
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్ యూనివర్శిటీ ఎదుట పీజీ మెడికల్ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను తక్షణమే చేర్చుకోవాలని ఆందోళన చేశారు. పీజీ అడ్మిషన్లు పొందినా విద్యార్థులను చేర్చుకోకుండా ప్రవేట్ మెడికల్ కళాశాలలు కోర్టు ను ఆశ్రయించాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 56 తక్షణమే అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రవేట్ మెడికల్ కాలేజీలు వాదనల పై ఈనెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. పీజీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈనెల 27 వరకు మాత్రమే కాలేజీలో చేరేందుకు గడువు ఉంది. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో పీజీ మెడికల్ ఫీజులు తగ్గించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలిచిందని విద్యార్థులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment