3 వికెట్ల దూరంలో... | Victory in England | Sakshi
Sakshi News home page

3 వికెట్ల దూరంలో...

Published Sun, Nov 18 2018 2:15 AM | Last Updated on Sun, Nov 18 2018 2:16 AM

Victory in England - Sakshi

క్యాండీ: శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ను విజయం ఊరిస్తోంది. 301 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలో దిగిన శ్రీలంక శనివారం వెలుతురు లేమి కారణంగా ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (88; 6 ఫోర్లు), కరుణరత్నే (57; 4 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. చేతిలో మూడు వికెట్లు ఉన్న లంక విజయానికి ఇంకా 75 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం డిక్‌వెలా (27 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ లీచ్‌ (4/73) ధాటికి కౌషల్‌ సిల్వ (4), ధనంజయ డిసిల్వా (1), కుషాల్‌ మెండిస్‌ (1) త్వరగా ఔట్‌ కావడంతో లంక 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో మాథ్యూస్‌ నాలుగో వికెట్‌కు కరుణరత్నేతో 77,  ఐదో వికెట్‌కు రోషన్‌ సిల్వా (37)తో 73 పరుగులు జతచేసి ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. శ్రీలంక విజయం దిశగా సాగుతున్న సమయంలో స్పిన్నర్‌ మొయిన్‌ అలీ (2/65) బౌలింగ్‌లో మాథ్యూస్‌ వెనుదిరిగాడు. దీంతో లంక మరోసారి కష్టాల్లో పడింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 324/9తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ 346 పరుగులకు ఆలౌటైంది. ఆల్‌రౌండర్‌ బెన్‌ ఫోక్స్‌ (65 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా నిలిచాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement