మెడికో పీజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మెడికో పీజీ విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మత్తుమందు కలిపి ఉన్న సెలైన్‌ను ఎక్కించుకుని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జాంబాగ్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. మెడికో విద్యార్థిని శ్రావణి స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ గా పోలీసులు గుర్తించారు. శ్రావణి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేసినట్టు అఫ్జల్‌గంజ్ సీఐ అంజయ్య తెలిపారు. ప్రేమ వ్యవహారమే శ్రావణి ఆత్మహత్యకు గల కారణామని పోలీసులు అనుమానిస్తున్నారు.
శ్రావణి మోతాదుకు మించి అనస్థీషియా (మత్తుమందు) తీసుకుందని చెప్పారు. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా శ్రావణి.. తన కుటుంబ సభ్యులకు ఎస్ఎంఎస్తో సమాచారమిచ్చినట్టు సీఐ పేర్కొన్నారు. కాగా, ఓయూ పీజీ విద్యార్థిని శ్రావణి కళ్లను ఆమె కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రికి దానం చేశారు.