Meda meeda abbayi
-
ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం
–‘అల్లరి’ నరేశ్ మేడమీద అబ్బాయి’ విడుదలైన అన్ని చోట్లా మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నరేశ్, నిఖిలా విమల్ జంటగా జి. ప్రజిత్ దర్శకత్వంలో నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ‘మేడ మీద అబ్బాయి’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నరేశ్ మాట్లాడుతూ– ‘‘స్పూఫ్‌లు లేకుండా కథను, అందులోని పాత్రలు, సన్నివేశాలు, కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించిన చిత్రమిది. సైబర్ క్రైమ్ ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతు న్నాయో చూపించి చిన్న మెసేజ్ ఇచ్చాం. చంద్రశేఖర్‌గారు ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేశారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. అప్పుడే మరిన్ని సక్సెస్‌లు సాధించొచ్చు’’ అన్నారు. ‘‘ఇది డిఫరెంట్ మూవీ అని రిలీజ్‌కు ముందే చెప్పాను. అందుకే స్లో పాయిజన్‌లా సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. కొత్త కాన్సెప్ట్ మూవీస్‌ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని మరో సారి రుజువైంది’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘మూవీ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు చంద్రశేఖర్. -
మేడ మీద అబ్బాయితో ట్రాక్ మార్చా
– ‘అల్లరి’ నరేశ్ ‘‘ఎప్పట్నుంచో ‘నరేశ్ ట్రాక్ మారిస్తే బాగుంటుంది’ అని కోరుకుంటున్నా. నాకు తానెంత మంచి నటుడో తెలుసు. కామెడీ బాగా చేస్తాడని మనందరికీ తెలుసు. కామెడీ కంటే వేరే ఎమోషన్స్‌ను ఇంకా బాగా చేయగలడు. వాటినెవరూ చూపించలేదు. నరేశ్ కూడా ‘బాబాయ్... నా సిన్మాలు చూసేవాళ్లు, అభిమానులు కామెడీ ఆశిస్తారు’ అనేవాడు. ‘కామెడీ చేశావ్ కాబట్టి చూశారు. మిగతా ఎమోషన్స్ చేస్తే నువ్వెంత మంచి నటుడివో అందరికీ అర్థమవుతుంద’ని చాలాసార్లు వాదించా. ఈ సిన్మా టీజర్ చూడగానే... నరేశ్ నటుడిగా వికసించే ప్రక్రియ మొదలైందనుకున్నా. భవిష్యత్తులో తనలోని నటుడి గురించి ప్రేక్షకులకు తెలుస్తుంది. అది ఈ సినిమాతో మొదలై, అతను మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు హీరో నాని. ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి. ప్రజీత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన సినిమా ‘మేడ మీద అబ్బాయి’. షాన్ రెహమాన్ స్వరకర్త. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో పాటల సీడీలను హీరోలు నిఖిల్, సందీప్ కిషన్ విడుదల చేశారు. నరేశ్ మాట్లాడుతూ –‘‘కొంచెం కొత్తగా, ట్రాక్ మార్చి సినిమాలు చేయమని నానితో సహా నా శ్రేయోభిలాషులు, అభిమానులు చెబుతున్నారు. ఈ సిన్మాతో ట్రాక్ మార్చా. నిర్మాతలు కథను నమ్మినప్పుడే విభిన్నమైన సినిమాలొస్తాయి. చంద్రశేఖర్‌గారు ‘కెవ్వు కేక’ నుంచి నాతో ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమా’’ అన్నారు. దర్శక–నటుడు అవసరాల, దర్శకులు ఇంద్రగంటి, దేవి ప్రసాద్ పాల్గొన్నారు. -
నాకు పవన్, మహేశ్ తెలుసు!
‘‘నాకు తెలుగు రాదు. అందువల్ల, తెలుగులో ఇంతకుముందు అవకాశాలొచ్చినా అంగీకరించలేదు. భాష రానప్పుడు దర్శకుడు ఆశించినట్లుగా చేయలేనేమోననే భయం. ‘ఒరువడక్కన్ సెల్ఫీ’ స్ఫూర్తితో రూపొందిన ఈ ‘మేడమీద అబ్బాయి’కి మలయాళంలో సినిమా తీసిన ప్రజిత్గారే దర్శకుడని ఒప్పుకున్నా’’ అన్నారు నిఖిలా విమల్. ‘అల్లరి’ నరేశ్, నిఖిలా విమల్ జంటగా బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ‘మేడమీద అబ్బాయి’ ఈ నెల 8న విడుదలవుతోంది. నిఖిలా విమల్ చెప్పిన విశేషాలు... ► తెలుగులో నా తొలి చిత్రమిది. సింధు అనే సున్నితమైన అమ్మాయి పాత్రలో కనిపిస్తా. దర్శకుడు అవ్వాలనే ఓ యువకుడి జీవితం ఒక అమ్మాయి వల్ల ఎలాంటి మలుపు తిరిగింది? అనేది చిత్రకథ. కథంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వన్ సైడ్ లవ్ నేపథ్యంలో ట్విస్టులతో రూపొందింది. ► లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఇంతకు ముందు తెలుగు సినిమాలేవీ చూడలేదు. ఈ సినిమాకు ముందు నరేశ్ గురించి తెలియదు. తర్వాత ఆయన సినిమాలు చూశా, ఆయన గురించి తెలుసుకున్నా. వెరీ ఫ్రెండ్లీ కో–స్టార్. తెలుగులో నాకు తెలిసిన హీరోలు ఇద్దరే... మహేశ్‌బాబు, పవన్‌కల్యాణ్. వారిని నేనెప్పుడూ కలవలేదు. కానీ, వాళ్లు బాగా తెలిసినవారిలా అనిపిస్తుంటారు. ► ప్రస్తుతం మోహన్‌బాబుగారు హీరోగా నటిస్తున్న ‘గాయత్రి’లో ఆయన కూతురిగా నటిస్తున్నా. ఫుల్ గ్లామరస్ రోల్స్ నాకు సరిపోవు. అందుకే, వాటికి నేను దూరం. యాక్టింగ్‌కీ, గ్లామర్‌కీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలనుంది. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నా. త్వరలో మాట్లాడతా. తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుంది. -
కొంచెం కొత్తగా చేయమన్నారు
‘అల్లరి’ నరేశ్ ‘‘గమ్యం’ సినిమాలో నేను చేసిన గాలి శీను పాత్ర నవ్విస్తూనే ఏడిపిస్తుంది. అలాంటి కథ కోసం చాలా కాలం ఎదురు చూశా. ‘నేను, గమ్యం’ చిత్రాల తరహా సీరియస్ సినిమా చేద్దామని ‘కెవ్వు కేక’ టైమ్ నుంచి చంద్రశేఖర్‌గారు అడుగుతున్నారు. కామెడీకి థ్రిల్లర్ అంశాల్ని జోడించిన అటువంటి కథే మలయాళ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’. నిర్మాతకు, నాకు బాగా నచ్చడంతో ‘మేడమీద అబ్బాయి’గా తెలుగులో రీమేక్ చేశాం’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నరేశ్, నిఖిలా విమల్ జంటగా జి. ప్రజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం నరేశ్ మాట్లాడుతూ– ‘‘మీ సినిమాలు మూస ధోరణిలో ఉంటున్నాయి. కొంచెం కొత్తగా ప్రయత్నించమని చాలామంది అడిగారు. కొత్తగా చేయాలని ఆలోచించి చేసిన ప్రయత్నమే ఈ ‘మేడ మీద అబ్బాయి’. సెప్టెంబర్ 8న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అల్లరి, ప్రాణం, గమ్యం, శంభో శివ శంభో... ఈ నాలుగు సినిమాలు కలిస్తే ఎలా ఉంటుందో ‘మేడమీద అబ్బాయి’ ఆ స్థాయిలో ఉంటుంది’’ అన్నారు నిర్మాత. నటుడు ‘హైపర్’ ఆది, రచయిత విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు ఎమ్మెస్ కుమార్, సీతారామరాజు పాల్గొన్నారు. -
డేట్ ఫిక్స్ చేసిన అల్లరోడు..!
ఒకప్పుడు వరుస హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన అల్లరి నరేష్, కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. తన మార్క్ కామెడీ సినిమాలతో పాటు ప్రయోగాలు కూడా ఫెయిల్ అవ్వటంతో ఇక రూట్ మార్చక తప్పదని నిర్ణయించుకున్నాడు. అందుకే తరహా కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్లాస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మేడ మీద అబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ సినిమా ఒరు వడక్కన్ సెల్పీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసిన ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిలా విమల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైన ఫాంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నాడు అల్లరి నరేష్. -
మంచు విష్ణుతో 'మేడ మీద అబ్బాయి'
ఇటీవల లక్కున్నోడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మంచు వారబ్బాయి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్ చేతిలో ఉన్న విష్ణు ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. తన మార్క్ కామెడీ టచ్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. రాజ్ తరుణ్ హీరోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించిన గవిరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ఓ సినిమాను అంగీకరించాడు. మేడ మీద అబ్బాయి నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. మరి అదే ప్రాజెక్ట్ ఇప్పుడు విష్ణు చేతికి వచ్చిందా..? లేక టైటిల్ ఒకరు, కాన్సెప్ట్ ఒకరు తీసుకున్నారా..? తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.