
సాక్షి, హైదరాబాద్: తగ్గించిన నీట్ కటాఫ్ స్కోర్ ఆధారంగా ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
పీజీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అవకాశం కల్పించామన్నారు. వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. (చదవండి: ఐబీపీఎస్ పరీక్షలకు ఎస్టీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ)
Comments
Please login to add a commentAdd a comment