Meat consumption
-
మాంసాహారం తినే రాష్ట్రాల్లో మనమే టాప్ప్లేస్
సాక్షి, హైదరాబాద్: పెళ్లి.. పుట్టినరోజు ఇలా ఏ దావత్ చేసినా.. ముక్కలుండాలె... ముక్కలేయకపోతే బంధాలే ముక్కలైపోతాయని బంధు ‘బలగం’మస్తుగా ఉన్న ప్రతీ కుటుంబానికీ తెలుసు. మటన్ ఓ ట్రెడిషన్‌గా మారిపోయి దేశంలోనే మన రాష్ట్రాన్ని టాప్ప్లేస్కు తీసుకెళ్లింది. జాతీయసగటు కన్నా ఎక్కువగా మాంసాన్ని మనవారు లాగించేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 70 శాతానికిపైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. దేశంలో 16.6శాతం మంది పురుషులు 29.4 శాతం మంది మహిళలు తప్ప, మిగిలిన వారంతా నాన్ వెజ్ ప్రియులేనని, ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మాంసం తినేవారేనని తేల్చింది. మనమే టాప్... దేశవ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్ 98.55, ఏపీ 98.25 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక కేజీ మాంసం ధర రూ.500 నుంచి రూ.600 మధ్య ఉండగా, మన దగ్గర రూ. 800 నుంచి రూ.1,000 వరకూ ఉంది. తెలంగాణవాసులు వారానికి కనీసం మూడుసార్లు మాంసాహారాన్ని తింటున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రతీ వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.58,000 మాంసం కోసం వెచి్చస్తున్నారని ఓ వెటర్నరీ అధికారి తెలిపారు. ⇒ రాష్ట్రంలో 2014–15లో సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 12.95 కిలోలు తినగా, అది 2021–22 నాటికి 21.17 కిలోలకు పెరిగింది. ఇప్పుడు ఆ సగటు 28.5 కిలోలకు చేరింది. ఇదే సమయంలో జాతీయ సగటు మాంసం వినియోగం దాదాపుగా 7.1 కిలోలు పైచిలుకు మాత్రమే కావడం గమనార్హం. ⇒ మన దగ్గర వినియోగిస్తున్న 28 కిలోల్లో దాదాపు 8 కిలోలు గొర్రె/మేక మాంసం కాగా (జాతీయ సగటు 3.5 కిలోలు) కాగా, ఇందులో స్వల్పంగా బీఫ్, పంది మాంసం మిగిలినది చికెన్.⇒ జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వరకూ వినియోగించవచ్చు. గొర్రె/మేక మాంస వినియోగం ఎక్కువగా ఉన్న మన దగ్గర ఉత్పత్తి సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బయట నుంచి వచ్చే మాంసం ఏదైనా కారణాల వల్ల ఆగిపోతే మాంసం కేవలం 10 రోజులు రాకపోయినా మాంసం ధర రూ.1000 పైబడుతుందని అంచనా. మటన్ క్యాపిటల్ హైదరాబాద్ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి, దిగుమతి చేసుకునే మాంసంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే మాంసాన్ని హైదరాబాద్‌లో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేయడంతో హైదరాబాద్ మాంసం సరఫరాకు కేంద్రంగా మారింది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో పాటువ్యక్తిగత వినియోగం కోసం కూడా కలిపి హైదరాబాద్‌లో ప్రతిరోజూ సుమారు 18,000కు పైగా గొర్రెలను వధిస్తున్నట్టు అంచనా.రోజుకు 50వేల వరకూ జంతువధ... తెలంగాణలో చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడ, బహదూర్‌పురా, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో కబేళాలు ఉన్నాయి. స్థానిక వినియోగం, ఎగుమతుల కోసం వేర్వేరుగా వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో అన్ని రకాల మాంసాలు కలిపి ఒక్కరోజులో 6 వేల నుంచి 7 వేల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 45వేల నుంచి 50వేల దాకా జంతువులను వధిస్తారు. ఇందులో సగంపైనే హైదరాబాద్ వినియోగానికే కేటాయిస్తున్నారు. స్వయం సమృద్ధి దిశగా... గొర్రెల ఉత్పత్తిలో మనం తొలిస్థానంలో, మాంసం ఉత్పత్తి, వినియోగం రెండింటిలో మనం ముందున్నాం. దేశంలో బీఫ్ ఎగుమతుల ద్వారా మనకు అత్యధిక ఆదాయం లభిస్తోంది. అదే సమయంలో గొర్రె/మేక మాంసం దిగుమతులు తగ్గించేందుకు, స్వయం సమృద్ధి సాధించే దిశగా పలు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. –డా.బర్బుధ్ది, డైరెక్టర్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ)ఉత్పాదకత పెంపుపై దృష్టి... రాష్ట్రంలో మాంస వినియోగం రానురానూ పెరుగుతోంది. డిమాండ్‌ను అందుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఒక గొర్రె/మేక ద్వారా వస్తున్న మాంసం పరిమాణాన్ని పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి సరైన ఆహారం అందించడం ద్వారా దిగుబడి రెట్టింపు చేసే దిశగా కృషి చేస్తున్నాం. –పి.బస్వారెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ -
మాంసం వినియోగంపై అధ్యయనం
సాక్షి, అమరావతి: మాంసం వినియోగంపై ఏపీ వ్యవసాయ మిషన్ అధ్యయనం చేస్తోంది. కొవిడ్–19 నేపథ్యంలో మాంసం వినియోగం పెరగాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ అందుకనుగుణంగా మాంసం ఉత్పత్తి లేకపోవడం, సమీప భవిష్యత్‌లో ఉత్పత్తి పెరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టిని కేంద్రీకరించింది. మాంసం ఉత్పత్తి పెరగకపోవడానికి కారణాలు, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మిషన్ ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ సిబ్బంది వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇది పూర్తయ్యాక ప్రభుత్వానికి ఏపీ వ్యవసాయ మిషన్ నివేదిక సమర్పించనుంది. దేశంలో 6 కిలోలు.. రాష్ట్రంలో 6.5 కిలోలు రాష్ట్రంలో ప్రస్తుతం గొర్రెలు 176.26 లక్షలు, మేకలు 55.22 లక్షలు, పాడిపశువులు 46,00,087, దున్నలు 62,19,499, పందులు 91958, కోళ్లు 10.75 లక్షలు ఉన్నాయి. ఒక వ్యక్తికి ఏడాదికి 11 కిలోల మాంసం అందుబాటులో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచిస్తోంది. అయితే దేశంలో 6 కిలోలు, రాష్ట్రంలో 6.5 కిలోలు మాంసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మాంసం ఉత్పత్తి పెంపుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన, పెంపకందారుల సమస్యలు, వారిని ప్రోత్సహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో వివరాలను సేకరిస్తున్నారు. వారం నుంచి రాయలసీమలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సీకె దిన్నెలోని సమీకృత గొర్రెల పెంపక కేంద్రం (గొర్రె పిల్ల పెంపకం నుంచి మాంసం ఎగుమతి వరకు)లో పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే చిన్న రైతులకు నాటుకోడి పిల్లలను పంపిణీ చేసేందుకు ఊటుకూరులో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రె పిల్లల కేంద్రాన్ని, బుక్కరాయ సముద్రంలోని లైవ్‌స్టాక్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించారు. పశుపోషకులకు మరింత లబ్ధి రాష్ట్రంలో మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇప్పటికే అల్లానా గ్రూప్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. విదేశాలకు మాంసాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి పొందిన ఈ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. పశుపోషకులకు ఈ యూనిట్ ఏర్పాటుతో మరింత లబ్ధి చేకూరనుంది. జిల్లాల్లోని పశుపోషకుల నుంచి మేలురకం మాంసం కొనుగోలు చేసి, ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు..
వారం.. వర్జ్యంతో పనిలేదు.. పగలు.. రాత్రి అన్న తేడా లేదు.. ఎప్పుడైనా.. ఎక్కడైనా... ముక్కలేనిదే ముద్ద దిగడం లేదు. నీసు లేకుంటే.. జిల్లా వాసులకు పూటగడవం లేదు.. అతిశయోక్తిగా అనిపిస్తున్నా.. ఇదే నిజం. ఎందుకంటే జిల్లాలో మాంసం వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. స్థోమతను బట్టి ఎవరికి వారు చికెన్, మటన్..చేపలు.. రొయ్యలు అంటూ.. లాగించేస్తున్నారు. జిల్లాలో గతంలో (కరోనా లాక్‌డౌన్‌కు ముందు) వారంలో సగటున 2 లక్షల నుంచి 3 లక్షల కేజీల వరకు ఉన్న మాసం వినియోగం ప్రస్తుతం.. సగటున 4 లక్షల నుంచి 5 లక్షల కేజీలకు చేరడమే ఇందుకు నిదర్శనం. సాక్షి, చిత్తూరు: జిల్లాలో మాంసం వినియోగం భారీగా పెరిగింది. మేక, గొర్రె, కోడి, కముజు పిట్టల అమ్మకాలు రోజురోజుకూ ఎక్కువౌతున్నాయి. జిల్లాలో ప్రధాన మేకల సంత అయిన తిరుపతికి ప్రతి శనివారం వేల సంఖ్యలో వచ్చే మేకలు, గొర్రెలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇక ఆదివారం మేకల, గొర్రెల మాంసం వినియోగం సుమారు 50 వేల కిలోల వరకు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం జిల్లాలో బోన్ మటన్ ధర కిలో రూ 660, బోన్‌లెస్ రూ. 750 నుంచి 800 వరకు ఉంది. వ్యాపారులు వీటిని ఎక్కువగా తిరుపతి న్యూ బాలాజీ కాలనీ సమీపంలోని మేకల సంతలో కొనుగోలు చేస్తారు. ఇవికాకుండా మొక్కుబడుల కోసం కొనుగోలు చేసే జీవాలు 500 నుంచి 800 వరకు ఉంటాయని తెలుస్తోంది. మాంసం ధరలు పెరిగినా కొనేందుకు మాత్రం వినియోగదారులు వెనుకడుగు వేయడం లేదు. చికెన్‌కే ప్రాధాన్యం.. చికెన్ కంపెనీల గుత్తాధిపత్యంతో కోడి మాంసం ధర విపరీతంగా పెరిగింది. అదే విధంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి చికెన్ ద్వారా లభిస్తుందనే ప్రచారం జరుగుతుండడంతో మాసం ప్రియలు రెచ్చిపోతున్నారు. అయిన దానికి.. కానిదానికి.. చికెన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో కోళ్ల ఫారాలు సుమారు వెయ్యికి పైగా ఉన్నాయి. వీటిలో సుమారు 1.80 లక్షల బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. మిగిలిన చోట్ల లేయర్ కోళ్లు పెంచుతున్నారు. జిల్లాలో లైవ్, స్కిన్, స్కిన్లెస్ పేరిట కోడి మాంసం వినియోగం జరుగుతోంది. జిల్లాలో రోజుకు లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలు సాగుతున్నాయి. ఇక నాటుకోడి మాంసం కిలో రూ. 500 వరకు పలుకుతుండగా.. గ్రామాల్లో కిల్లో రూ. 350 వరకు ఉంటోంది. దీంతోపాటు కముజు పిట్టల మాంసం వినియోగం కూడా పెరిగింది. పిట్ట ఒకటి రూ. 40 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో ధర రూ. 400 చొప్పున పిట్టమాసం వినియోగం రోజుకు 1000 కిలోల వరకు ఉంటోంది. ఇక జిల్లా వాసులు మాసం వినియోగం కోసం రోజూ సగటున కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) సమతుల్యత అవసరం ఆహార విషయంలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి. మాంసాహారంతో పాటు, ఆకుకూరలు తప్పని సరిగా క్రమపద్ధతిలో తీసుకోవడం మంచిది. మేక మాంసం, కోడి మాంసం తీసుకోవడం వల్ల కరోనా వ్యాధిని కట్టడి చేయవచ్చని కొన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు, వారానికి రెండు నుంచి మూడు రోజులు మాంసాహారం తీసుకుంటే వాటికి సరిసమానంగా కాయకూరలు, ఆకు కూరలు కూడా తీసుకోవాలి. తద్వారా పోషకాల్లో సమతౌల్యత వస్తుంది. – డాక్టర్ రవిరాజు, కోవిడ్–19 నోడల్ అధికారి, కార్వేటినగరం -
ముద్ద.. ముద్దకో.. ముక్క!
ము..ము..ము.. ముక్కంటే మోజు.. ముద్దల్లో ముక్కే రోజూ.. అంటున్నారు మాంసప్రియులు.. రోజులతో సంబంధం లేదు.. వారం.. వర్జ్యంతో పనిలేదు.. కిలోలకు కిలోలు లాగించేస్తున్నారు. కనీసం ఇద్దరిలో ఒక్కరికి వారంలో ఒక్కసారైనా నీసు కూర ఉండాల్సిందే.. ఆదివారం వచ్చిందంటే చాలా మంది ఇళ్లల్లో మసాలా వాసన రావాల్సిందే! వంటల మెనూలో నీసు కూర లేకపోతే ఆ రోజుకు స్పెషల్ లుక్ రాదనే చెప్పాలి. అయితే మారుతున్న కాలంలో.. ప్రతిరోజూ స్పెషల్‌గానే మారింది. ఎవరి స్థోమతను బట్టి వాళ్లు చికెన్, మటన్ వంటకాలతో ముద్ద లాగించేస్తున్నారు. జిల్లాలో ఆదివారం నాడు సుమారు 3 లక్షల కిలోలకు పైగా మాంస విక్రయాలు జరుగుతున్నాయి. వీటికోసం జిల్లావాసులు సుమారు రూ.8.50 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. సాక్షి, తాడేపల్లిగూడెం: జిల్లాలో మాంసం వినియోగం భారీగా పెరుగుతోంది. మేక, గొ ర్రె, కోడి, కవుజు పిట్టల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో ప్రధాన మేకల సంత పెదతాడేపల్లికి వా రానికి 5,000 మేకలు, గొర్రెలు వస్తుండ గా హాట్‌కేక్‌లుగా అమ్ముడవుతున్నాయి. జిల్లాలో ఆదివారం మేక, గొర్రెల మాంసం వినియోగం సుమారు 50 వేల కిలోల వరకు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం జిల్లాలో బోన్ మటన్ ధర కిలో రూ.660, బోన్సెల్ రూ.750 నుంచి 800 వరకు ధర ఉంది. మేక మాంసం దుకాణం ప్రధానంలో జిల్లాలో మాంస వినియోగానికి కావాల్సిన మేకలు, గొర్రెలను వ్యాపారులు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి మేకల సంతలో కొనుగోలు చేస్తారు. వారంలో రెండు రో జులపాటు జరిగే ఈ సంతలో మాంసం కోసం 5,000 వరకు మేకలు, గొర్రెల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవికాకుండా మొక్కుబడుల కోసం కొనుగోలు చేసే జీవాలు 500 నుంచి 1,000 వరకు ఉంటాయని అంచనా. వేట మాంసం ధరలు పెరిగినా కొనేందుకు మాత్రం వినియోగదారులు వెనుకడుగు వేయడం లేదు. చికెన్.. వినియోగం పెరిగెన్ చికెన్ కంపెనీల గుత్తాధిపత్యంతో కోడిమాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. జిల్లాలో మాంసం, గుడ్ల కోసం కోళ్లను పెంచే ఫారాలు సుమారు 250 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 1.80 లక్షల బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. మిగిలినవి లేయర్ కోళ్లు. ఇటీవల కాలంలో కోడి మాంసానికి డిమాండ్ పెరిగింది. లైవ్, స్కిన్, స్కిన్లెస్ పేరిట కోడి మాంసం వినియోగం జరుగుతోంది. జిల్లాలో రోజుకు 2.50 లక్షల కిలోల కోడి మాంసం వినియో గం జరుగుతున్నట్టు అంచనా. లెగ్ పీసులు తినే సంస్కృతి విస్తరిస్తోంది. కోడి పకోడికి క్రేజ్ పెరిగింది. బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఫారాలతో పాటు నా టు కోళ్ల ఫారాలు విస్తరిస్తున్నాయి. నా టుకోళ్ల మాంసం వినియోగం కూడా పెరగడం కారణంగా కనిపిస్తోంది. నా టు కోడి మాంసం కిలో రూ.500 వరకు పలుకుతోంది. దీంతోపాటు కముజు పిట్టల మాంసం వినియోగం కూడా పెరిగింది. పిట్ట ఒకటి రూ.40 వరకు ధర ఉంది. కిలో ధర రూ.400 వరకు పలుకుతుంది. వీటి మాంసం వినియోగం రోజుకు రెండు వేల కిలోల వరకూ ఉంది. రూ.8.50 కోట్ల వరకూ ఖర్చు వేట, కోడి, కముజు పిట్ట మాంసంపై జిల్లావాసులు రోజుకు రూ.8.50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 50 వేల కిలోల వేట మాంసం వినియోగం ఉంటే సగటున కిలో రూ.660 ధర ఉ న్నా రూ.3.30 కోట్లు అవుతుంది. కోడి మాంసం వినియోగం రోజుకు 2.50 లక్షల కిలోలు ఉంటే కిలో రూ.200 లెక్కన రూ.5 కోట్లు, కముజు పిట్టల వినియోగం 2 వేల కిలోలు ఉంటే కిలో రూ.400 లెక్కన రూ.8 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా రూ. 8.50 కోట్ల వరకూ మాంసప్రియులు వెచ్చిస్తున్నారు. -
వయసు పెంచే మాంసం
లండన్: ఆహారంలో మాంసం(బీఫ్ లేదా మటన్) అధికంగా ఉండి, పళ్లు, కూరగాయలు సరిపడినంతగా లేకపోవడం వయసు పెరిగినట్లు కనిపించేలా చేస్తుందని , అనారోగ్యానికి కారణమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. గ్లాస్గో విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దీన్ని చేపట్టారు. మాంసం వినియోగం వల్ల సీరం ఫాస్పేటు స్థాయులు పెరిగి సాధారణం కన్నా ఎక్కువ వయసు వారిగా కనిపిస్తామని పరిశోధకులు గుర్తించారు. అధిక సీరం ఫాస్పేటు స్థాయులు మూత్ర పిండాల పనితీరుపై కూడా దుష్ర్పభావం చూపుతాయని కనుగొన్నారు. సంతులిత ఆహారం తీసుకునే వారిలో ఈ లక్షణాలు లేవని నిర్ధారించారు.