MD sridhar
-
జనహితం కోరుతూ జెన్కో అడుగులు
సాక్షి, అమరావతి: వెలుగులు పంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరోపక్క విషవాయువులను వెదజల్లుతున్నాయి. దీన్ని తక్షణమే అదుపు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా ఆమ్ల వాయువుల (సల్ఫ్యూరిక్ యాసిడ్) నియంత్రణ తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2015లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమలు కావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లలో ప్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్రక్రియపై దృష్టి పెట్టలేదు. పర్యావరణానికి చేటు తెస్తున్న ఆమ్ల వాయువుల నియంత్రణపై ప్రస్తుత సర్కారు వేగంగా అడుగులేస్తోంది. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. సల్ఫర్‌తో చిక్కే..! రాష్ట్రంలో ఏపీ జెన్కో పరిధిలో 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. పూర్తి స్థాయిలో ఇవి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. బొగ్గును మండించినప్పుడు అందులోని నైట్రోజన్, సల్ఫర్ వంటి వాయువులు వెలువడతాయి. థర్మల్ కేంద్రాల నుంచి గాలిలోకి వెళ్లే వాయువుల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ బొగ్గు వినియోగంలో పాయింట్ ఒక్క శాతం మాత్రమే ఉండాలి. పాత విద్యుత్ కేంద్రాల వల్ల ఇది ఆరు రెట్లు ఎక్కువ ఉంటోందని పర్యావరణ శాఖ చెబుతోంది. విదేశీ బొగ్గు వాడే కేంద్రాల్లో ఇది పది శాతం వరకూ ఎక్కువగా ఉంటోంది. ఆమ్ల వర్షాలకు సల్ఫ్యూరిక్ యాసిడే కారణం. దాదాపు 50 కి.మీ. పరిధిలో దీని ప్రభావం ఉంటుంది. పంటలకు హాని చేస్తుంది. ప్రాణాలను హరించే జబ్బులకూ కారణమవుతుంది. (చదవండి: ‘థర్మల్’కు డిమాండ్) ఎలా నియంత్రిస్తారు..? బొగ్గును బాయిలర్‌లో మండించటం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటకొస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిమ్నీ ద్వారా భూమికి 100 అడుగులపైకి పంపి గాలిలో కలుపుతారు. అది భూమిని చేరేలోపు తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనుసరిస్తున్న విధానమిది. ఎఫ్‌జీడీ ప్రక్రియలో సున్నపురాయిని పొడిచేసి, నీళ్లతో కలిపి చిమ్నీపైకి పంపుతారు. రసాయన చర్య వల్ల సల్ఫర్ జిప్సమ్‌గా మారుతుంది. ఈ జిప్సమ్‌ను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. భారీ ఖర్చే..! ఎఫ్‌జీడీ ప్లాంట్ నిర్మించాలంటే ప్రతీ మెగావాట్‌కు రూ.50 లక్షలు ఖర్చు చేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ జెన్కో దశల వారీగా ఈ ప్రక్రియను చేపడుతోంది. ముందుగా నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: ‘పవర్’ఫుల్ సెక్టార్) టెండర్లు పిలుస్తున్నాం: శ్రీధర్, ఎండీ, జెన్కో ‘ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నాం. ఇప్పటికే డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాం. పర్యావరణానికి ఏమాత్రం హాని లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాంట్లను నిర్మించాలని చూస్తున్నాం’ అని జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు. -
సింగరేణిలో వారసత్వ కొలువులు
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
⇒ 20 ఏళ్ల తర్వాత సింగరేణిలో వారసత్వ కొలువులు ⇒ సీఎం ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ⇒ 48 నుంచి 59 ఏళ్ల వారు అర్హులని నిర్ణయించిన బోర్డు ⇒ 18 వేల మంది కార్మికులకు లబ్ధి ⇒ చంద్రబాబు హయాంలో నిలిపివేసిన నియామకాలు ⇒ పునరుద్ధరణకు కార్మిక సంఘాల సుదీర్ఘ పోరాటం సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం సింగరేణి కార్మికులకు శుభవార్త. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి బోర్డు అంగీకరించింది. ప్రస్తుతం పనిచేస్తున్న సింగరేణి కార్మికుల్లో గత దసరా నాటికి అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సదరు ఉద్యోగి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులని ప్రకటించింది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామనే నిబంధన విధించింది. దీంతో సింగరేణివ్యాప్తంగా దాదాపు 18 వేల మంది కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తు న్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సింగరేణి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వారసత్వ ఉద్యోగాలకు బోర్డు అంగీకరించినట్లు సమావేశం అనంతరం సింగరేణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. ఎంతో కాలంగా ఎదురుచేస్తున్న కార్మికుల కోరిక నెరవేరిందని, ముఖ్యమంత్రి ఆదేశంతో బోర్డు సమావేశంలో చర్చించి ఈ అంశాన్ని ఆమోదించినట్లు వెల్లడించారు. బోర్డు సమావేశంలో మణుగూరు ఒపెన్ కాస్ట్లో ఓబీ తొలగింపునకు అనుమతి, బుల్డోజర్ల కొనుగోలు, హైవాల్ మైనింగ్, సత్తుపల్లి వాషరీల ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు. 1997లో నిలిపివేసిన చంద్రబాబు సర్కారు 1997 వరకు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగింది. నష్టాలు సంభవిస్తున్నాయనే నెపంతో 1997లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియను నిలిపేశారు. అయితే అధికారికంగా ఉద్యోగాల నిలుపుదల గురించి చంద్రబాబు సర్కారు 2002లో ప్రకటించింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు, ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు సింగరేణి సంస్థతో, కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు ఎట్టకేలకు ఫలప్రదమయ్యాయి. అక్టోబర్ 6న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు, సింగరేణి ఏరియాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో సమావేశమై వారసత్వ ఉద్యోగాలపై విన్నవించగా.. సానుకూలంగా స్పందించారు. అదే రోజు సింగరేణి లాభాల బోనస్ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎండీ శ్రీధర్‌తో చర్చలు జరిపిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. వారసత్వ ఉద్యోగాలకు అవకాశం కల్పించాలని, వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారసత్వ ఉద్యోగాల అమలు విధివిధానాలపై సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నతస్థాయి అధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు సానుకూలమైన నిర్ణయం వెలువడటంతో సింగరేణివ్యాప్తంగా కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. 18 వేల మందికి వరం.. సింగరేణి యాజమాన్యం నిర్ణయం సంస్థలో పనిచేస్తున్న 53 విభాగాల ఉద్యోగులకు, కార్మికులకు వరం కానుంది. దాదాపు 18 వేల మంది కార్మికులు వారసత్వపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తేల్చింది. సింగరేణిలో ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లు. ఉద్యోగ విరమణకు ఏడాది ముందు వరకు వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు కార్మికులను అర్హులుగా ప్రకటించడంతో వారికి కొంత ఊరట లభించినట్లైంది. నిలిపివేత తర్వాత ఉద్యోగ విరమణ చేసిన తమను కూడా వారసత్వ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ విరమణ చేసిన కార్మికుల కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సింగరేణికి యువశక్తి: సీఎండీ శ్రీధర్ ‘ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది కార్మికుల పిల్లలు కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశముంది. సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగనుంది. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా సింగరేణి చేస్తున్న కృషిలో వీరందరూ భాగస్వాములు కావాలి. కంపెనీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి..’ అని సంస్థ సీఎండీ శ్రీధర్ పిలుపునిచ్చారు. కార్మికుల భద్రత మా బాధ్యత: ఎంపీ కవిత ‘కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఇది. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి కావటంతో సింగరేణి కార్మికులకు మంచి రోజులొచ్చాయి. బొగ్గు బాయి కార్మికులు తెలంగాణ సైనికులు. వారి ఉద్యోగ భద్రత కూడా మా బాధ్యతగా భావిస్తున్నాం..’ అని కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత వారసత్వ ఉద్యోగాల నిర్ణయంపై స్పందించారు. -
వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి ఓకే
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు దశాబద్ధాలుగా నానుతోన్న వారసత్వం ఉద్యోగాల నియామకాలకు పచ్చజెండా ఊపింది. సింగరేణి బోర్డు నుంచి ఆఫ్ డైరెక్టర్స్ శుక్రవారం జరిపిన సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారిలో 48 నుంచి 58 సంవత్సరాల వయస్సుగల కార్మికులు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో.. ఆ ఉద్యోగాలను వారి కొడుకులు, తమ్ముళ్లు లేదా అల్లుళ్లకు అప్పగిం 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలని హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 1998లో పక్కనబెట్టిన వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా న్యాయపరంగా సమస్యలు రావని అభిప్రాయపడిన తర్వాతే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు అంగీకారం తెలిపామని, ఎంతోకాలంగా కార్మికులు కోరుతోన్న ఈ అంశంపై శుక్రవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని సింగరేణి చైర్మన్, సీఎండీ ఎన్. శ్రీధర్ మీడికాకు తెలిపారు. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. చారిత్రక నిర్ణయం ఎన్నో ఏళ్లుగా వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రకమని సంస్థ సీఎండీ శ్రీధర్ అభిప్రాయపడ్డారు. దీంతో అనేక మంది కార్మికుల పిల్లలు కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశం లభిస్తుందని, తద్వారా సింగరేణిలో యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో సంస్థ భాగస్వామ్యం మరింత పెరుగుందని సీఎండీ ప్రకటనలో పేర్కొన్నారు. వారసత్వ నియామకాలతోపాటు మణుగూరు ఓపెన్ కాస్ట్ లో ఓబీ తొలగింపు అనుమతి, బుల్ డోజర్ల కొనుగోళ్లు, హైవాల్ మైనింగ్, సత్తుపల్లి వాషరీల ఏర్పాటు తదితర అంశాలను కూడా బోర్డు చర్చించింది. -
‘స్వగృహ’కు బంపర్ ఆఫర్
వన్‌టైం సెటిల్మెంట్కు బ్యాంకుల అంగీకారం సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు బ్యాంకులు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. వన్‌టైం సెటిల్మెంట్ కింద సెప్టెంబర్ నాటికి ఏకమొత్తంగా వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలని అంగీకరించాయి. అప్పుపై చెల్లించే వడ్డీని ఆరు శాతానికి తగ్గించేందుకు కూడా సరేనన్నాయి. బ్యాంకర్లతో మంగళవారం స్వగృహ కార్పొరేషన్ ఎండీ శ్రీధర్ జరిపిన భేటీలో ఈ ఒప్పందం కుదిరింది. వివరాలిలా ఉన్నాయి... స్వగృహ కార్పొరేషన్ గతంలో ఐదు బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,050 కోట్ల వరకు అప్పు తీసుకుంది. ఒక్కసారి రూ.350 కోట్ల వడ్డీని మాత్రం చెల్లించింది. ఆ తర్వాత చెల్లింపులు జరిపేందుకు నిధులు లేకపోవటంతో వడ్డీ పేరుకుపోవటం మొదలైంది. ప్రస్తుతం ఏడాదికి రూ.60 కోట్లకుపైగా వడ్డీ పడుతోంది. దీంతో గతంలో తాము చెల్లించిన రూ.350 కోట్లను అసలుగా భావించటంతోపాటు, ఇక వడ్డీ విధించకుండా ఉంటే... అప్పు మొత్తాన్ని ఏక కాలంలో చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం బ్యాంకులకు ప్రతిపాదించింది. కానీ ఇది అసాధారణంగా ఉందంటూ బ్యాంకులు తిరస్కరించాయి. ఇప్పుడు వడ్డీ-అసలు అని కాకుండా అన్నీ కలిపి రూ.వేయికోట్లుగా నిర్ధారించి... చెల్లింపు జరిపే వరకు వడ్డీని, ఇప్పటివరకు ఉన్నట్టుగా 11 శాతం కాకుండా 6 శాతంగా మాత్రమే పరిగణిస్తామని బ్యాంకులు చెప్పాయి.