masthan rao
-
వైఎస్సార్ సీపీలో చేరిన బీద మస్తాన్‌రావు
సాక్షి, తాడేపల్లి : నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. అనతి కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోను వైఎస్సార్ సీపీ భగవద్గీత, బైబుల్, ఖురాన్‌గా భావిస్తోందని అన్నారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. నెల్లూరులో టీడీపీకి భారీ షాక్ కాగా బీద మస్తాన్‌రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో బీద మస్తాన్‌రావు ఆ పార్టీని వీడారు. -
నెల్లూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, నెల్లూరు/చిత్తూరు : జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ సీనియర్ నేత బీద మస్తాన్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మస్తాన్‌రావు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా, మస్తాన్‌రావు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. చిత్తూరులోను అదే పరిస్థితి.. చిత్తూరు జిల్లాలోనూ పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ జెడ్పీటీసీ గౌరిబాబు యాదవ్, టీడీపీ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బాబు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంఠ చౌదరిలు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి చెవిరెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
పారిపోయిన వ్యక్తి మా ఎంపీ అభ్యర్థి : చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్ : నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్‌ఇంట్లో హల్ చేస్తున్నాయి. టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో భాగంగా చంద్రబాబు నాయుడు సభావేదికపై నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు అభ్యర్థులను పరిచయం చేశారు. నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, సర్వేపల్లి అభ్యర్థి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటం రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డితోపాటూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్ రావు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మిలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు బీద మస్తాన్ రావును సభకు పరిచయం చేస్తూ ..'నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్ రావుగారూ అవునా కాదా.. పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి .. ఏం తమ్ముళ్లూ .. ఊసరవెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి .. నికార్సయిన వ్యక్తి మస్తాన్ రావుగారూ' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సొంతపార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థినే ఊసరవెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి అంటూ చంద్రబాబు నోరుజారడంతో అక్కడున్నవారంతా అవాక్కాయ్యారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో.. అంతేగా అంతేగా, మీ గురించి ఇన్ని రోజులకు నిజాలు చెప్పారు అంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ఇక మరికొందరు చంద్రబాబు సీనియర్ లోకేష్ అయ్యారంటూ సెటైర్లు వేస్తున్నారు. -
టంగ్ స్లిప్ అయిన చంద్రబాబు..
-
రోడ్డునపడ్డ ఓఎల్సీటీ కంపెనీ కార్మికులు
నల్లగొండ: జిల్లాకు చెందిన ఓ కంపెనీ లాట్ ప్రకటించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నార్కట్ పల్లికి చెందిన ఓఎల్సీటీ కంపెనీ లాట్ ప్రకటించడంతో సుమారు 70 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. 3 రోజుల కిందట కార్మికుల దాడిలో మేనేజర్ మస్తాన్ రావు గాయపడి మృతిచెందిన విషయం విదితమే. తరచు వివాదాలు తలెత్తుతున్నాయన్న కారణంగా కంపెనీని మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆందోళన చేపట్టాలని ఆ కంపెనీ కార్మిక సంఘం నిర్ణయించుకుంది.