medak church 1914-1924 built time
-
కరుణామయుని కోవెలకు వందేళ్ల ఉత్సవాలు
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు...అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం... తినడానికి తిండిలేక... చేద్దామంటే పని లేక ప్రజలు ఆకలితో నకనకలాడి అలమటిస్తున్న రోజులు. మరో బాధాకరమైన విషయం... అంటురోగాలతో జనం పిట్టల్లా నేలరాలి చనిపోతున్న దుర్భరమైన పరిస్థితులు అవి. పట్టెడన్నం దొరికితేనే పంచభక్ష్యపరమాన్నాలుగా భావించి పరమానంద పడుతున్న రోజులు. సరిగ్గా ఇటువంటì దుర్భర పరిస్థితులలో దేశంకాని దేశం నుండి ఖండంతరాలు దాటి సాక్షాత్తూ పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆయన ముందుగా సికింద్రాబాద్‌లోని అప్పటి మిలటరి(ఆర్మీ) సేనకు నాయకుడిగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికే అమాయక ప్రజలనేకులు గత్తర వ్యాధితో మూకుమ్మడిగా చనిపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఆకలి తీర్చిన ఆలయం..!ఆకలితో ఎవరూ చనిపోకూడదని భావించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం తలపెట్టాడు. చర్చ్ నిర్మాణం కోసం దాదాపు 200 రకాల నమూనాలను తయారు చేశారట. వాటిలో ఏది ఉత్తమమైనదో తెలియక ఆందోళన చెందుతూ వాటన్నింటిని ముందు పెట్టుకుని మోకరిల్లి ‘పరలోకదేవా ఇందులో ఏ నమూనా ప్రకారం నిర్మించాలో దారిచూపు’ అంటూ ప్రార్థన చేయగా ఉన్నటుండి పెద్ద గాలి వచ్చి అందులోని 199 నమూనా కాగితాలు కొట్టుకుపోయి ఒకే ఒక్క నమూనా మిగిలిందట. అదే దైవ నిర్ణయంగా భావించి దాని ప్రకారం నిర్మించబడిందే ప్రస్తుత చర్చి అని పెద్దలు చెబుతున్నారు. నిర్మాణానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోక పోవడంతో స్వదేశంలో భిక్షమెత్తి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాకర్.ఈ చర్చి వల్లే ‘మెదక్’కు ఆ పేరువేలాది మంది కూలీలతో పది సంవత్సరాలపాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షనాబాద్ అని పేరు. వేలాది జనం చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావటం కోసం తండోపతండాలుగా తరలి వెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ‘మెతుకు’ కోసం పనికి వెళ్తున్నామంటూ చెప్పేవారట. దీంతో ఈ ప్రాంతం గుల్షానాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్తా రానురాను మెదక్‌గా రూపాంతరం చెందింది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే మెదక్ చర్చిని భారతీయ, విదేశీ కళానైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తయినా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల ప్రతిధ్వనులు వినిపించని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైన ఈ చర్చికి ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. చర్చి నిర్మాణానికి రాతి, డంగుసున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైనప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల ΄÷డవుతో సువిశాలమైన చర్చి చూపరులను కట్టిపడేస్తుంది.ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆసియా ఖండంలోనే అద్భుతంగా నిర్మించిన ఈ చర్చి నిర్మాణం జరిగి ఈ డిశంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. 25న క్రిస్మస్ కావడం వల్ల ఆ రోజున భక్తులప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈనెల 23న శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్చిని ముస్తాబు చేస్తున్నారు. 23న పదిహేను మంది బిషప్‌లతో ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా మెదక్ పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం చిత్రలేఖనం, నృత్యం తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్త సంబంధీకులు సైతం హాజరు అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కట్టడాన్ని మూడు గవాక్షాలు, పలు రంగుటద్దాలతో నిర్మింపజేశారు. తూర్పున ఏసుక్రీస్తు జన్మవృత్తాంతం, పడమర క్రీస్తును శిలువ వేసిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు పునరుత్థానుడై నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని తయారు చేసిన కళాకారులు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంకో ఓ, సాలిస్బర్లు. అంతే కాకుండా ఇవి సూర్యరశ్మివెలుతురులో (పగలు) మాత్రమే కనిపిస్తాయి. సూర్య అస్తమయం అయిందంటే కనిపించవు. ఈ నిర్మాణం 1914 నుండి 1924 డిశంబర్ వరకు 10 ఏళ్లపాటు జరుగగా డిశంబర్ 25న క్రిస్మస్ పర్వదినం రోజున ఆరంభించారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.–సీహెచ్. నీలయ్యసాక్షి, మెదక్ -
మెదక్ చర్చి నిర్మాణం అద్భుతం..
సాక్షి, మెదక్: వాహ్.. వండర్ఫుల్.. ఈ నిర్మాణం ప్రపంచలోనే అద్భుతం. ఆకలితో అలమటించే ప్రజల కడుపునింపి పరలోక ప్రభువు ఆలయ నిర్మాణం కావడం మహా అద్భుతమని ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి పేర్కొన్నారు. తన యాత్రలో భాగంగా గురువారం ఆయన మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ఐ చర్చ్‌ను సందర్శించారు. స్థానిక బిషప్ రెవరెండ్ సాల్మాన్రాజ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మెదక్ పట్టణంలోని ప్రధాన తపాల కార్యాలయం నుంచి సీఎస్ఐ చర్చ్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని వివిధ సంస్కృతుల కళాకారులు ఆయనకు తమ ఆహ్వానం పలికారు. ఇందులో గోండు, కోయ, లంబాడ, కోలాటం, చిరుతలు తదితర కళాకారులు నృత్యాలు చేస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు. చర్చ్ ప్రాంగణంలోని క్రైస్తవ మతాన్ని సూచించే జెండాలను జస్టిన్ వెల్‌బి దంపతులు ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల్లోని చర్చ్‌ల పాస్టర్లు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచారంలో భాగంగా సిలువతో చర్చ్ చుట్టూ ప్రదక్షణ కొనసాగించారు. అనంతరం చర్చ్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన దేవుని సందేశాన్నిస్తూ.. ప్రేమ, సమాధానం, సమానత్వం, ఒకరినొకరు ప్రేమతో గౌరవించడం దేవుని చూపిన మార్గమని, వీటిని ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. దేవుని ముందు మోకరిల్లుతూ ప్రార్థనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మెదక్ అధ్యక్ష మండలం వారు తనను ఆహ్వానించిన తీరు జీవితంలో మరిచిపోలేనిదన్నారు. తెలంగాణ కల్చర్ వివిధ నృత్యాలు, లంబాడ, గోండు, చిరుతలు, కోయ, కోలాటం, తదితర సంస్కృతులను వెలిబుచ్చిన తీరు అద్భుతమన్నారు. ఇక్కడి వేడుకలు ఇంగ్లాండ్‌కు వెళ్లి చెబితే అంతా మంత్రముగ్ధులవుతారన్నారు. ఇలాంటి గొప్ప ఆహ్వానం నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. భారత దేశంలోని కేరళ, కర్ణాటక, శ్రీలంకతోపాటు మెదక్చర్చ్లను సందర్శించడం సంతోషదాయకమన్నారు. అంతకు ముందు జుస్టిన్‌వెల్‌బి ఒక చేపకథను వివరించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి రోజంతా కష్టపడిన వలలో చేపలు పడలేవంటా. ఇది గమనించిన పరలోక దేవుడు ఓ మత్స్యకారుడా! నీవున్న చోట నుంచి కుడివైపునకు వల విసరాలని చెప్పడంతో మత్స్యకారుడు అటువైపు వల విసరడంతో అనేక చేపలు చిక్కాయని చెప్పారు. పరలోక ప్రభువు మాట వింటే అంతా మంచే జరుగుతుందని ఆయన వివరించారు. అనంతరం మెదక్ సీఎస్ఐ అధ్యక్ష మండలి బిషప్ సాల్మాన్రాజ్ మాట్లాడుతూ ఈ చర్చ్ నిర్మించిన చార్లెస్ పాస్నెట్ వాకర్ 150వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. చర్చ్ నిర్మించి నేటికి 96 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఈ చర్చ్ నిర్మించేందుకు వినియోగించిన ముడిసరుకు గురించి జస్టిన్వెల్బికి వివరించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇంగ్లాండ్ కాంటర్బరి ఆర్చ్ బిషప్ డాక్టర్ జస్టిన్ వెల్‌బి రాకతో గురువారం మెదక్‌పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. ఆయన రాక తెలుసుకొని తెలంగాణ–ఆంధ్రా రాష్ట్రాల నుంచి చర్చ్‌ల పాస్టర్లు, భక్తులు భారీగా తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు ఊరేగింపులో నిర్వహించడంతో ఆందరిని ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండుల నృత్యాలు, చిరుతలు, కోలాటం, లంబాడ నృత్యాలు సంస్కృతికి అద్దం పట్టాయి. భారీ బందోబస్తు: మతగురువు జుస్టిన్‌వెల్‌బి మెదక్‌కు రాక సందర్భంగా పట్టణంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో పట్టణంలో అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 4గంటలపాటు పట్టణంలోని చర్చ్ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో మెదక్ అధ్యక్ష మండల బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్, కరీంనగర్ బిషప్ రుబిన్మార్క్, సౌత్ ఇండియన్ డిప్యూటీ కమిషనర్ థామస్ కే ఉమన్, డిప్యూటి మోడ్రన్ డోర్నాక బిషప్, నంద్యాల బిషప్ పుష్పలలిత, కృష్ణ, గోదావరి బిషప్ జార్జ్ పెర్నాండెజ్, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన 13 జిల్లాల గురువులతోపాటు స్థానిక గురువులు అండ్రూస్ ప్రేమ్ కుమార్, సహాయక గురువులు విజయ్‌కుమార్, దయానంద్, రాజశేఖర్, ఐవాండ్, ఒలెన్పాల్, జయరాజ్, శాంతకుమార్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ చర్చి నిర్మాణ కూలీకి సన్మానం
రామాయంపేట, న్యూస్‌లైన్: ఆసియా ఖండంలోనే ప్రసిద్దమైన మెదక్ చర్చి నిర్మాణం 1914 నుండి 1924 వరకు సీడబ్ల్యూ పాస్నెట్ ఆధ్వర్యంలో జరిగింది. చర్చిని ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించారు. అయితే చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్న 110 ఏళ్ల వృద్ధురాలు రామాయంపేట మండలం తొనిగ ండ్ల గ్రామానికి చెందిన ఆటిగారి లక్ష్మమ్మను క్రిస్మస్ను పురస్కరించుకుని బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ మాట్లాడుతూ మూడు సంవత్సరాలపాటు చర్చి నిర్మించేందుకు కూలీగా వెళ్లినట్లు తెలిపారు. రామాయంపేట గ్రామ పంచాయితీ 6వ వార్డు సభ్యుడు చంద్ర ప్రతాప్(చిన్న) తొనిగండ్ల గ్రామానికి చేరుకొని లక్ష్మమ్మకు శాలువా కప్పి, పూల మాల వేసి, చీరలు ఇచ్చి సన్మానించారు. మహా దేవాలయం నిర్మాణ ంలో కూలీగా పని చేసిన లక్ష్మమ్మ సన్మానించడం తన అదృష్టమని చంద్రప్రతాప్పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలోని వృద్దులు, వితంతువులకు 16 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.