mbt
-
ఎంబీటీతో ఎంఐఎంకు చెక్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ)తో చెక్ పెట్టే దిశలో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన ఎంఐఎంను కట్టడి చేసేందుకు ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహంలో భాగంగా ఎంబీటీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆ ప్రతిపాదన అమల్లోకి వచ్చేలా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంబీటీకి కేటాయించాలనే ప్రతిపాదన అధిష్టానం పెద్దల వరకు చేరింది. అంతకంటే ముందే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో ఎంబీటీని చేర్చుకోవాలని, తద్వారా ఎంఐఎంకు దీటుగా ఎంబీటీని దేశ స్థాయిలో ప్రోత్సహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి సమావేశాల్లో ఎంబీటీని భాగస్వామిని చేయడంతో పాటు ఎన్నికల ప్రచార సభలకు ఆహా్వనించడం ద్వారా ఎంఐఎం ద్వారా బీజేపీకి కలుగుతున్న లబ్ధి, ఆ రెండు పార్టీల దోస్తీని ముస్లిం మైనార్టీలకు అర్థమయ్యేలా పాతబస్తీ పార్టీ అయిన ఎంబీటీతోనే చెప్పించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ‘బస్తీ’మే సవాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన ఎంఐఎం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా తయారయింది. పాతబస్తీలో తనకున్న బలాన్ని, బలగాన్ని వేదికగా చేసుకుని అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ నిలబడింది. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందూ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పట్ల ఎంఐఎం వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు అదనపు బలంగా, తమకు వైరిపక్షంగా మారిన ఎంఐఎంకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంది. పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ఇక ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ పాతబస్తీలో ఒవైసీ సేనకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ అంచనాలతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఎంబీటీ (యాకుత్‌పుర), కాంగ్రెస్ (నాంపల్లి) ఢీ అంటే ఢీ అనేలా ఎంఐఎంతో తలపడ్డాయి. చాలా తక్కువ తేడాతో ఓడిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిన నేపథ్యంలో ఎంబీటీని ముందుంచడం ద్వారా ఆ రెండింటితో పాటు మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టవచ్చనే అంచనాల్లో కాంగ్రెస్ నాయకులున్నారు. ఈ ప్రయత్నంలోనే విజయం సాధిస్తామని, ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎంను కొంతమేర నిలువరించగలిగినా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి మరింత సమర్థవంతంగా ఎంఐఎంను ఢీ కొట్టగలుగుతామనేది అటు ఎంబీ టీ, ఇటు కాంగ్రెస్‌ల భావనగా కనిపిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నప్పుడే ఎంఐఎంను కట్టడి చేయగలం. ఇందుకు ఎంబీటీని వేదికగా చేసుకుని ముందుకెళితే మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం. లోక్‌సభ ఎన్నికలే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మా రెండు పార్టీలు అవగాహనతో వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ ఎన్నికలకు ముందే వాస్తవానికి, ఎంబీటీతో పొత్తుపై అసెంబ్లీ ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయి. అప్పట్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా వచ్చిన ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ రెండు, మూడుసార్లు భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎంబీటీతో స్నేహం నష్టం చేస్తుందనే భావనతో వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే స్నేహం ద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టే దిశలో ముందుకెళుతోంది. ఇందుకు ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ కూడా సుముఖంగా ఉన్నారు. పాతబస్తీలోని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సానుభూతిపరులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఈసారైనా వ్యూహం ఫలించేనా?
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పాగా వేసేందుకు మజ్లిస్–బచావో –తహరిక్ (ఎంబీటీ) పార్టీ వ్యూహత్మకంగా అడుగులేస్తోంది. మూడు దశాబ్దాల కిందటి వైభవం కోసం పడరాని పాట్లు పడుతోంది. రాజకీయ శత్రుపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఏ–ఇత్తేహదుల్ ముస్లిమీ(ఏఐఎంఐఎం)ను మట్టి కరిపించడమే లక్ష్యంగా శక్తియుక్తులను ఒడ్డుతోంది. మజ్లిస్ తరహాలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైనా ఎన్నికలలో ఆ పారీ్టకి పరాభవం తప్పడం లేదు. ఎప్పటి మాదిరిగా పార్టీ సీనియర్ బాధ్యులను కాకుండా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతులైన యువతకు పెద్ద పీట వేసి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనైనా పాగా వేయాలని యోచిస్తోంది. ప్రధానంగా మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు పాతబసీలో అక్షరాస్యత, అభివృద్దిపై ఫోకస్ పెట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఎంబీటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ముస్లిం సామాజికవర్గంలో మార్పు కోసం ఎన్నికల బరిలో దిగేందుకు విద్యావంతులైన యువకులు ముందుకు రావాలని పిలుపునిస్తోంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్ రంగాలకు చెందిన యువత ముందుకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వరకు వ్యవస్థను సరిదిద్దలేమని పేర్కొంటోంది. పోటీకి ఆసక్తిగల అభ్యర్థులు పాతబస్తీ చంచల్గూడలోని ఎంబీటీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తోంది. పట్టు వదలకుండా.. పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసి గట్టెక్కేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. గతంలో పార్టీ ప్రాతినిధ్యం వహించిన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు దక్కించుకునేందుకు వరుసగా ఎన్నికల్లో ప్రయతి్నస్తూ విఫలమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఎఐఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లాఖాన్ నాయకత్వంలో 1993లో ఏర్పడిన మజ్లిస్–బచావ్ తహరీక్ (ఎంబీటీ) 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచు కోటలైన చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయకేతనం ఎగురవేసింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపుకోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీ అధినేత అమానుల్లా ఖాన్ వరుసగా ఐదు పర్యాయాలు విజయం సాధించిన చాంద్రాయణగుట్ట నుంచి ఓటమి చవిచూడక తప్పలేదు. మరోవైపు ముంతాజ్ అహ్మద్‌ఖాన్, విరాసత్ రసూల్ ఖాన్ కూడా ఎంఐఎం గూటికి చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్రమంగా అమానుల్లాఖా¯న్ పెద్ద కుమారుడు ఖయ్యూంఖాన్, యాకుత్‌పురా నుంచి ఫర్హాతుల్లా ఖాన్, మిగతా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట సెగ్మెంట్‌పై ఆశలు వదలుకొని యాకుత్‌పురాపై దృష్టి సారించినా..అక్కడా పరాభవం తప్పలేదు. అయితే ఈసారి సరికొత్త వ్యూహంతో విద్యావంతులైన యువతను రంగంలోని దింపాలని మరోమారు ఎంబీటీ గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
పాతబస్తీలో పాగానే లక్ష్యం
⇒ రెండు దశాబ్దాలుగా ఎంబీటీ యత్నం ⇒ 17 డివిజన్లలో ఈసారి పోటీ ⇒ అక్షరాస్యత, అభివృద్ధే ప్రచారాస్త్రాలు సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఒకే ఒక కార్పొరేటర్ స్థానానికి పరిమితమైన మజ్లిస్-బచావో-తహరిక్ (ఎంబీటీ) పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 డివిజన్లలో పోటీ పడుతోంది. ప్రధాన రాజకీయ శత్రుపక్షమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తేహదుల్-ముస్లిమీన్ (ఎఐఎంఐఎం)ను మట్టికరిపించేందుకు రెండు దశాబ్దాలుగా ఎంబీటీ ప్రయత్నిస్తూనే ఉంది. 2002లో జరిగిన ఎన్నికల్లో రెండు డివిజన్లను దక్కించుకున్న ఎంబీటీ గత ఎన్నికల్లో మాత్రం ఒకే ఒక డివిజన్‌కు పరిమతమైంది. ఈసారి పాతబస్తీతో పాటు కొత్త నగరంలోనూ అభ్యర్థులను రంగంలో దింపింది. మజ్లిస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పాతబస్తీలో అక్షరాస్యత, అభివృద్ధి నినాదంతో ముమ్మర ప్రచారం సాగిస్తోంది. పట్టువదులకుండా... పాతబస్తీలో మజ్లిస్ పార్టీని దెబ్బతీసేందుకు ఎంబీటీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తోంది. రెండు దశాబ్దాల క్రితం అప్పటి మజ్లిస్ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడ్డ విభేదాలతో అమానుల్లా ఖాన్ నాయకత్వంలో 1993లో మజ్లిస్- బచావ్ తహరీక్ (ఎంబీటీ) పురుడుపోసుకుంది 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తొలి విజయం సాధించింది. మజ్లిస్ కంచుకోట చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాల్లో ఎంబీటీ విజయ కేతనం ఎగురవేయగా, మజ్లిస్ కేవలం ఒకే చార్మినార్ నియోజకవర్గానికి పరిమితమైంది. అది కూడా సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ అరంగ్రేటంతో చార్మినార్ దక్కినట్లయింది. అయితే 1999 ఎన్నికల్లో ఎంబీటీ తన బలాన్ని నిలుపు కోలేకపోయింది. రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి జీహెచ్ఎంసీలో... జీహెచ్ఎంసీలో మొట్ట మొదటిసారిగా ఎంబీటీ పక్షాన ఇద్దరు కార్పొరేటర్లు అడుగుపెట్టారు. 2002లో జరిగిన ఎన్నికల్లో చంచల్‌గూడ డివిజన్ నుంచి అమానుల్లా ఖాన్ కుమారుడు అమ్జదుల్లా ఖాన్, బార్కాస్ నుంచి ఆయన సతీమణి సాలేహ బా హమీద్ గెలుపొందారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో అజాంపుర డివిజన్ నుంచి అమ్జదుల్లాఖాన్ ఒక్కరే కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఈసారి మాత్రం 17 డివిజన్లలో ఎంబీటీ తలపడుతూ ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం సాగిస్తోంది.