డేట్ ఫిక్స్ చేసిన అల్లరోడు..!
ఒకప్పుడు వరుస హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన అల్లరి నరేష్, కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. తన మార్క్ కామెడీ సినిమాలతో పాటు ప్రయోగాలు కూడా ఫెయిల్ అవ్వటంతో ఇక రూట్ మార్చక తప్పదని నిర్ణయించుకున్నాడు. అందుకే తరహా కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
క్లాస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మేడ మీద అబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ సినిమా ఒరు వడక్కన్ సెల్పీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసిన ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిలా విమల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైన ఫాంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నాడు అల్లరి నరేష్.