ఆర్టీఏ అధికారుల తనిఖీలు: 10 బస్సులు సీజ్
మెదక్ : మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం రవాణాశాఖ అధికారులు (ఆర్టీఏ) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేట్ బస్సులను సీజ్ అధికారులు చేశారు. అలాగే సరైన అనుమతి పత్రాలు లేకుండా నడుస్తున్న బస్సులకు అధికారులు అపరాధ రుసుం వసూలు చేశారు. ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.