Matching Jewelry
-
Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే!
Latest Fashion In Wedding Season- Matching Trends: వధువుకు వరుడిని మ్యాచ్ చేసినట్టే.. డ్రెస్‌కి ఆభరణాలను మ్యాచ్ చేసినట్టే... చేత పట్టుకునే బ్యాగ్‌నూ కాళ్లకు ధరించే చెప్పులనూ మ్యాచ్ చేద్దాం. చెవి జూకాలను, కాలి జూతీలను మ్యాచ్ చేద్దాం. లెహంగా అంచులను షూస్ ఎంబ్రాయిడరీతో మ్యాచ్ చేద్దాం. మ్యాచింగ్‌లో కొత్త ట్రెండ్‌కు వేదిక వేద్దాం. ఇది వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్. సాధారణంగా పెళ్లిలో పట్టు రెపరెపలు, ఎంబ్రాయిడరీ జిలుగులు కళ్లను మెరిపిస్తుంటాయి. వాటికి మ్యాచింగ్‌గా ఆభరణాల ఎంపిక ఉంటుంది. ఇప్పుడిక లెహంగా డిజైన్‌కు సరిపోయే మ్యాచింగ్ క్లచ్‌లు, పాదరక్షల ఎంపిక సరికొత్త ట్రెండ్ అయ్యింది. అందుకే నవ వధువులు కూడా తమ అలంకరణలో ప్రత్యేకత చాటాలనుకుంటున్నారు. వధువు తన వరుడి ఇంటి పేరును బ్యాగులపై జత చేర్చి భద్రంగా మండపానికి తీసుకువస్తుంది. లెహంగా పైన ఉన్న ఎంబ్రాయిడరీ జిలుగులను పొట్లీ వాలెట్‌తో మ్యాచ్ చేస్తుంది. విభిన్నంగా కనిపించాలనే తాపత్రయానికి కొత్త కొత్త హంగులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఒక సర్వే ప్రకారం తేలిందేమంటే.. ఎవరైనా మనల్ని కలిస్తే, ముందుగా వారి కళ్ళు మన పాదాలపైకి వెళ్తాయి. అందువల్ల మేకప్, డ్రెస్సింగ్‌పై ఎంత శ్రద్ధ చూపుతారో, పాదరక్షల పట్ల కూడా సమాన శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. గతంలో వధువులకు పాదరక్షల గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. గోల్డెన్, రెడ్ మెరూన్ వంటి సాధారణ రంగుల ఫుట్‌వేర్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేవి. బ్రైడల్ లెహంగాలు కూడా పరిమిత రంగులతో ఉండటమే దీనికి కారణం. నేడు వధువులు తమ మేకప్లోకి ప్రతి రంగునూ ఆహ్వానిస్తున్నారు. అందుకు సరిపోయే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్లకూ ప్రాధాన్యత ఇస్తున్నారు. వివాహాది శుభకార్యాల వంటి ప్రత్యేక సందర్భాలలో రూపొందించిన పాదరక్షలు, బ్యాగ్‌ల మెటీరియల్‌ను. సిల్క్, వెల్వెట్, శాటిన్, వేగన్ లెదర్‌తో రూపొందిస్తారు. వాటిపై మోటిఫ్, జర్దోసీ, మోతీ, జరీ, దబ్కా, థ్రెడ్ వర్క్‌తో మెరిపిస్తారు. దీనివల్ల ఈ అలంకారాలన్నీ మరింత అందంగా కనిపిస్తాయి. చదవండి👉🏾Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
వాయనం: మీ నగలకు మీరే డిజైనర్!
వేసవి వస్తోంది. బోలెడన్ని ఫంక్షన్లు ఉంటాయి. ప్రతిసారీ దుస్తుల మీదికి మ్యాచింగ్ జ్యూయెలరీ వెతుక్కోవడం పెద్ద పని. అలాగని ప్రతిసారీ కొనాలన్నా ఇబ్బందే. అదే... మనమే నగలు చేసేసుకున్నామనుకోండి... తక్కువ ఖర్చుతో ఎక్కువ నగలు పోగేసుకోవచ్చు. సరదాగా ఈ బ్రేస్లెట్ ట్రై చేసి చూడండి... కావలసినవి: వెండి తీగ, ముత్యాలు (చేతి సైజును బట్టి సంఖ్య), క్రిస్టల్ బీడ్స్ (వీటి సంఖ్య ముత్యాలను బట్టి ఉంటుంది), టాగుల్ రింగ్ - 1 (షాపులో అడిగితే ఇస్తారు. ఇది రెండు విభాగాలుగా ఉంటుంది. బ్రేస్లెట్కి ఇరువైపులా ఫిక్స్ చేసుకోవాలి) తయారీ: ముందుగా మీ చేతి సైజును బట్టి వెండితీగను కత్తిరించుకోవాలి. టాగుల్ రింగులో ఒక భాగానికి తీగని ముడివేయాలి. తరువాత తీగకు ఒక క్రిస్టల్ బీడ్ని ఎక్కించాలి. తర్వాత ఒక ముత్యం ఎక్కించాలి. ఇలా బీడ్స్‌ని, ముత్యాల్ని ఓ వరుసక్రమంలో ఎక్కించి, చివరగా తీగెను టాగుల్ రింగులో రెండో భాగానికి ముడి వేసి, రెండిటినీ కలిపి ఫిక్స్ చేయాలి. అంతే... అందమైన ముత్యాల బ్రేస్లెట్ రెడీ! రెడీమే డ్కి అయ్యే ఖర్చులో సగం కూడా అవ్వదు దీని తయారీకి! వెరీ‘గుడ్డు’ సెపరేటర్! గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే రోజుకో గుడ్డు తినమని వైద్యులు చెబుతుంటారు. అయితే చిన్నప్పుడు ఫర్వాలేదు కానీ... టీనేజ్ దాటినప్పట్నుంచీ గుడ్డులోని పచ్చసొనను తినడం మంచిది కాదని, దానివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటారు. కాబట్టి పచ్చసొన తీసేసి తెల్లదాన్ని మాత్రమే తినాలి. అయితే రెండు సొనలనీ సెపరేట్ చేయడం ఓ పెద్ద పని. ఎంత జాగ్రత్తగా తీద్దామన్నా పచ్చసొన పగిలి కలిసిపోతుంటుంది. ఆ సమస్యను తీర్చడానికే ‘ఎగ్ వైట్ సెపరేటర్’ని కనిపెట్టారు. ఇందులో నాలు గైదు మోడల్స్ ఉన్నాయి. మోడల్ని బట్టి రేటు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది 200 రూపాయల్లో వచ్చేస్తుంది. 150 రూ.కే దొరికేవి కూడా ఉన్నాయి. దీన్ని వెంటనే తెచ్చుకుంటే మీ పని ఈజీ అయిపోతుంది! ఫటాఫట్ పరిష్కారాలు! * వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే కాచేముందు పాలలో చిటికెడు వంటసోడాని కలపాలి! * ఒక్కోసారి ఎంత కడిగినా ఫ్లాస్క్ వాసన వస్తూంటుంది. అలాంటప్పుడు మజ్జిగతో కడిగి ఆపైన నీటితో కడిగితే వాసన పోతుంది! * పిండి వంటలు చేసేటప్పుడు నూనె పొంగుతుంటే, ఒక తమలపాకును నూనెలో వేసి, కాసేపుంచి తీస్తే... నూనె పొంగకుండా ఉంటుంది! * పెసరపిండిలో నిమ్మరసం కలిపి తోమితే వెండి సామాన్లు తళతళలాడతాయి! * బ్రెడ్ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే... ప్యాకెట్లో చిన్న బంగాళాదుంప ముక్కను పెట్టాలి!