ఓపెన్‌లో 139 సీట్ల భర్తీ
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ డెంటల్(ఎండీఎస్) కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణకు చెందిన 277 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 139 మంది సీట్లు తీసుకున్నారు.
ఏయూ పరిధిలో 47, ఓయూ పరిధిలో 58, ఎస్వీయూ పరిధిలో 23, స్టేట్‌వైడ్ కళాశాలల్లో (హైదరాబాద్, విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో 23 సీట్లకు) 11 సీట్లు భర్తీ అయ్యాయి. ఉస్మానియా వర్సిటీకి చెందిన టాప్ ర్యాంకర్ అహ్మద్ అష్వక్ హైదరాబాద్ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ఆర్థోడాంటిక్స్ సీటు తీసుకున్నారు.
ఎండీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం
Published Thu, May 28 2015 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM