Medha Towers
-
రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు
మేధా టవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేశ్ సాక్షి, అమరావతి: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విజయవాడలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఏడు ఐటీ కంపెనీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తయారీ రంగంతో పాటు టూరిజం వంటి అన్ని రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. కార్లలో ఇంటీరియర్స్ డిజైన్ చేసే గ్రూపో ఆంటోలిన్తో పాటు, మెస్లోవా, చందూ సాఫ్ట్, ఐఈఎస్, రోటోమేకర్, యామ్హై, ఈపీ సాఫ్ట్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, వీటి ద్వారా వచ్చే రెండేళ్లలో 1,600 ఉద్యోగాలు రానున్నాయని లోకేశ్ చెప్పారు. పాతదానికే కొత్త రంగు వేశాం కదా..:ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. మేధాటవర్స్ పేరుతో విజయవాడలో ప్రత్యేక ఆర్థికమండలిని ఏర్పాటు చేయించారు. ఇదే సెజ్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఉపయోగించుకుంటోంది. బుధవారం ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి వచ్చినప్పుడు లోకేశ్ దృష్టిలో పడేందుకు ఒక మీడియా ప్రతినిధి ‘సార్, మీరొచ్చాక దీనికొక కళ వచ్చింది..’ అని అనగా.. లోకేశ్ స్పందిస్తూ ‘పాతదానికే కొత్త రంగు వేశాం కదా’ అని సమాధానమివ్వడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. కాగావచ్చే ఏడాది కాలంలో లక్ష మందికి ఐటీ ఉద్యోగాలిప్పిస్తామని మంత్రి లోకేశ్ చెప్పారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఏపీలో ఐటీ సర్వీసులు ప్రారంభించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
సెజ్ నుంచి మేథా టవర్స్ డీ నోటిఫై
హైదరాబాద్: ఐటీ సెజ్ నుంచి మేథా టవర్స్‌ను డీ నోటి ఫై చేశామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. ఇక పై మేథా టవర్స్ ఐటీ సెజ్‌లోకి రాదని పేర్కొన్నారు. మేథా టవర్స్‌లో ఉన్న కంపెనీల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంగా సర్కారు మేథా టవర్స్‌ను వాడుకోనుంది. -
మేధా టవర్స్‌లోనే సచివాలయం
-
మేధా టవర్స్‌లోనే సచివాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయాన్ని కృష్ణా జిల్లా గన్నవరంలోని మేధా టవర్స్‌లోనే ఏర్పాటు చేయాలని జవహర్‌రెడ్డి నేతృత్వంలోని రాజధాని తరలింపు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సచివాలయం అంతా ఒకే ఆవరణలో ఉండాలని పేర్కొంది. సచివాలయ విభాగాలు వేర్వేరు చోట్ల ఉంటే పరిపాలనకు విఘాతం కలుగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం 5.65 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో ఉంది. మేధా టవర్స్ ప్రస్తుతం 1.75 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలంలో ఉంది. ఈ స్థలం సరిపోకపోతే మేధా టవర్స్ ఆవరణలో ఖాళీగా ఉన్న 30 ఎకరాల స్థలంలో తాత్కాలిక షెడ్లను నిర్మించి, అందులో సచివాలయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని జవహర్‌రెడ్డి కమిటీ సూచించింది. పోలీసు విభాగానికి సమస్య ఇప్పటికే పాఠశాల విద్య, ఉన్నత విద్య, వ్యవసాయ, రెవెన్యూ, పశు సంవర్థక శాఖలు విజయవాడలో కార్యాలయ వసతులను చూసుకున్నాయి. పోలీసు విభాగానికి వసతి సమస్యగా తయారైంది. పోలీసు విభాగానికి భవనాల్లో వసతిని గుర్తిస్తామని, అయితే పోలీసుల శిక్షణకు గ్రౌండ్‌తోపాటు జాగిలాలకు అవసరమైన స్థలం, వసతిని గుర్తించడం తమ వల్ల కాదని జవహర్‌రెడ్డి కమిటీ స్పష్టం చేసింది. గొల్లపూడిలో మూతపడిన ఇంజనీరింగ్ కళాశాల భవనంలోకి వెళ్లాలని వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ విభాగాలు భావిస్తున్నాయి. అయితే, ఆ భవన పటిష్టతను పరిశీలించిన తరువాతే వెళ్లాలని జవహర్‌రెడ్డి కమిటీ సూచించింది. వైద్య ఆరోగ్యం, ఇరిగేషన్, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖాధిపతులతో జవహర్‌రెడ్డి కమిటీ త్వరలో సమావేశం కానుంది. స్కూళ్లలో అడ్మిషన్లు దొరుకుతాయా? నూతన రాజధానిలోని తాత్కాలిక కార్యాలయాల్లో మార్పులు చేర్పులతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక కార్యాలయాల అద్దె చెల్లింపునకు ఏడాదికి రూ.50 కోట్లు అవసరమని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రులు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కులో చూసింది. అయితే, నూతన రాజధానికి తరలి వెళ్లే ఉద్యోగులకు, ఇతర అధికారులకు మాత్రం నివాస వసతిని ప్రభుత్వం చూడబోదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు, అధికారులు ఎవరి నివాస వసతిని వారే చూసుకోవాలని చెప్పారు. రాజధానికి తరలివెళ్తే వసతితోపాటు తమ పిల్లలందరికీ అక్కడి పాఠశాలల్లో ప్రవేశాలు దొరుకుతాయా? అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం మరోవైపు గన్నవరంలోని మేధా టవర్స్‌ను ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) పరిధి నుంచి డీ నోటిఫై చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఎస్ఈజెడ్ల నుంచి డీ నోటిఫికేషన్‌ను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మేధా టవర్స్‌ను ఎస్ఈజెడ్ పరిధి నుంచి డీ నోటిఫై చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ప్రాతిపదికన డీ నోటిఫై కోసం పట్టుపడతాయనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేధా టవర్స్ డీ నోటిఫై వ్యవహారంలో జాప్యం జరుగుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్ఈజెడ్ పరిధిలో ఉన్న మేధా టవర్స్‌ను కేంద్రం టీనోటిఫై చేస్తేనే అందులో రాష్ట్ర సచివాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. -
తాత్కాలిక సెక్రటేరియట్.. మేధా టవర్స్
సాక్షి, విజయవాడ బ్యూరో : గన్నవరం సమీపంలోని మేధా టవర్స్‌లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుపై కసరత్తు సాగుతోంది. పలు ప్రభుత్వ శాఖలను కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఐటీ సెజ్‌లో భాగంగా వైఎస్సార్ హయాంలో దీనిని 30 ఎకరాల్లో నిర్మించారు. 2006లో నిర్మాణం చేపట్టి 2010లో పూర్తిచేశారు. ఎల్ అండ్ టీ, ఏపీఐఐసీ నేతృత్వంలో సుమారు రెండు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ భవనంలో 11 వేల మంది పనిచేసేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం నాలుగు కంపెనీలు ఇందులో కొనసాగుతుండగా 20 వేల చదరపు అడుగుల స్థలం మాత్రమే వినియోగంలో ఉంది. విజయవాడలో తగినంతగా ఐటీ అభివృద్ధి లేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం మేధా టవర్స్ టీడీపీ ప్రభుత్వానికి నీడనిచ్చే కల్పతరువుగా కనిపిస్తోంది. జవహర్‌రెడ్డి ప్యానల్ సిఫారసు మేరకు... మేధా టవర్స్ విమానాశ్రయానికి అతి సమీపంలో ఉండటం దీనిని సెక్రటేరియట్‌కు ఎంపిక చేయడానికి ప్రధాన కారణమని సమాచారం. రాజధాని ప్రాంతంలోని క్యాంప్ఆఫీస్కు నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులు సమీ క్షలు, శాఖాపరమైన పనుల నిమిత్తం రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇక్కడికి రావాలని మంత్రులు, అధికారులకు కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని డిసెంబర్ నాటికి తరలించాలని భావిస్తున్నారు. మిగిలిన అధికార యంత్రాంగం 2016 మార్చి నాటికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజ ధాని ప్రాంతంలో ప్రభుత్వ శాఖలు, మంత్రుల కార్యాల యాల ఏర్పాటుకు అవసరమైన భవనాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించేలా ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. వారిలో పంచాయతీరాజ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్యాంబాబు, హౌసింగ్ సెక్రటరీ లవ్అగర్వాల్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెందిన హేమ మునిచంద్రలను నియమించారు. ఈ ప్యానల్ అవసరమైన భవంతులు, సౌకర్యాల కోసం వెదుకులాట వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మేధాటవర్స్ విశాలమైన నిర్మాణమయినందున అన్ని విధాలా బాగుంటుందని జవహర్‌రెడ్డి ప్యానల్ గట్టి ప్రతిపాదన చేసినట్టు సమాచారం. దీని సమీపంలో విశాలమైన స్థలం ఉన్నందున పార్కింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, గన్నవరం విమానాశ్రయానికి, జాతీయ రహదారికి చేరువలో ఉండటం వల్ల రవాణాకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. విశాలమైన గదులు, సమావేశాలకు సరిపడే హాళ్లు, విద్యుత్, ఫోన్, వైఫై సౌకర్యాలు కల్పించేం దుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. దేశ, విదేశీ ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు అవసరమైతే ఏ విషయమైనా పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా ఉందని తమ ప్రతిపాదనలో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. సెక్రటేరియేట్‌తో పాటు కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసే యోచన ఉంది. విజయవాడ కంటే గుంటూరులో ఇళ్ల అద్దెలు తక్కువగా ఉండటంతో అవసరమైతే గుంటూరులో మరికొన్ని శాఖలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 85 భవనాల పరిశీలన... ప్రభుత్వ శాఖలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలను ఇక్కడికి తరలించేలా అవసరమైన భవంతుల కోసం వెదుకులాటలో భాగంగా పలు ఇళ్లను గుర్తించారు. విజయవాడతో పాటు సమీపంలోని ఆరు మండలాల్లో ఇప్పటి వరకు 85 భవంతులను పరిశీలించారు. కృష్ణా జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డెరైక్టర్ శరత్‌బాబు వీటిని పరిశీలించి వాటి వివరాలు, ఫొటోలను ఉన్నతాధికారులను అందించినట్టు తెలిసింది. విజయవాడ నగరం, విజయవాడ రూరల్, పెనమలూరు, కంకిపాడు, గన్నవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో గుర్తించిన భవంతుల ఎత్తు, ఎంత విస్తీర్ణం, రహదారి, మంచినీరు, విద్యుత్ వంటి సౌకర్యాలపై పూర్తి నివేదికలను అందించారు. వాటిని పరిశీలించి అనుకూలమైన భవంతులను అద్దెకు తీసుకునేలా రాష్ట్ర స్థాయి కమిటీ సిఫారసు చేయాల్సి ఉంది.