'తండ్రి నువ్వు కాదని డీఎన్ఏతో ప్రూవ్ చేయ్'
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలికి తన భర్త బ్రాడ్ పిట్పై అనుమానం మొదలైంది. మరో హాలీవుడ్ నటి మెలిస్సా ఎథెరిడ్జ్ పిల్లలకు అసలు తండ్రి తన భర్త బ్రాడ్ పిట్నేమో అనే ఆలోచన ఆమెను వేధిస్తోంది. దీంతో ప్రస్తుతం డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ఆమె బ్రాడ్ పిట్ ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష ద్వారా తాను ఎథెరిడ్జ్ పిల్లలకు తండ్రి కాదనే విషయం నిరూపించుకోవాలని ఆమె బ్రాడ్ ను గట్టిగా నిలదీసినట్లు సమాచారం.
అయితే, అసలు ఈ అనుమానం ఆమెకు ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. మరేం లేదు. మొన్న ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఎథెరిడ్జ్ మాట్లాడుతూ తనకు పిల్లలు కావాలని కోరుతూ బ్రాడ్ పిట్ శుక్రకణాలు దానం చేయాలని బ్రాడ్ పిట్ ను కోరానని తెలిపింది. కానీ, అలా జరగకపోవడంతో.. సింగర్ డేవిడ్ క్రాస్బైను సంప్రదించి అతడి స్పెర్మ్ ద్వారా ఇద్దరు సంతానాన్ని పొందినట్లు తెలిపింది. కానీ, ఈ విషయం చెప్పినప్పటి నుంచి ఎంజెలీనాకు మాత్రం కలవరింత మొదలైంది. ఆమె పిల్లల అసలు తండ్రి బ్రాడ్ పిట్ అయ్యుండొచ్చని భావిస్తూ పరీక్ష చేయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.