దూదేకుల హక్కుల కోసం పోరాటం
కడప రూరల్:
దూదేకుల హక్కుల కోసం పోరాడుదాం అని దూదేకుల నేత బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గం దస్తగిరి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియస్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన దూదేకుల సంఘీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షలు దూదేకుల వర్గీయులు ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ, ఆర్ధిక అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన తమకు నిధులను కేటాయించాని డిమాండ్ చేశారు. ఆ మేరకు దూదేకుల సోదరులు హక్కుల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రెడ్డిబాబు, సంజీవరాయుడు, చెన్నకేశవ తదితరులు పాల్గొన్నారు.