సాక్షి, నెల్లూరు/చిత్తూరు : జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ సీనియర్ నేత బీద మస్తాన్‌రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మస్తాన్‌రావు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా, మస్తాన్‌రావు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది.
చిత్తూరులోను అదే పరిస్థితి..
చిత్తూరు జిల్లాలోనూ పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ జెడ్పీటీసీ గౌరిబాబు యాదవ్, టీడీపీ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బాబు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు నీలకంఠ చౌదరిలు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి చెవిరెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment