ఎందుకు రిటైరయ్యావ్... నీలో ఇంకా ఇంత ఆట దాచుకుని..! ఎందుకు అభిమానులకు ఈ క్రికెట్ విందు లేకుండా చేశావ్.. నీ అమ్ములపొదిలో అస్త్రాలను అలాగే ఉంచుకొని..! లార్డ్స్‌లో శనివారం సచిన్ టెండూల్కర్ ఆట చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమాని ఆలోచన ఇది. ఆరు నెలల పాటు ఆటకు పూర్తిగా దూరమైనా... మాస్టర్ క్లాస్ తరిగిపోలేదు. బ్యాట్ పట్టకపోయినా షాట్లలో పదును తగ్గలేదు. స్ట్రయిట్ డ్రైవ్, అప్పర్ కట్, స్క్వేర్ డ్రైవ్, కవర్‌డ్రైవ్... ఇలా తన మార్క్ షాట్లతో అభిమానులను ఓలలాడించాడు. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్లకంటే అద్భుతంగా ఆడి ఔరా! అనిపించాడు. ఏడు అణిముత్యాల్లాంటి బౌండరీలతో... ‘క్లాస్’ శాశ్వతం అని మరోసారి నిరూపించాడు. క్రికెట్ దేవుడి బ్యాట్ నుంచి ఆ ఆటను మళ్లీ చూసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్యూ... లార్డ్స్..! -
మాస్టారు క్లాసే మలుపు తిప్పింది
ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని సర్వారం మా సొంతూరు. నాన్న బద్రు, అమ్మ మంగమ్మ. ఎనిమిది సంతానంలో నేనే పెద్ద. మాది పేద కుటుంబం. వ్యవసాయమే ప్రధాన వృత్తి కావడంతో అమ్మనాన్నలకు చేదోడువాదోడుగా పొలం పనులు చేసే వాడిని. అరక దున్నడం, మోట కొట్టడం, చేనుకు నీళ్లు పెట్టడం చేసేవాణ్ని. పస్తులైనా ఉంటాం కానీ చదువు మానొద్దన్నారు.. సర్వారంలోనే 3వ తరగతి వరకు చదివా. ఆ తర్వాత కొత్తగూడెంలోని సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్లో చేరా. రోజు 4కి.మీ. నడిచి బడికి వెళ్లేవాడిని. ఏడో తరగతి వరకు అక్కడే చదివా. ఆ తర్వాత... చదువు మానేద్దామనే ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులు క ష్టపడుతున్న తీరు నన్ను కలచివేసింది. చదువు ఆపేసి వారికి ఆసరాగా నిలుద్దామని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని అమ్మనాన్నకు చెప్పాను. ‘మేం మూడు పూటలు పస్తులుండైనా నిన్ను చదివిస్తాం. కానీ నీవు మాత్రం చదువు ఆపకూడద’ని తేల్చి చెప్పారు. ప్రాథమిక విద్యనభ్యసించినవారికీ చదువు విలువ తెలుసు. తమలా నీవు కష్టపడకూడదని... చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని విడమరిచి చెప్పడంతో వారి మాటను కాదనలేకపోయా. హాస్టల్ బాట పట్టా.. రామవరం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పదో తరగతిలో చేరా. అక్కడే హాస్టల్లో ఉంటూ టెన్త్ పూర్తి చేశా. అప్పటివరకు నేను యావరేజి స్టూడెంట్‌నే. పది పూర్తయిందో లేదో మరోసారి చ దువు మానేయ్యాలనే ఆలోచన మదిని తొలిచింది. ఇరుగు పొరుగువారు వారించడంతో పాల్వంచలోని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్(బైపీసీ)లో చేరా. అప్పటివరకు తెలుగు మాధ్యమంలో చదివిన నేను ఇంటర్లో ఇంగ్లిష్ మీడియం ఎంచుకున్నా. కాలేజీ ప్రిన్సిపాల్ ప్రభావతి మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చేర్చుకునేందుకు తొలుత అభ్యంతరం వ్యక్తంచేశారు. బాగా చదువుతానని అంగీకారపత్రాన్ని నాతో రాయించుకొని ఇంగ్లిష్ మీడియంలో చేర్చుకున్నారు. ప్రిన్సిపాల్ ప్రభావతి మేడమ్‌కు ఇచ్చిన మాట ప్రకారం ఇంటర్లో ప్రతిభ చాటా. ప్రభాకర్‌రావు మాస్టారు క్లాస్‌తోనే.. ఇంటర్లో ఉన్నప్పుడు ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. టెన్త్ ఉత్తీర్ణుడిని కాగానే ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నిరుద్యోగిగా పేరు నమోదు చేయించుకున్నా. సింగరేణికాలరీస్లో మజ్దూర్ కొలువు కోసం కాల్ లెటర్ వచ్చింది. ఇంకేం ఇంటర్వ్యూకు బయలుదేరా. నా అదృష్టం బాగుండి ఆ ఇంటర్వ్యూ వాయిదా పడింది. ఈ విషయం మా బాటనీ లెక్చరర్ ప్రభాకర్‌రావుకు తెలిసింది. ఆయన నాకు తీసుకున్న క్లాస్ నా జీవితాన్నే మలుపు తిప్పింది. ‘అక్షరజ్ఞానం లేని వారు కూడా కూలీ ఉద్యోగానికి వెళ్లొచ్చు. చదువుకునేవారే వెళ్లక్కర్లలేదు. హాయిగా చదువుకొని డాక్టరయ్యేందుకు ప్రయత్నించు’ అని ఆయన చెప్పిన మాటలు నాలో కసిని పెంచాయి. అమ్మకిచ్చిన మాట కోసం.. అధ్యాపకుడి ప్రేరణతో అప్పటివరకు యావరేజి స్టూడెంట్‌గా ఉన్న నేను కాలేజీలో టాపర్‌గా మారాను. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఐఏఆర్ఐలో ఎమ్మెస్సీ చేశా. కస్టమ్స్ ఆఫీసర్, డీఎస్పీగా ఉద్యోగాలు వచ్చినా... నా చూపంతా కలెక్టర్ పోస్టుపైనే ఉండేది. అమ్మానాన్నల కోరిక కూడా అదే. అమ్మకిచ్చిన మాట ప్రకారం సివిల్స్‌కు ప్రిపేరయ్యా. మొదటిసారే ఐఆర్‌టీఎస్‌కు సెలెక్టయ్యా. ఈ పోస్టుతో ప్రజలకు సేవ చేసే వీలుండదని భావించి గ్రూప్-1 రాశా. డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యా. పొదుపు విప్లవం సృష్టించాం.. క ర్నూలు జిల్లా ఆదోనిలో ఆర్డీవోగా తొలి పోస్టింగ్. ఆ తర్వాత పశ్చిమగోదావరిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా... నల్గొండ జిల్లాలో డీఆర్వో, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీ, సహాయ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, నా సర్వీసులో తృప్తినిచ్చింది మాత్రం పశ్చిమగోదావరి, నల్గొండ జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడే. పొదుపు సంఘాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పావలా వడ్డీ పథకంపై మహిళలను సంఘటితం చేశాం. ఇది జాతీయ స్థాయిలో నాకు పేరు తెచ్చిపెట్టింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పురస్కారం లభించింది. ఇది మరిచిపోలేని అనుభవం. ఇష్టమైన ప్రదేశం.. నాకు నచ్చిన హాలీడే స్పాట్ కులు మనాలీ, కాశ్మీర్. సెలవులొస్తే శీతల ప్రాంతాల్లో సేద తీరేందుకు ఇష్టపడతా. వీలున్నప్పుడల్లా సొంతూరు సర్వారం వెళ్లి వస్తా. ఆదివారాల్లో కొద్ది సమయం చిత్ర లేఖనానికి కేటాయిస్తా. యువతకిదే నా సందేశం.. మా రోజులు సౌకర్యాల్లేవు. అవకాశాల గురించి చెప్పే నాథుడేలేరు. ఇప్పుడు అన్నీ మన ముంగిట్లోకి వచ్చాయి. యువతలో పోటీతత్వం కూడా పెరిగింది. అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగితే విజయాలు మన సొంతమవుతాయి. టెన్షన్‌కు గురికాకుండా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయండి. గమ్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. కళలంటే ప్రాణం.. నటన అంటే ఇష్టం. స్కూల్‌డేస్ నుంచే స్టేజిపై నాటకాలు ప్రదర్శించా. ఢిల్లీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో పలు ప్రదర్శనలిచ్చా. కేవలం నాటకాలే కాదు సినిమా రంగంలోనే ప్రవేశం ఉంది. స్నేహితుడా, శౌర్యం తదితర సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశా. ప్రభుత్వ అధికారిని కావడంతో పరిమితులు దాటకుండా వెండితెరపై నటించా. నా హాబీ కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాలేదు. పాటలు కూడా అద్భుతంగా పాడుతా. పలు ఈవెంట్లలోనూ పాడాను. మిమిక్రీ కూడా చేస్తానండి! నా ఫ్యామిలీ.. భార్య కళావతి సివిల్ సర్జన్. ఇలా నేను డాక్టర్ కాలేదన్న కోరిక నెరవేరింది. కూతురు సోనిక, కుమారుడు అభిలాష్. సోనిక బెంగళూరులో బహుళ జాతి సంస్థలో పనిచేస్తుండగా.. కుమారుడు అక్కడే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.