Matthews
-
3 వికెట్ల దూరంలో...
క్యాండీ: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను విజయం ఊరిస్తోంది. 301 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన శ్రీలంక శనివారం వెలుతురు లేమి కారణంగా ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. మాథ్యూస్ (88; 6 ఫోర్లు), కరుణరత్నే (57; 4 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. చేతిలో మూడు వికెట్లు ఉన్న లంక విజయానికి ఇంకా 75 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం డిక్వెలా (27 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ లీచ్ (4/73) ధాటికి కౌషల్ సిల్వ (4), ధనంజయ డిసిల్వా (1), కుషాల్ మెండిస్ (1) త్వరగా ఔట్ కావడంతో లంక 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మాథ్యూస్ నాలుగో వికెట్‌కు కరుణరత్నేతో 77, ఐదో వికెట్‌కు రోషన్ సిల్వా (37)తో 73 పరుగులు జతచేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. శ్రీలంక విజయం దిశగా సాగుతున్న సమయంలో స్పిన్నర్ మొయిన్ అలీ (2/65) బౌలింగ్‌లో మాథ్యూస్ వెనుదిరిగాడు. దీంతో లంక మరోసారి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 324/9తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ 346 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్ బెన్ ఫోక్స్ (65 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు. -
రెండేళ్ల తర్వాత...
గాలే: శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకోవడంతో పాటు ఏకైక టి20లో కూడా విజయం సాధించిన ఇంగ్లండ్ టెస్టుల్లోనూ అదే జోరు కొనసాగించింది. శుక్రవారం నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 211 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. 462 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకే ఆలౌటైంది. మాథ్యూస్ (92 బంతుల్లో 53; 5 ఫోర్లు), కుశాల్ మెండిస్ (77 బంతుల్లో 45; 6 ఫోర్లు, సిక్స్), కౌశల్ సిల్వ (30), పెరీరా (30; 3 ఫోర్లు, సిక్స్) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు మొయిన్ అలీ 4, జాక్ లీచ్ 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారుగత 14 విదేశీ టెస్టుల్లో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం. 2016 అక్టోబర్‌లో చిట్టగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్‌పై గెలుపొందిన తర్వాత విదేశీ గడ్డపై 13 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ పదింటిలో ఓడి... మూడింటిని ‘డ్రా’ చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన బెన్ ఫోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో టెస్టు ఈ నెల 14 నుంచి కాండీలో జరుగుతుంది. హెరాత్ వీడ్కోలు... గాలే టెస్టుతో శ్రీలంక సీనియర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ హెరాత్ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. చివరి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన హెరాత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. 93 టెస్టుల్లో 28.07 సగటుతో హెరాత్ 433 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానంతో కెరీర్ ముగించాడు. -
శ్రీలంక లక్ష్యం 462
గాలె: శ్రీలంకతో జరగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయంపై గురి పెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడిన ఆ జట్టు శ్రీలంక ముందు 462 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక నెగ్గాలంటే ఇంకా 447 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు తొలి మ్యాచ్ ఆడుతున్న బెన్ ఫోక్స్ (107; 10 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగుల వద్ద ఆలౌటైంది. పెరీరాకు 5 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకే పరిమితమైంది. మాథ్యూస్ (52) ఒక్కడే అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత కీటన్ జెన్నింగ్స్ (146 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి తోడు స్టోక్స్ (62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 322 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. -
498 పరుగుల ఆధిక్యంలో భారత్
-
గాలే మన గుప్పిట్లోకి...
►498 పరుగుల ఆధిక్యంలో భారత్ ►రెండో ఇన్నింగ్స్ 189/3 ►రాణించిన ముకుంద్, కోహ్లి ►శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 291 శ్రీలంక అత్యద్భుత స్థాయి ప్రదర్శన చేస్తే తప్ప... వరుణుడు నిలువరిస్తే తప్ప... గాలే టెస్టును భారత్ ఇక దక్కించుకున్నట్టే! తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 291 పరుగులకు కట్టడి చేసిన టీమిండియా ఏకంగా 309 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. శ్రీలంక గడ్డపై భారత్‌కు ఇదే అత్యధిక ఆధిక్యం. ఆ తర్వాత లంకకు ఫాలోఆన్ ఇవ్వకుండా బరిలోకి దిగిన భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో అభినవ్ ముకుంద్, విరాట్ కోహ్లి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో భారత్ ఆధిక్యం 498 పరుగులకు చేరింది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో లంక ఈ మ్యాచ్‌ను నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యమే. గాలే: రెండేళ్ల క్రితం ఇదే వేదికపై శ్రీలంక చేతిలో ఎదురైన దారుణ ఓటమికి భారత జట్టు ఈసారి దిమ్మ తిరిగే రీతిలో సమాధానం ఇవ్వడం ఖాయమైంది. ఓపెనర్ అభినవ్ ముకుంద్ (116 బంతుల్లో 81; 8 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (114 బంతుల్లో 76 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 46.3 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. దీంతో భారత్ 498 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. అంతకుముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. దిల్రువాన్ పెరీరా (132 బంతుల్లో 92 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూస్ (130 బంతుల్లో 83; 11 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. స్పిన్నర్ రవీంద్ర జడేజాకు మూడు, షమీకి రెండు వికెట్లు దక్కాయి. రెండో సెషన్లో వర్షం కారణంగా 86 నిమిషాలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దాంతో ఆటను సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించారు. సెషన్–1: ఆదుకున్న పెరీరా, మాథ్యూస్ మూడో రోజు ఆటలోనూ మాథ్యూస్, పెరీరా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో లంక ఇన్నింగ్స్ తొలి గంటసేపు సాఫీగా సాగింది. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన మాథ్యూస్ 59వ ఓవర్లో వెనుదిరిగాడు. దీంతో వీరిద్దరి మధ్య ఆరో వికెట్‌కు 62 పరుగుల విలువైన భాగస్వామ్యం ముగిసింది. రెండు ఓవర్ల అనంతరం ఎల్బీ అయ్యే ప్రమాదాన్ని రివ్యూ అడిగి తప్పించుకున్న పెరీరా... 94 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అలాగే అతను ఏడో వికెట్‌కు హెరాత్ (9)తో కలిసి 36, ప్రదీప్ (10)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 39 పరుగులను జోడించాడు. ప్రదీప్‌ను అవుట్ చేసిన పాండ్యా టెస్టుల్లో తొలి వికెట్ సాధించాడు. ఓవర్లు: 33 పరుగులు: 135 వికెట్లు: 3 సెషన్–2: ధావన్, పుజారా విఫలం లంచ్ విరామం అనంతరం మరో తొమ్మిది బంతుల్లోనే శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. లంక చివరి వికెట్‌ను జడేజా తీయడంతో పెరీరా సెంచరీకి సహకారం లేకుండా పోయింది. గాయం కారణంగా గుణరత్నే బ్యాటింగ్‌కు దిగలేదు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 56 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. పెరీరా బౌలింగ్‌లో ఓపెనర్ ధావన్ (14 బంతుల్లో 14; 3 ఫోర్లు) వైడ్ బంతిని ఆడబోయి బ్యాక్వర్డ్ పాయింట్లో చిక్కాడు. పుజారా (15) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా ఆ వెంటనే భారీ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో టీ బ్రేక్‌ను కూడా ఈ సమయంలోనే ముగించారు. ఓవర్లు: 1.3 పరుగులు: 2 వికెట్లు: 1 (శ్రీలంక) ఓవర్లు: 16.5 పరుగులు: 56 వికెట్లు: 2 (భారత్ ) సెషన్–3: ముకుంద్, కోహ్లి జోరు ఆఖరి సెషన్లో అభిమన్యు ముకుంద్, విరాట్ కోహ్లి లంక బౌలర్లను ఆడుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో తమ వైఫల్యాన్ని అధిగమిస్తూ వీరిద్దరూ ఈసారి అద్భుత ఆటతో చెలరేగారు. లంక బౌలర్ల నుంచి ఈ జోడికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాక పోవడంతో స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించారు. ఈ క్రమంలో ముకుంద్ తన కెరీర్లో రెండో అర్ధ సెంచరీని 78 బంతుల్లో అందుకున్నాడు. అటు వేగంగా ఆడిన కోహ్లి కూడా 68 బంతుల్లో ఈ ఫీట్‌ను సాధించి జోరును చూపాడు. మూడో రోజు చివరి ఓవర్లో ముకుంద్ తన ఎల్బీ అవుట్‌పై రివ్యూకు వెళ్లినా నిరాశ ఎదురైంది. దీంతో మూడో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవర్లు: 29.4 పరుగులు: 133 వికెట్లు: 1 ప్రస్తుతం గురించే ఆలోచిస్తా... గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో తానేంటో నిరూపించుకునేందుకు అవకాశం దక్కిందని ఓపెనర్ అభినవ్ ముకుంద్ అన్నాడు. మూడో రోజు ఆట ముగిశాక ముకుంద్ మాట్లాడుతూ... ‘మరో టెస్టు గురించి ఆలోచన లేదు. ఓ దశలో నేను నా ఫస్ట్ క్లాస్ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాను. ఇప్పుడు భారత జట్టులో ఉన్నానంటే అది నాకు పెద్ద బోనస్. ఒక్కో మ్యాచ్ గురించే నా ఆలోచనంతా.. జూనియర్ స్థాయిలో నేను కోహ్లి, జడేజా ఇతర ఆటగాళ్లతో చాలా మ్యాచ్‌లు ఆడాను. అందుకే నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. ఫీల్డింగ్‌లో క్యాచ్, రనౌట్ చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే 81 పరుగుల వద్ద అవుట్ కావడం నిరాశపరిచింది’ అని అన్నాడు. ►2011 జూన్‌లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్‌లో జరిగిన మ్యాచ్ ద్వారా ముకుంద్, కోహ్లి టెస్టు క్రికెట్లో ఒకేసారి అరంగేట్రం చేశారు. ఆ టెస్టులో ముకుంద్ అర్ధ సెంచరీ చేశాక మళ్లీ గాలే టెస్టులో మరో ఫిఫ్టీ చేశాడు. మరోవైపు ఈ వ్యవధిలో కోహ్లి ఏకంగా 16 సెంచరీలు సాధించడం విశేషం. అంతేకాకుండా ఆరేళ్లలో ముకుంద్, కోహ్లి కలిసి బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి. -
మేమేమీ అజేయులం కాదు!
లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య లండన్: ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు శ్రీలంక షాక్ ఇచ్చింది. అయితే 8 పటిష్ట జట్లు తలపడుతున్న టోర్నీలో ఇలాంటి ఓటమి సహజమేనని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయ పడ్డాడు. ‘మేం చేసిన స్కోరు విజయానికి సరిపోతుందని అనిపించింది. నిజానికి మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్ చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ చాలా బాగా ఆడారనే విషయం మరచిపోవద్దు. వారి ప్రదర్శనను కూడా గుర్తించాలి కదా. అయినా మేమేమీ అజేయులం కాదు. మాకూ పరాజయాలు ఎదురు కావచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. తగిన వ్యూహంతో లంక ఆడిన తీరును అభినందిస్తూ ఓటమిని అంగీకరించడం తప్ప మరేమీ చేయలేమని కోహ్లి అన్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అదనంగా మరో 20 పరుగులైనా చేయాల్సి ఉంటుందని విరాట్ విశ్లేషించాడు. మధ్య ఓవర్లలో కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేయడం భారత్‌కు మొదటినుంచి అలవాటు లేదని ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేశాడు.‘50 ఓవర్ల పాటు దూకుడుగా ఆడే జట్టు కాదు మాది. ఆరంభంలో నెమ్మదిగా ఆడి నిలదొక్కుకున్న తర్వాత చివర్లో చెలరేగిపోవడమే మా శైలి’ అని కెప్టెన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. వరద బాధితులకు అంకితం... మరోవైపు లంక కెప్టెన్ మాథ్యూస్ ‘మా దేశంలో ఇటీవల చోటు చేసుకున్న విషాదం మాటల్లో చెప్పరానిది. వరదల్లో అనేక మంది చనిపోవడంతో దేశం అంతటా ఒక రకమైన బాధాకర వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి స్థితిలో క్రికెట్లో మా గెలుపు వారి మొహాల్లో చిరునవ్వులు పూయిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు. -
ఢిల్లీ నుంచి రబడ, మోరిస్, మాథ్యూస్ ఔట్
న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే చాంపియన్స్‌ట్రోఫీలో తమ జట్ల తరఫున ఆడేందుకు వీలుగా కగిసో రబడ, క్రిస్ మోరిస్ (దక్షిణాఫ్రికా), ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ నుంచి సోమవారం వైదొలిగారు. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగతా 3 మ్యాచ్‌ల్లో నెగ్గాల్సిన స్థితిలో నిలిచిన ఢిల్లీకి ఇది ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పట్టికలో 8 పాయింట్లతో ఉన్న ఢిల్లీ.. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యా చ్ల్లో నెగ్గడంతోపాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలు తనకు అనుకూలంగా ఉండాలి. ఈక్రమంలో తర్వాతి మ్యాచ్‌ను బుధవారం.. గుజరాత్ లయన్స్‌తో కాన్పూర్‌లో ఢిల్లీ ఆడనుంది. -
పోరాడుతున్న శ్రీలంక
రెండో ఇన్నింగ్స్‌లో 309/5 ఇంగ్లండ్‌తో రెండో టెస్టు చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక పోరాడుతోంది. మాథ్యూస్ (105 బంతుల్లో 80; 9 ఫోర్లు; 1 సిక్స్), కుశాల్ సిల్వ (145 బంతుల్లో 60; 6 ఫోర్లు), చండిమాల్ (98 బంతుల్లో 54 బ్యాటింగ్; 5 ఫోర్లు), అర్ధ సెంచరీలు చేశారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో ఐదు వికెట్లకు 309 పరుగులు చేసింది. లంక ఇంకా 88 పరుగులు వెనకబడి ఉంది. సిరివర్ధన (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్‌లో లంక 43.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. -
విజయం దిశగా శ్రీలంక
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు లీడ్స్: కెప్టెన్ మాథ్యూస్ (249 బంతుల్లో 160; 25 ఫోర్లు, 1 సిక్సర్) అద్భుత సెంచరీకి... దమ్మిక ప్రసాద్ (4/15) బౌలింగ్ మెరుపులు తోడవడంతో... ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో శ్రీలంక విజయం దిశగా దూసుకుపోతోంది. నాలుగోరోజు సోమవారం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 132.5 ఓవర్లలో 457 పరుగులకు ఆలౌటయింది. టెయిలెండర్ల సాయంతో మాథ్యూస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులు వెనకబడ్డ లంక... ఇంగ్లండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆట ముగిసే సమయానికి కుక్ సేన 26.2 ఓవర్లలో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. రూట్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రసాద్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరవగా, హెరాత్‌కు ఒక వికె ట్ దక్కింది.