MDS Counselling
-
ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్లకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తగ్గించిన నీట్ కటాఫ్ స్కోర్ ఆధారంగా ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించింది. పీజీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అవకాశం కల్పించామన్నారు. వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడాలని సూచించారు. (చదవండి: ఐబీపీఎస్ పరీక్షలకు ఎస్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ) -
ఎండీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఓపెన్‌లో 139 సీట్ల భర్తీ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ డెంటల్(ఎండీఎస్) కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణకు చెందిన 277 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 139 మంది సీట్లు తీసుకున్నారు. ఏయూ పరిధిలో 47, ఓయూ పరిధిలో 58, ఎస్వీయూ పరిధిలో 23, స్టేట్‌వైడ్ కళాశాలల్లో (హైదరాబాద్, విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో 23 సీట్లకు) 11 సీట్లు భర్తీ అయ్యాయి. ఉస్మానియా వర్సిటీకి చెందిన టాప్ ర్యాంకర్ అహ్మద్ అష్వక్ హైదరాబాద్ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ఆర్థోడాంటిక్స్ సీటు తీసుకున్నారు. -
చివరి వారంలో ఎండీఎస్ కౌన్సెలింగ్
విజయవాడ: పీజీ డెంటల్(ఎండీఎస్) కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల చివరి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తొలి విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్ పూర్తయిన విషయం విదితమే. ప్రభుత్వ కళాశాలల్లో 23 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 262 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 120, ఏయూ పరి ధిలో 94, ఎస్వీయూ పరిధిలో 48 సీట్లు ఉన్నాయి. -
నేటి నుంచి ఎండీఎస్ కౌన్సెలింగ్
విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని దంతవైద్య కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్(ఎండీఎస్) సీట్ల భర్తీకి శని, ఆదివారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించనున్న ఈ కౌన్సెలింగ్‌కు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులకు సీట్ల వివరాలు తెలియచేసేందుకు పెద్ద స్క్రీన్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ సజావుగా సాగేందుకు ఒక కమిటీని కూడా నియమించారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వర్సిటీ వీసీ లాంఛనంగా కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తారు. తొలిరోజు జనరల్ కేటగిరీకి సంబంధించి ఒకటి నుంచి 400 ర్యాంకు వరకూ, ఆదివారం రెండోరోజున రిజర్వేషన్ కేటగిరీ(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ)లకు ఒకటి నుంచి చివరి ర్యాంక్ వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్సైట్ http://ntruhs.ap.nic.inను సంప్రదించవచ్చు.