ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని దంతవైద్య కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్(ఎండీఎస్) సీట్ల భర్తీకి శని, ఆదివారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని దంతవైద్య కళాశాలలో పోస్టుగ్రాడ్యుయేషన్(ఎండీఎస్) సీట్ల భర్తీకి శని, ఆదివారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించనున్న ఈ కౌన్సెలింగ్‌కు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులకు సీట్ల వివరాలు తెలియచేసేందుకు పెద్ద స్క్రీన్‌లు, రిజిస్ట్రేషన్ కౌంటర్, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ సజావుగా సాగేందుకు ఒక కమిటీని కూడా నియమించారు.
శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వర్సిటీ వీసీ లాంఛనంగా కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తారు. తొలిరోజు జనరల్ కేటగిరీకి సంబంధించి ఒకటి నుంచి 400 ర్యాంకు వరకూ, ఆదివారం రెండోరోజున రిజర్వేషన్ కేటగిరీ(ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ)లకు ఒకటి నుంచి చివరి ర్యాంక్ వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇతర వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ http://ntruhs.ap.nic.inను సంప్రదించవచ్చు.