పారిపోయిన వ్యక్తి మా ఎంపీ అభ్యర్థి : చంద్రబాబు | Chandrababu Naidu Tongue slips About MP Candidate Masthan Rao | Sakshi
Sakshi News home page

పారిపోయిన వ్యక్తి మా ఎంపీ అభ్యర్థి : చంద్రబాబు

Published Wed, Mar 20 2019 11:24 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Chandrababu Naidu Tongue slips About MP Candidate Masthan Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్‌ఇంట్లో హల్‌ చేస్తున్నాయి. టీడీపీ ఎన్నికల సన్నాహక సభలో భాగంగా చంద్రబాబు నాయుడు సభావేదికపై నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు అభ్యర్థులను పరిచయం చేశారు. నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్‌ అభ్యర్థి అబ్దుల్‌ అజీజ్‌, సర్వేపల్లి అభ్యర్థి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటం రెడ్డి విష్ణు వర్ధన్‌ రెడ్డితోపాటూ నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి బీద మస్తాన్‌ రావు, తిరుపతి పార్లమెంట్‌ అభ్యర్థి పనబాక లక్ష్మిలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు బీద మస్తాన్‌ రావును సభకు పరిచయం చేస్తూ ..'నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్‌ రావుగారూ అవునా కాదా.. పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి .. ఏం తమ్ముళ్లూ .. ఊసరవెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి .. నికార్సయిన వ్యక్తి మస్తాన్‌ రావుగారూ' అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

సొంతపార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థినే ఊసరవెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి అంటూ చంద్రబాబు నోరుజారడంతో అక్కడున్నవారంతా అవాక్కాయ్యారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో.. అంతేగా అంతేగా, మీ గురించి ఇన్ని రోజులకు నిజాలు చెప్పారు అంటూ నెటిజన్లు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక మరికొందరు చంద్రబాబు సీనియర్‌ లోకేష్‌ అయ్యారంటూ సెటైర్లు వేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement