
రాళ్ల సీమ...ఉత్తి ఆంధ్రా వద్దు: రఘువీరా
హైదరాబాద్ : ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పీపీసీ శనివారం మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డులు, పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నదీ జలాలను సేకరించి ప్రధానమంత్రి మోదీకి పంపుతామని ఏపీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాయలసీ రాళ్లసీమ...ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రా వద్దని, సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.24వేల కోట్లు ఖర్చు చేయాల్సిందేనన్నారు.
కాగా మట్టి సత్యాగ్రహంలో భాగంగా అనంతపురం జిల్లా మడకశిర మండలం గోవిందాపురం, గంగులవాయిపాలెం సర్పంచ్‌లు ఇచ్చిన మట్టిత పాటు ప్రత్యేక హోదా రాష్ట్ర హక్కు అని, దాన్ని అమలు చేయాలంటూ వారు రాసిన లేఖలను రఘువీరా...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కొరియర్ చేశారు.
ఇక పెంచిన ఆర్టీసీ ఛార్జీలను చంద్రబాబు సర్కార్ వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని సీఎం విస్మరించారని, డీజిల్ ధరలు తగ్గితే బస్సు ఛార్జీలు ఎలా పెంచుతారని రఘువీరా ప్రశ్నించారు.