matti satyagraham
-
'ఈస్టిండియా కంపెనీలా చంద్రబాబు పాలన'
చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన బ్రిటీషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ చేపట్టిన మట్టి సత్యాగ్రహం ముగింపు కార్యక్రమాన్ని బుధవారం చిత్తూరుజిల్లా చంద్రగిరిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తిరుపతిలో నిర్వహించిన సభలో మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడు రాష్ట్రానికి ఐదు కాదు.. పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదంటూ కుంటి సాకులు చెప్పి నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబుకు దెయ్యం పట్టిందని ఆ దెయ్యాన్ని ప్రజలే వదిలిస్తారన్నారు. కేవలం ఒక శాతం ఓట్లతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అది కూడా మోదీ కాళ్లు, పవన్ కల్యాణ్ నడుము పట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు పోలవరాన్ని పక్కన పెట్టి తన వారికి కోట్లు ముట్టజెప్పేందుకు పట్టిసీమను తెరపైకి తీసుకువచ్చారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాబు కుటుంబానికి రూ.500 కోట్ల ముడుపులు
అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై కోర్టుకు వెళతామని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా మడకశిరలో మట్టి సత్యాగ్రహం నిర్వహించిన అనంతరం రాయలసీమ వెనుకబాటుతనంపై విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ ముగ్గురూ స్పందించాలన్నారు. లేకపోతే కోర్టులో కేసు వేస్తామన్నారు. పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబానికి రూ.500 కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో నిర్వహిస్తున్న మట్టి సత్యాగ్రహానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని, కన్నతల్లి, సొంత ఊరును విస్మరించే నైజం ఆయనదని రఘువీరా విరుచుకుపడ్డారు. సీఎంకు అమరావతి తప్ప ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. 2015కి పూర్తి కావల్సిన ప్రాజెక్టులకు అతీగతీ లేదన్నారు. ఏపీకి ప్యాకేజీ విభజన చట్టంలోనే ఉందన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పోటీలు పడి మరీ ప్రత్యేక విమానాలు వేసుకుని తిరుగుతున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. తమ పర్యటనలకు వందల కోట్లు తగలేస్తున్నారని, దేశాలు తిరిగితే పరిశ్రమలు రావని, రాయితీలు ప్రకటిస్తే పరిశ్రమలు వస్తాయని ఆయన అన్నారు. -
హోదా కోసం 9 నుంచి మట్టిసత్యాగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9 నుంచి మట్టి సత్యాగ్రహం చేపట్టనుంది. 9న ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా అమరావతిలో సత్యాగ్రహాన్ని ప్రారంభించనుంది. నవంబర్ నెలాఖరువరకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లోని ముఖ్యపట్టణాల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 29న తిరుపతిలో ముగింపు సభ నిర్వహిస్తారు. -
మట్టిసత్యగ్రహం ప్రారంభించిన ఏపీ కాంగ్రెస్
-
రాళ్ల సీమ...ఉత్తి ఆంధ్రా వద్దు: రఘువీరా
హైదరాబాద్ : ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పీపీసీ శనివారం మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డులు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నదీ జలాలను సేకరించి ప్రధానమంత్రి మోదీకి పంపుతామని ఏపీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాయలసీ రాళ్లసీమ...ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రా వద్దని, సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.24వేల కోట్లు ఖర్చు చేయాల్సిందేనన్నారు. కాగా మట్టి సత్యాగ్రహంలో భాగంగా అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందాపురం, గంగులవాయిపాలెం సర్పంచ్‌లు ఇచ్చిన మట్టిత పాటు ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కు అని, దాన్ని అమలు చేయాలంటూ వారు రాసిన లేఖలను రఘువీరా...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొరియర్ చేశారు. ఇక పెంచిన ఆర్టీసీ ఛార్జీలను చంద్రబాబు సర్కార్ వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని సీఎం విస్మరించారని, డీజిల్ ధరలు తగ్గితే బస్సు ఛార్జీలు ఎలా పెంచుతారని రఘువీరా ప్రశ్నించారు.